Karuppu Movie Review: కరుప్పు (వీరభద్రుడు) మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: సూర్య, త్రిషా కృష్ణన్, ఆర్జే బాలాజీ, ఇంద్రాన్స్, స్వసిక విజయ్, శివాడ నాయర్, అనఘా మాయ, సుప్రీత్ రెడ్డి, యోగిబాబు, మన్సూర్ ఆలీ ఖాన్, జార్జ్ మార్యన్, ఆడుకాలమ్ నరేన్, జాఫర్ సాధిక్ తదితరులు
దర్శకత్వం: ఆర్జే బాలాజీ
బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాతలు: ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు
సినిమాటోగ్రఫి: జీకే విష్ణు
ఎడిటింగ్: ఆర్ కళైవన్నన్
మ్యూజిక్: సాయి అభయంకర్
స్టంట్స్: విక్రమ్ మోర్
రిలీజ్ డేట్: 2026-05-15
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న కూతురు మీను (అనఘా రవి)కి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించాలని తండ్రి మునిస్వామి (ఇంద్రాన్స్) కలిసి చెన్నై నుంచి వచ్చి నాంపల్లి స్టేషన్‌లో దిగితే వారిని అడ్డగించి దోపిడి చేసి బంగారం చోరి చేస్తారు. దాంతో పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయడానికి వెళితే పోలీసులు సహకరించరు. చివరకు దొంగల నుంచి బంగారం రికవరీ చేస్తారు. కానీ వాటిని కోర్టు నుంచి తీసుకోవాలని చెప్పడంతో వారు కోర్టును ఆశ్రయిస్తారు. కానీ వారిని అవినీతి పరుడైన బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) ట్రాప్ చేస్తాడు. ఓ వైపు వ్యాధి తీవ్రతరం కావడం.. బేబీ కృష్ణ డబ్బు లాగుతూ బంగారం ఇప్పించకపోకపోగా జడ్జీ (నట్టి సుబ్రమణియన్)తో కుమ్మక్కై వారిని బెదిరిస్తారు. దాంతో కోర్టు ఆవరణలో ఉన్న ఆలయంలోని వీరభద్రస్వామి దేవుడిని వేడుకొంటారు. దాంతో వీరభద్రస్వామి మనిషి రూపంలో న్యాయవాదిగా వచ్చి మునిస్వామి, మీనకు తరఫున వాదించడం మొదలుపెడుతాడు.

మీను, మునిస్వామికి పోలీస్ స్టేషన్‌లో ఎదురైన ఇబ్బందులు, చేదు అనుభవాలు ఏమిటి? కేసు వాదిస్తామని చెప్పి బేబీ కృష్ణ టీమ్ ఎలా మోసగించింది? బాధితుల విషయంలో కోర్టులో న్యాయమూర్తి బిహేవియర్ ఎలా ఉంది? ప్రియ (త్రిషా కృష్ణన్) ఇలాంటి మోసాల గురించి ఎలా రియాక్ట్ అయింది? విధిలేని పరిస్థితుల్లో మునుస్వామి వీరభద్రస్వామిని ఎలా వేడుకొన్నాడు? వీరభద్రస్వామి లాయర్ రూపంలో వచ్చి ఎలా వాదించాడు? లాయర్ రూపంలో ఉన్న వీరభద్రస్వామికి బేబీ కృష్ణ విసిరిన సవాల్ ఏమిటి? వీరభద్రుడిని ప్రియా ఏం కోరుకొన్నది? ప్రియా కోరికలను వీరభద్రుడు తీర్చాడా? మీను ఆరోగ్య పరిస్థితి ఏమిటి? కోర్టులో లాయర్ సూర్యగా ఎలాంటి సమస్యలను పరిష్కరించారు? వీరభద్రుడు లీలలు ఎలా ఉన్నాయి? అనే ప్రశ్నలకు సమాధానమే తమిళంలో కరుప్ప, తెలుగులో వీరభద్రుడి సినిమా కథ.
న్యాయ వ్యవస్థలో లోపాలు, కోర్టు విచారణలో జాప్యాలు, లాయర్లు, జడ్జీల అవినీతి భాగోతాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వీరభద్రుడు సినిమా విషయానికి వస్తే.. కోర్టు ప్రోసిడింగ్స్‌కు డివైన్ అంశాన్ని జోడించి గోపాల గోపాల తరహా ఓ ఫాంటసీ పాయింట్‌తో కథను అల్లుకొన్నాడు. కానీ బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో విఫలమయ్యాడు. కొంత వరకు ఎమోషనల్ అంశాలను సరిగానే డీల్ చేసిన దర్శకుడు ఆర్జే బాలాజీ.. సెకండాఫ్‌లో ఏం చేయాలో తోచని స్థితిలోను, గందరగోళంలోను పడటం వల్ల సినిమా అనుకొనంతగా ఇంపాక్ట్ చూపలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రధానమైన పాయింట్ ఫస్టాఫ్‌లోనే ముగిసిపోతుంది. సెకండాఫ్‌లో రకరకాల అంశాలను తెరపైకి తెచ్చి సాగదీసి సాగదీసి సినిమాను ముగించడం ఈ మూవీకి మైనస్‌గా అనిపిస్తుంది.
కోర్టులో సామాన్యులకు అన్యాయం ఎలా జరుగుతుంది? బాధితుల నుంచి డబ్బు ఎలా లాగుతారు? కేసు విచారణలో జాప్యం ఎందుకు జరుగుతుంది? లాంటి అంశాలను లైవ్లీగా చూపించారు. మీను అమ్మాయికి సంబంధించిన సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. విలన్ పాత్రలో ఆర్జే బాలాజీ తేలిపోయాడనే చెప్పాలి. ఆయన కాకుండా వేరే ఎవరైనా ఉండి ఉంటే.. సూర్యకు పోటీగా మంచి నటించి ఉంటే ఇంకా బెటర్ అవుట్‌పుట్ వచ్చేదనిపిస్తుంది. త్రిషా పాత్రను పెద్దగా ఉపయోగించుకోలేకపోయారు. సూర్య ఎంట్రీ లేటు కావడం అభిమానులను మరింత నిరాశకు గురి చేస్తుంది. ఇలాంటి మైనస్‌లు సినిమాకు ప్రతికూలంగా మారాయనే ఫీలింగ్ కలుగుతుంది.
ఇక వీరభద్రస్వామిగా, సూర్యగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలను సూర్య తనదైన శైలిలో పోషించాడు. సూర్య పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉంటే చెలరేగిపోతాడనే విషయాన్ని ఆయన కొన్ని సన్నివేశాల్లో మరోసారి రుజువు చేశాడు. క్లైమాక్స్‌లో సూర్య చూపించిన యాక్టింగ్ బాగుంది. త్రిషా గ్లామర్‌గానే కాకుండా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించారు. కానీ తన పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో పూర్తిగా ఆమె తన మార్కును చూపించలేకపోయిందనే చెప్పాలి. ఆర్జే బాలాజీ ఫర్వాలేదనిపించాడు. సుప్రిత్ రెడ్డి, అనఘా, ఇంద్రాన్ తదితరులు ఫర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. సాయి అభ్యంకర్ తన మార్కును చూపించుకోలేకపోయారు. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్ వర్క్ పేలవంగా ఉంది. ఇంకా బెటర్‌గా ప్రజెంట్ చేసి ఉంటే.. స్క్రీన్ మీద ఫీల్, అవుట్‌పుట్ బాగా ఉండేదనిపించింది. ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలు, గ్రాఫిక్స్‌పై ఇంకా దృష్టి పెడితే.. ఫాంటసీ, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జోనర్‌లో బెటర్ రిజల్డ్ వచ్చి ఉండేది. కోర్టు రూమ్ డ్రామాలు, డివైన్ ఎలిమెంట్స్‌తో సోషల్ ఇష్యూస్ మీద వచ్చి సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది. ఈ వారం స్టార్ వాల్యూ, కంటెంట్ ప్రధానమైన సినిమాలను చూడాలనుకొంటే వీరభధ్రుడిపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications