Karuppu Twitter Review: కరుప్పు ట్విట్టర్ రివ్యూ.. సూర్య- త్రిష సినిమా ఎలా ఉందంటే ?

Karuppu Twitter Review: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ జంటగా నటించిన మోస్ట్ అవేటడ్ యాక్షన్ డ్రామా 'కరుప్పు'. దీన్ని తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీకి నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. అంతేకాదు కీలక పాత్రలో కూడా నటించాడు. అలాగే లేటెస్ట్ సెన్సేషన్‌ త్రిష కృష్ణన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకుంటున్నాయి. అయితే.. మే 14న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని ఆర్థిక కారణాల వల్ల షోలు రద్దు అయ్యాయి. ఈ సమస్య పరిష్కరం కావడంతో మే 15న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Also Read
చిన్నగా ఉందని ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్నా : బిగ్‌బాస్ బ్యూటీ
చిన్నగా ఉందని ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్నా : బిగ్‌బాస్ బ్యూటీ

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబులు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కరుప్పు' ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో ఆర్జే బాలాజీ, ఇంద్రణ్స్, నట్టి సుబ్రహ్మణ్యం, శ్వాసిక, శివద, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు, మన్సూర్ అలీఖాన్, జార్జ్ మరియన్, దీపా శంకర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతిక విభాగంలో జీకే విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆర్ కలైవనన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సాయి అభయంకర్ సంగీతం అందించారు.ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, 'కరుప్పు' సినిమాను దాదాపు రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన ట్వీట్లు, వారి అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

Recommended For You
'స్పిరిట్ నుండి ప్రభాస్ ఫోటో లీక్ ? డార్లింగ్ లుక్ అదిరిపోయిందిగా!
'స్పిరిట్ నుండి ప్రభాస్ ఫోటో లీక్ ? డార్లింగ్ లుక్ అదిరిపోయిందిగా!
Karuppu Twitter Review in telugu  Suriya-Trisha Action Drama Gets Positive Talk from Fans Online

సూర్య నటించిన 'కరుప్పు' సినిమా విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో భారీగా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఓ అభిమాని చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ట్వీట్‌లో ఆయన సినిమాను "Absolute cinema for Fans" అంటూ పొగిడారు. మొదటి భాగం పూర్తిగా ఎమోషన్స్‌తో నడుస్తూ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తుందని, ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం "పీక్ మోమెంట్" అంటూ హైలైట్ చేశారు.

ఇక సెకండ్ హాఫ్ పూర్తిగా సూర్య వన్‌మ్యాన్ షోగా సాగుతుందని, ఆయన పెర్ఫార్మెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సూర్య నటనను " పీక్ సూర్య " అంటూ ప్రశంసిస్తూ, ఆ సీన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇస్తాయని చెప్పారు. అంతేకాదు, క్లైమాక్స్ ఎపిసోడ్‌ను మరో లెవల్‌గా డిజైన్ చేశారని, "కాంతార" లాంటి సినిమాలు కూడా ఇక్కడ తేలిపోతాయని పోలిక ఇచ్చి తన ఎక్సైట్‌మెంట్‌ను వ్యక్తం చేశారు.

You May Also Like
ప్రేమ,పెళ్లి అంటే భయమేస్తోంది.. పెళ్లైన వారానికే షాకింగ్ కామెంట్స్
ప్రేమ,పెళ్లి అంటే భయమేస్తోంది.. పెళ్లైన వారానికే షాకింగ్ కామెంట్స్

మరో అభిమాని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తిగా ఎమోషనల్‌గా సాగిందనీ. సెకండ్ హాఫ్ మాత్రం మాస్ ఎలిమెంట్స్‌తో నిండిపోయి ప్రేక్షకులను ఉర్రూతలూగించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా టీజర్, ట్రైలర్‌లో చూపించని కొన్ని ఫాంటసీ ఎలిమెంట్స్ సినిమాలో సర్ప్రైజ్ ఫ్యాక్టర్‌గా పనిచేశాయని చెప్పారు. సెకండ్ హాఫ్‌లో ఒక ప్రత్యేక సీన్ థియేటర్లలో సుమారు రెండు నిమిషాల పాటు విసిల్స్, కేకలతో మార్మోగిపోయిందని, ఆ మాస్ మోమెంట్ ప్రేక్షకులకు పండగలా అనిపించిందని తెలిపారు. సినిమా మొత్తం థియేటర్ మోమెంట్స్‌తో నిండి ఉండటం పెద్ద ప్లస్‌గా చెప్పుకున్నారు.

టెక్నికల్‌గా కూడా 'కరుప్పు' అద్భుతంగా ఉందని, సినిమాటోగ్రఫీ (DOP వర్క్) అద్భుతంగా మెప్పించిందని, ముఖ్యంగా సాయి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ "రుద్రతాండవం"లా ఉందని ప్రశంసించారు. సూర్య నుంచి అభిమానులు కోరుకున్న పీక్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇదేనని అభిప్రాయపడ్డారు. అయితే త్రిష పాత్రకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిందని, లాజిక్ కంటే మాస్, ఎంటర్‌టైన్‌మెంట్‌కే ప్రాధాన్యం ఇచ్చిన సినిమా ఇదని స్పష్టం చేశారు. 'కరుప్పు' ఒక సాటిస్ఫైయింగ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిందని, థియేటర్‌లో ఎంజాయ్ చేయాల్సిన మాస్ ప్యాకేజీ అని రాసుకొచ్చారు.

'నా కూతురు ఎవరితో డేటింగ్ చేసిన ఓకే.. పెళ్లి తప్పనిసరేం కాదు’
'నా కూతురు ఎవరితో డేటింగ్ చేసిన ఓకే.. పెళ్లి తప్పనిసరేం కాదు’

మరో అభిమాని.. 'కరుప్పు' ఒక పక్కా మాస్ కమర్షియల్ సినిమా అని స్పష్టం చేశారు. ఎమోషన్స్, కామెడీ, సెటైర్లు, మాస్ ఎలిమెంట్స్, గూస్‌బంప్స్, మెసేజ్, మ్యూజిక్-ఇలా ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. "బ్రెయిన్ బయట పెట్టి థియేటర్‌లోకి వెళ్లండి... ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ" అంటూ ఆయన చెప్పిన మాటలు సినిమాకు సరైన టోన్‌ను సెట్ చేస్తున్నాయి. లాజిక్ గురించి ఆలోచించకుండా చూసే వారికి ఈ సినిమా పూర్తి స్థాయిలో సంతృప్తి ఇస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రత్యేకంగా సూర్య నటనను ప్రశంసిస్తూ... ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో పెద్ద విజయంగా నిలుస్తుందని చెప్పారు. దర్శకుడు ఆర్జే బాలాజీ పనితనం, అలాగే సాయి అభయంకర్ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్రధాన బలం అని పేర్కొన్నారు. 'కరుప్పు' ఒక పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తోందని, థియేటర్‌లో ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ మూవీ అని రాసుకొచ్చారు.

రామ్ చరణ్ 'పెద్ది' పవర్ ప్లే టూర్ .. బుచ్చి బాబు క్రేజీ ప్లానింగ్!
రామ్ చరణ్ 'పెద్ది' పవర్ ప్లే టూర్ .. బుచ్చి బాబు క్రేజీ ప్లానింగ్!

మరో సినీ అభిమాని ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని షేర్ చేస్తూ సినిమాను ప్రశంసించాడు . ఆయన రివ్యూ ప్రకారం... సినిమా ఫస్ట్ హాఫ్ మంచి కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని, కథ బాగానే బిల్డ్ అవుతుందని తెలిపారు. ఇక సెకండ్ హాఫ్‌లో మాత్రం యాక్షన్ ఎలిమెంట్స్ మరింత హై లెవెల్‌కు వెళ్లి ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ఇస్తాయని చెప్పారు. సినిమా మొత్తాన్ని సూర్య తన భుజాలపై మోసేశాడని, ఆయన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం అని అభిప్రాయపడ్డారు. త్రిష పాత్ర బాగానే ఉన్నప్పటికీ, సినిమా హైలైట్ మాత్రం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అని, చాలా రోజుల తర్వాత ఇలాంటి ఇంపాక్ట్‌ఫుల్ BGM వినిపించిందని పేర్కొన్నారు. మొత్తానికి 'కరుప్పు' ఒక మంచి కమర్షియల్ సినిమా అని, థియేటర్‌లో చూసేందుకు విలువైన ఎంటర్‌టైనర్ అని చెప్పారు. సుమారు 3.75/5 రేటింగ్ ఇస్తూ, "వాచ్ చేయదగ్గ సినిమా"గా అభివర్ణించారు.

3 పెళ్లిళ్లతో 17 ఏళ్లు వృథా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
3 పెళ్లిళ్లతో 17 ఏళ్లు వృథా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'కరుప్పు' సినిమాకు సోషల్ మీడియాలో పాజిటివ్ బజ్ పెరుగుతోంది. తాజాగా ఓ నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేసిన రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన అభిప్రాయం ప్రకారం... సినిమా ఫస్ట్ హాఫ్ యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌తో బలంగా నడుస్తుందని, సెకండ్ హాఫ్ పూర్తిగా కమర్షియల్ టచ్‌తో హై మోమెంట్స్, రిఫరెన్స్‌లతో ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు. ప్రత్యేకంగా సూర్య 'కరుప్పసామి' పాత్రలో అద్భుతంగా నటించారని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రశంసించారు.

దర్శకుడు ఆర్జే బాలాజీ రైటింగ్ చాలా ప్రిసైజ్‌గా ఉందని, సాయి అభయంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఎలివేట్ చేసిందని పేర్కొన్నారు.ఇక త్రిష, నట్టి సుబ్రహ్మణ్యం, ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారని, ముఖ్యంగా ఇంటర్వెల్, ప్రీ-క్లైమాక్స్, సాంగ్స్ సినిమాకు హైలైట్ మోమెంట్స్‌గా నిలిచాయని చెప్పారు. ఈ సినిమా ఒక మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిందని, ముఖ్యంగా థియేటర్‌లో చూడాల్సిన సినిమా అని స్పష్టం చేశారు. సుమారు 4.25/5 రేటింగ్ ఇస్తూ "వర్థ్ వాచ్చింగ్" అంటూ సిఫారసు చేశారు.

Read more about: suriya trisha krishnan Karuppu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X