twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాశి సినిమా రివ్యూ: ఆకట్టుకొని కాశీ మజిలీ కథలు

    By Rajababu
    |

    Rating:
    1.5/5
    Star Cast: విజయ్ ఆంటోని, అంజలి, సునయన శిల్ప మంజునాథ్
    Director: కృతింగ ఉద్యాననిధి

    బిచ్చగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోని వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఆ తర్వాత వరుసగా బేతాలుడు, యమన్, ఇంద్రసేన చిత్రాలతో అలరించాడు. భేతాలుడు తర్వాత వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. ఈ చిత్రాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాశీ. తమిళంలో రూపొందిన కాళీ చిత్రానికి ఇది రీమేక్. మదర్ సెంటిమెంట్ పాయింట్‌తో రూపొందిన చిత్రం మే 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాశీ చిత్రంతో బిచ్చగాడు లాంటి హిట్ అందుకొన్నాడా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    కాశి మూవీ స్టోరి

    కాశి మూవీ స్టోరి

    భారత్ (విజయ్ ఆంటోని) న్యూయార్క్ సిటీలో డాక్టర్. అతనికి తల్లి సంబంధించిన కలలు వెంటాడుతుంటాయి. ఎద్దు పొడిచినట్టు, ఓ పెద్ద పాము కలలోకి వస్తుంటాయి. ఈ క్రమంలో తనను పెంచిన తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చినవారు కాదని తెలుసుకొంటాడు. తన తల్లిదండ్రులు ఎవరని తెలుసుకొనేందుకు బయలుదేరుతాడు. ఆ క్రమంలో తన చిన్నతనంలోనే తల్లి మరణించిందని, తన అసలు పేరు కాశీ అని తెలుసుకొంటాడు. ఆ తర్వాత తన తండ్రి కోసం వెతుకులాటను ప్రారంభిస్తాడు. ఆ నేపథ్యంలో కంచెర్లపాలెం చేరుకొంటాడు. అక్కడ ఆయుర్వేద డాక్టర్ (అంజలి) పరిచయం అవుతుంది.

    మరోసారి తల్లి సెంటిమెంట్‌తో

    మరోసారి తల్లి సెంటిమెంట్‌తో

    తన తల్లి మరణానికి కారణమేమిటి? తన తండ్రిని చివరకు కలుసుకొన్నారా? చిన్నతనంలో ఏ పరిస్థితుల్లో తల్లిదండ్రులకు దూరమయ్యాడు. తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోనే ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తనకు పరిచయమైన అంజలి ప్రేమను అంగీకరించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే కాశి సినిమా కథ.

     తొలిభాగంలో

    తొలిభాగంలో

    తొలిభాగంలో తల్లిదండ్రులను తెలుసుకొనే ఓ లక్ష్యంతో అమెరికాలో మొదలైన కథ కంచెర్లపాలెంకు చేరుతుంది. రకరకాల వ్యక్తులను కలుస్తూ తన తల్లిదండ్రులను కలిసే ప్రయత్నం చేస్తాడు. విరామానికి ముందు ఓ ఎపిసోడ్, ఆ తర్వాత నాజర్ ఎంట్రీతో ఆసక్తి రేపి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఫస్టాఫ్‌ ముగుస్తుంది.

    తొలిభాగంలో

    తొలిభాగంలో

    ఇక సెకండాఫ్‌లో తన తండ్రి నాజర్ అనే కోణంలో మరో కథ మొదలవుతుంది. తీరా కథ అంతా నడిచాకా ప్రేక్షకుడికి ప్రశ్నలు తప్ప సమాధానం దొరకదు. ఇక చర్చి ఫాదర్ క్యారెక్టర్‌తో కథ క్లైమాక్స్ చేరుతుంది. సినిమా మొత్తంలో ఫాదర్ లవ్ స్టోరి మాత్రమే కొంత మెరుగ్గా ఉంటుంది. తన తండ్రి ఎవరో తెలుసుకొన్నాక.. ఓ భావోద్వేగమైన పాయింట్‌తో కాశి సినిమా ముగస్తుంది. ఏ ఒక్క సీన్‌లో చూసిన తెలుగు నేటివిటి ఎక్కడా కనిపించదు. తమిళ వాసనను భరించడం చాలా కష్టంగానే ఉంటుంది.

    విజయ్ ఆంటోని నటన

    విజయ్ ఆంటోని నటన

    బిచ్చగాడు చిత్రం విజయం తర్వాత టాలీవుడ్‌లో విజయ్ ఆంటోనికి ప్రత్యేకంగా ఓ అభిమాన గణం ఏర్పడింది. విభిన్నమైన చిత్రాలకు విజయ్ ఆంటోని చిత్రాలు కేరాఫ్ అడ్రస్ అని నమ్ముతారు. ఆ క్రమంలోనే వచ్చిన భేతాలుడు, యమన్, ఇంద్రసేన చిత్రాలు ప్రేక్షకులకు నిరాశను మిగిల్చాయి. అయినా విజయ్ ఆంటోనిపై క్రేజ్ తగ్గలేదు. కానీ తల్లిదండ్రులను తెలుసుకొనే కీలకపాయింట్‌ను పక్కన పెట్టి వివిధ రకాల గెటప్స్‌, కథకు సంబంధం లేని ఎపిసోడ్స్‌తో సహనానికి పరీక్షపెట్టినట్టు కనిపిస్తాడు. వివిధ గెటప్స్‌తో తనదైన శైలిలో మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ప్రేక్షకుల అభిరుచికి చాలా దూరంగా ఉండటమనేది ఈ సినిమాకు ప్రధానమైన లోపం.

    డైరెక్టర్ పనితీరు

    డైరెక్టర్ పనితీరు

    కాశి సినిమా కథను ప్రధానంగా విజయ్ అంటోనిని కేవలం వివిధ గెటప్స్‌లో చూపించడానికి దర్శకురాలు కృతింగ ఉద్యాననిధి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. కథను చెప్పే తీరు చాలా నిస్తేజంగా సాగుతుంది. ఓ దశలోనూ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేసే సన్నివేశాలు కనిపించవు. పాయింట్‌లో డెప్త్ ఉన్నప్పటికీ.. కథ, కథనాలపై కసరత్తు చేయకపోవడమే ప్రధాన లోపంగా కనిపిస్తుంది.

    హీరోయిన్‌గా అంజలి

    హీరోయిన్‌గా అంజలి

    కాశి చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా అంజలి కనిపించింది. అంతగా ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించింది. కనీసం ఓ పాట కూడా లేకపోవడం తెలుగు ప్రేక్షకులకు నిరాశను కలిగించే అంశం. అంజలి పాత్ర ఎందుకు పెట్టారో అనే సందేహం కూడా రాకమానదు. విజయ్ ఆంటోని సరసన మిగితా ఎపిసోడ్స్‌లో అమృత అయ్యర్, శిల్పా మంజునాథ్‌ హీరోయిన్లుగా నటించారు.

    విజయ్ ఆంటోని మ్యూజిక్

    విజయ్ ఆంటోని మ్యూజిక్

    విజయ్ ఆంటోని మ్యూజిక్ విషయానికి వస్తే రీరికార్డింగ్ ఫర్వాలేదనే విధంగా ఉంటుంది. పాటలు తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకలేకపోయాయి. ఓవరాల్‌గా ఈ చిత్రానికి సంగీతం మైనసే అని చెప్పవచ్చు.

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాలు

    కాశి చిత్రంలో ఉన్నంతలో ఏదైనా ఆకట్టుకునేదేమైనా ఉందంటే అవి ఫైట్స్. ఫైట్స్ కొత్తగా కంపోజ్ చేశారు. ఎడిటింగ్ విభాగం మరింత శ్రద్ధ పెట్టాలనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సన్నివేశాల్లో రిచర్డ్ ఎం నాథన్ ఫొటోగ్రఫీ ఆకట్టుకొంటుంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    తల్లి సెంటిమెంట్‌ ప్రధాన అంశంగా ఉప కథలతో కాశి చిత్రం ఓ ప్రయోగంలా కనిపిస్తుంది. ఉప కథలను బలంగా రాసుకొని ఉంటే కాశి మళ్లీ ఆకట్టుకొనేవాడు. గజదొంగ, ఫాదర్, కాలేజీలో లీడర్ లాంటి పాత్రలు చాలా వెగటుపుట్టిస్తాయి. లాజిక్కులే కనిపించవు. అర్థం పర్థం లేకుండా కథ నడుస్తుంది. విజయ్ ఆంటోని సినిమాలు బాగుంటాయనే ఫీలింగ్ ఇప్పటి వరకు ప్రేక్షకుల్లో ఉంది. కానీ కాశి చూసిన తర్వాత మరో సినిమా రిలీజైతే ఓ సారి ఆలోచించాల్సిన పరిస్థితి కలగడం చాలా సహజమైన విషయం.

     బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్

    • విజయ్ ఆంటోని యాక్టింగ్
    • ఫైట్స్
    • మైనస్ పాయింట్స్

      • కథ, కథనం
      • మ్యూజిక్
      • ఎడిటింగ్
      • తెర వెనుక, తెర ముందు

        తెర వెనుక, తెర ముందు

        నటీనటులు: విజయ్ ఆంటోని, అంజలి, సునయన శిల్ప మంజునాథ్, అమృత, నాజర్ తదితరులు
        దర్శకులు: కృతింగ ఉద్యాననిధి
        నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోని
        మ్యూజిక్: విజయ్ ఆంటోని
        సినిమాటోగ్రఫి: రిచర్డ్ ఎం నాథన్
        విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్
        రిలీజ్ డేట్: మే 18, 2018

    English summary
    Vijay Antony’s much-awaited thriller ‘Kasi’ is hits screens on May 18. ‘Kasi’ landed in a controversy after a court case was filed seeking to stall the release of the film. Directed by Kiruthiga Udhayanidhi, the film looks to be an intriguing thriller with twists and turns. Anjali, Nazar are the in important roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X