Katha Venuka Katha Review ట్విస్టులతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్
నటీనటులు: విశ్వాంత్, సునీల్, రఘుబాబు, సత్యం రాజేశ్, మధునందన్ తదితరులు
దర్శకత్వం: కృష్ణ చైతన్య
నిర్మాత: దండమూడి అవనింద్ర కుమార్
మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫి: శేఖర్ గంగమోని
ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల
ఆర్ట్: వెంకట్ సలాపు
రిలీజ్ డేట్: 2023-05-12
సినిమా దర్శకుడు కావాలనుకొనే అశ్విన్ (విశ్వాంత్ దుడ్డుంపూడి) తన మేనమామ కూతురు శైలజను ప్రేమిస్తుంటాడు. అయితే పెళ్లి చేసుకోవాలని తన కోరికను మేనమామతో చెప్పినప్పుడు.. జీవితంలో ఏదైనా సాధించి రా.. నా అమ్మాయిని ఇస్తానని అంటాడు. ఆ క్రమంలో కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమానికి కథ చెప్పగానే సినిమా తీయడానికి ముందుకొస్తాడు. అయితే సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత ప్రమోషన్స్‌కు డబ్బులు లేవని నిర్మాత చేతులెత్తేస్తాడు. దాంతో అశ్విన్ ఓ ప్లాన్ వేస్తాడు.

తన సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి అశ్విన్ ఎలాంటి ప్లాన్ చేశాడు? అశ్విన్ దర్శకత్వంలో నటించిన హీరోయిన్ అమృత అదృశ్యం వెనుక కారణం ఏమిటి? అశ్విన్ సినిమాల్లో నటించిన రాజు ఎలా చనిపోయాడు? అశ్విన్ సినిమాల్లో నటించిన వారు కనిపించకుండా పోయిన వారిని వెతికేందుకు పోలీస్ ఇన్స్‌పెక్టర్ సత్య (సునీల్) ఎలా కేసును పరిశోధించాడు. ఐదుగురు కనిపించకుండా పోవడం వెనుక కారణం ఎవరు? ఇన్స్‌పెక్టర్ సత్య నిజస్వరూపం ఏమిటి? నిర్మాత పరిస్థితి చివరకు ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే కథ వెనుక కథ సినిమా స్టోరి.
అశ్విన్ ప్రేమ కథ, సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడు కావాలనుకొనే అంశాలతో కథ మూములుగానే సాగుతుంది. అంతా సవ్యంగా జరిగిందనుకొనే సమయంలో సినిమా పూర్తవ్వడం.. ఆ తర్వాత నిర్మాత డబ్బులు లేవని చేతులెత్తేయడంతో కథ మరో కోణంలోకి వెళ్తుంది. అశ్విన్ సినిమాలో నటించిన ఐదుగురు అదృశ్యం కావడం మీడియా సంచలనంగా మారుతుంది. ఫస్టాఫ్‌లో కథ సాఫ్ట్‌గా సాగుతుంది.
కథ వెనుక కథ సినిమా సెకండాఫ్ విషయానికి వస్తే.. ఊహించని మలుపులు తీసుకోవడం, లాజిక్స్ లేకుండా సాగడం కొంత కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి నిర్మాత యాంగిల్‌లో కథ నడిపించిన విధానం బాగుంది. అప్పటికే ప్రేక్షకుడి సహనానికి కొంత పరీక్షగా మారుతుంది. అలాంటి సమయంలో ఇన్స్‌పెక్టర్ సత్యకు సంబంధించిన కథను ప్రెష్‌గా స్టార్ట్ చేయడం చిన్న ట్విస్టుగా మారుతుంది. కానీ సత్య యాంగిల్‌లో ఊహించడానికి కూడా కష్టంగా ఉంటుంది.
నటీనటుల విషయానికి వస్తే.. డైరెక్టర్ అశ్విన్‌గా విశ్వాంత్‌కు డిఫరెంట్ రోల్ అని చెప్పవచ్చు. మల్టీ లేయర్ పాత్ర అయినప్పటికీ.. కథ, కథనాల్లో బలం లేకపోవడం వల్ల ఆయన పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక సత్యగా సునీల్ పాత్ర కూడా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. రాజ్ (సత్యం), రవి పాత్రలు తెరపైకి వచ్చి కథను ముందుకు తీసుకెళ్తాయి. నిర్మాతగా జయప్రకాశ్ పాత్ర కొత్తగా ఉంటుంది. రఘుబాబు, మధునందన్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఫర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన సాధారణ చిత్రం కథ వెనుక కథ. రకరకాల ట్విస్టులు, అనవసరమైన అంశాలు తీసుకు రావడం వల్ల కథ వెనుక కథలోని ఇంటెన్స్ తేలిపోయిందని చెప్పవచ్చు. కథకు బలంగా అనిపించే సత్య క్యారెక్టర్ ఎపిసోడ్‌ను చివరి నిమిషంలో తీసుకు రావడం వల్ల దాని పర్పస్ సాల్వ్ కాలేదనిపిస్తుంది. సునీల్ క్యారెక్టర్‌ను సెకండాఫ్‌లో మెయిన్ ప్లాట్‌గా తీసుకొంటే బాగుండేదనిపిస్తుంది. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి కథ వెనుక కథ నచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











