For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘కథనం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

|

Rating:
2.5/5

న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి, ఆపై టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ తక్కువ కాలంలో తన అందం, టాలెంటుతో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ కావడం, ఆకట్టుకునే అందం కూడా ఉండటంతో ఆమెకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. రంగస్థలం మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో రంగమ్మత్త పాత్రలో ప్రేక్షకులను అలరించిన అనసూయ ఇప్పటి వరకు చేసిన చిత్రాలన్నింటిలో సైడ్ రోల్స్ మాత్రమే నటించింది. తొలిసారిగా ఆమె లీడ్ రోల్ చేస్తూ తెరకెక్కిన చిత్రం 'కథనం'. 'కథనం' కథా కమామిషు ఏమిటి? అనేది సమీక్షిద్దాం.

కథ

కథ

అను(అనసూయ) సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూ డైరెక్షన్ ఛాన్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. తన వద్ద ఉన్న కథతో చాలా మంది నిర్మాతలను కలుస్తుంది కానీ ఎలాంటి ఫలితం ఉండదు. ఇలా ప్రయత్నాలు చేస్తుండగా... ఓ రోజు నిర్మాతల నుంచి ఫోన్ వస్తుంది. మాకు ఏ కథలు నచ్చడం లేదని, తమ వద్ద ఉన్న కథనే తీయాలని చెప్పడంతో ఓకే అంటుంది. ఆ కథను డెవలప్ చేసి సినిమా మొదలు పెట్టే సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ కథలో ఉన్నట్లే బయట కొన్ని హత్యలు ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. హత్య చేయబడింది ఎవరు? ఈ హత్యల వెనక ఉన్నది ఎవరు? అనేది తర్వాతి కథ.

అనసూయ పెర్ఫార్మెన్స్

అనసూయ పెర్ఫార్మెన్స్

అనసూయ ఈ చిత్రంలో అను, అరవింద అనే రెండు పాత్రల్లో నటించింది. గత సినిమాలతో పోలిస్తే అనసూయ నటన పరంగా చాలా మెరుగైంది. అసిస్టెంట్ డైరెక్టర్ అను పాత్రలో, అరవింద అనే పవర్ ఫుల్ లేడీ పాత్రలో మెప్పించింది. అందంగా కనిపించడంతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో సైతం అదరగొట్టింది.

ఇతర నటీనటులు

ఇతర నటీనటులు

అనసూయ ఫ్రెండ్ పాత్రలో ధనరాజ్ బాగా చేశాడు. సికె అలియాస్ క్రియేటివ్ కిషోర్ అనే రచయిత పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వించే ప్రయత్నం చేశారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అవసరాల శ్రీనివాస్ పోషించిన విలన్ పాత్ర అంత బలంగా లేదు. తన పాత్ర పరిధి మేరకు అవసరాల పర్వాలేదనిపించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రణదీర్ ఫర్వాలేదు.

టెక్నికల్ అంశాల పరంగా

టెక్నికల్ అంశాల పరంగా

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీతం అందించారు. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదనే విధంగా ఉన్నాయి. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ ఓకే. ఎస్‌.బి. ఉద్ద‌వ్‌ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బావుండేది. ఇతర టెక్నికల్ విభాగాల పని తీరు యావరేజ్‌గా ఉంది.

ఫస్టాఫ్ ఎలా ఉంది?

ఫస్టాఫ్ ఎలా ఉంది?

‘కథనం' మొదటి భాగం అనసూయ డైరెక్షన్ ఛాన్స్ కోసం వెతకడం, సినిమా అవకాశం వచ్చిన తర్వాత ఊహించని విధంగా హత్యలు జరుగడం లాంటి సన్నివేశాలతో కాస్త సరదాగా, సస్పెన్స్‌గా సాగుతుంది. ఈ హత్యలు ఎలా జరుగుతున్నాయి? అసలు ఏం జరుగుతోందో అనే ఉత్కంఠ ప్రేక్షుకుల్లో క్రియేట్ అవుతుంది.

సెకండాఫ్ రివేంజ్ డ్రామా

సెకండాఫ్ రివేంజ్ డ్రామా

సినిమా సెకండాఫ్‌లోకి ఎంటరవ్వగానే... కథ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళుతుంది. ఇదో రివేంజ్ డ్రామా అనే విషయం అర్థమవుతుంది. అప్పటి నుంచి సినిమా ఎలా ముందుకు వెళుతేందో ప్రేక్షకుడు ముందే ఊహించే విధంగా ఉంటుంది.

ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

అనసూయ పెర్ఫార్మెన్స్

ఇంటర్వెల్ బ్యాంగ్

మైనస్ పాయింట్

రోటీన్ రివేంజ్ కథ

సెకండాఫ్‌ నడిచిన తీరు

క్లైమాక్స్ ఆకట్టుకునే విధంగా లేక పోవడం

డైరెక్షన్, స్క్రీన్ ప్లే

డైరెక్షన్, స్క్రీన్ ప్లే

రివేంజ్ డ్రామాను మూలకథగా ఎంచుకున్న దర్శకుడు సస్పెన్స్ కొనసాగిస్తూ చివరి వరకు కథను నడిపించాలని చూశాడు. అయితే తాను అనుకున్న విషయాలన్ని ఆసక్తికరంగా ఎగ్జిక్యూట్ చేయలేక పోయాడు. ముఖ్యంగా ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బలంగా లేకపోవడం, రెండొ భాగంలోకి ఎంటరైన తర్వాత ప్రేక్షకుడు కథ ముందే ఊహించే విధంగా ఉండటం, ఆసక్తికర అంశాలు ఏమీ లేక పోవడంతో బోర్ ఫీలింగ్ వస్తుంది. ‘కథనం' లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే బలంగా ఉండాలి, కానీ ఈ సినిమాకు అదే కాస్త మైనస్ అయింది.

శ్రీకాకుళం కిడ్నీ సమస్యల నేపథ్యాన్ని

శ్రీకాకుళం కిడ్నీ సమస్యల నేపథ్యాన్ని

శ్రీకాకుళంలోని ఓ ప్రాంతంలో కిడ్నీ సమస్యల నేపథ్యాన్ని ఈ మూవీకి బ్యాక్ డ్రాపుగా ఎంచుకుని కథ రాశారు. రివేంజ్ డ్రామా వెనక సరైన స్క్రిప్టు వర్క్ లేక కథ తేలిపోయినట్లయింది. సినిమాలోని క్యారెక్టర్లను కూడా బలంగా డెవలప్ చేయలేకపోయారు.

చివరగా...

చివరగా...

కథనం అనేది ఒక సాధారణ రివేంజ్ డ్రామాతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్. కొత్తదనం ఆశించే వారు ఈ సినిమాతో సంతృప్తి పడకపోవచ్చు. అనసూయ అభిమానులు దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు అనే అంశంపై జయాపజయాలు ఆధారపడి ఉంటాయి.

నటీనటులు, టెక్నీషియన్స్

నటీనటులు, టెక్నీషియన్స్

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి త‌దిత‌రులు

ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః బాలాజీ శ్రీ‌ను

ఎడిట‌ర్ఃఎస్‌.బి. ఉద్ద‌వ్‌

మ్యూజిక్ః రోషన్ సాలూరి

ఆర్ట్ డైరెక్ట‌ర్ః కె.వి.ర‌మ‌ణ‌

రచయిత : రాజేంద్ర భరద్వాజ్

డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీః స‌తీష్ ముత్యాల‌

లైన్ ప్రొడ్యుసర్ : ఎమ్‌.విజ‌య చౌద‌రి

నిర్మాత‌లుః బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా,

క‌థ‌, స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వంఃరాజేష్ నాదెండ్ల‌

విడుదల తేదీ: ఆగస్టు 9, 2019

English summary
Kathanam movie review and rating. Anasuya plays an assistant director who gets suspected as the culprit in a murder, as all the proceedings take place according to her penned script for a feature film.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more