Kattalan Twitter Review: కాటాలాన్ మూవీ ట్విట్టర్ రివ్యూ
మలయాళంలో యువ నటుడు ఆంటోని వర్గీస్, దుషారా విజయన్ జంటగా నటించిన చిత్రం కాటాలాన్. ఈ చిత్రంలో తెలుగు నటుడు సునీల్, బాలీవుడ్ నటుడు కబీర్ దుహాన్ సింగ్, మలయాళ నటులు సిద్దిఖీ, జగదీష్, అన్సాన్ పాల్ తదితరులు నటించారు. స్టార్ హీరో ఉన్ని ముకుందన్ అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమాను క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహ్మద్ నిర్మించారు. ఈ చిత్రానికి పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా సాంకేతిక విబాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: రెనడైవ్, చంద్రు సెల్వరాజ్, సందీప్ ఎలామన్, మ్యూజిక్: అజనీష్ లోకనాథ్, రవి బస్రూర్ (పాటలు), బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవి బస్రూర్, ఎడిటింగ్: షామీర్ మహ్మద్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మే 28వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా గురించి క్రిటిక్స్, నెటిజన్లు ఇచ్చిన అప్ డేట్స్ ఏమిటి? ఈ మూవీ గురించి సినిమా యూనిట్ వెల్లడించిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..
కాటాలన్ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. ఎండ్ టైటిల్స్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఈ సినిమాను పూర్తిగా అయిపోయేంత వరకు చూడండి. ముఖ్యంగా పోస్ట్ క్రెడిట్స్‌లో ఓ సర్‌ప్రైజ్ ఉంటుంది. కాబట్టి థియేటర్ యాజమాన్యం కూడా ఈ సినిమా పూర్తయ్యేంత వరకు లైట్లు ఆర్పే ఉంచాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు.

కాటాలన్ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు. ఇప్పటికే మోహన్ లాల్‌తో నిర్మాత చర్చలు జరిపారు. ఈ చిత్రానికి రూపొందనే సీక్వెల్‌లో మోహన్ లాల్ లార్డ్ మార్కోగా కనిపించబోతున్నారు. ఈ సినిమా ఎండ్ టైటిల్‌లో మోహన్ లాల్ గ్లింప్స్ ఉంటుంది అంటూ ఆసక్తిని చిత్ర యూనిట్ రేపింది.
కాటాలన్ సినిమా పవర్ ప్యాక్ట్ ఎంటర్‌టైనర్. క్యూబ్స్ బ్యానర్ నుంచి గతంలో వచ్చిన పేపే, ఆర్టీఎక్స్ మాదిరిగా ఈ సినిమా ఉంటుంది. టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్‌గా ఉంటుంది. ఎనుగులతో చిత్రీకరించిన సీన్లు థియేట్రికల్‌గా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. ఈ సినిమా ఓవరాల్‌గా వేరే లెవెల్‌లో ఉంటుంది అని నెటిజన్లు పోస్టు పెడుతున్నారు.
మలయాళం సినిమాకు పరిచయం అవుతున్న సునీల్ ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ చిత్రంలోని ఆ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. పాట సాహిత్యం, బీజీఎం, సునీల్ వేసిన స్టెప్పుల్లో ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఈ పాట సినీ అభిమానులను కేక పెట్టిస్తుంది అని నెటిజన్ కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications