Kattalan Movie Review: కాటాలన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: ఆంటోని వర్గీస్, దుషారా విజయన్, సునీల్, కబీర్ దుహాన్ సింగ్, సిద్దిఖీ, జగదీష్, అన్సాన్ పాల్, లోకేష్ కనకరాజ్ (అతిథి) తదితరులు
దర్శకత్వం: పాల్ జార్జ్
నిర్మాత: షరీఫ్ మహ్మద్
సినిమాటోగ్రఫి: రెనడైవ్, చంద్రు సెల్వరాజ్, సందీప్ ఎలామన్
మ్యూజిక్: అజనీష్ లోకనాథ్, రవి బస్రూర్ (పాటలు)
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవి బస్రూర్
ఎడిటింగ్: షామీర్ మహ్మద్
బ్యానర్: క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్: 2026-05-28
కేరళలోని కొల్లి అనే ప్రాంతంలో ఏనుగులను అతి కిరాతకంగా చంపి వాటి దంతాలను స్మగ్లింగ్ చేస్తూ మాఫియా సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి మారి (సునీల్) విస్తరిస్తాడు. స్మగ్లింగ్, మాఫియా వ్యవహారాల్లో మారి కార్యకలాపాలకు ఎడ్డీ (కబీర్ దుషాన్ సింగ్) అడ్డంకిగా, సవాల్‌గా మారుతాడు. ఎడ్డీ తన సోదరుడు ఎస్పీ హరీష్ శంకర్ అండతో మారి ప్రశాంత లేకుండా చేస్తాడు. ఎడ్డీని ఎదుర్కొనడానికి ఆంటోని (ఆంటోని వర్గీస్)ను తన గ్రూపులో డ్రైవర్‌గా పెట్టుకొంటాడు. అక్రమ ఎనుగు దంతాల వ్యాపారాన్ని సాగించడానికి ఉపయోగించుకొంటాడు. కానీ మారి నమ్మకస్తుడైన ఆంటోని .. మారికి ఎదురు తిరుగుతాడు.
ఏనుగు దంతాల అక్రమ రవాణాను మారి ఎలా కొనసాగించాడు? మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు? ఎడ్డీతో విభేదాలు, విరోధానికి కారణం ఏమిటి? ఎడ్డీ, మారి మధ్య గ్యాంగ్ వార్ ఎలా కొనసాగింది? మారి కోసం ఆంటోని ఎలాంటి సాహసం, ఎలా ఎత్తులు పన్నాడు? ఎడ్డీ గ్యాంగ్‌ను ఆంటోని ఎలా అడ్డుకొన్నాడు? నమ్మిన బంటుగా మారిన ఆంటోని.. మారికి ఎందుకు ఎదురు తిరిగాడు? మారిని ఆంటోని ఎలా దెబ్బ కొట్టాడు? ఇంటర్నేషనల్ స్థాయిలో తన అక్రమ ఏనుగు దంతాల వ్యాపారాన్ని ఎలా పెంచాడు? అనే ప్రశ్నలకు సమాధానమే కాటాలన్ సినిమా కథ.

అండర్ డాగ్‌గా ఉండే అతి సామాన్యుడు అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్‌గా ఎలా మారాడనే పాయింట్ చుట్టు అల్లుకొన్న గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఈ పాయింట్ వింటే.. తెలుగులో పుష్ప, దేవర, ఛత్రపతి, కేజీఎఫ్ లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ నేపథ్యంగా కథను మొదలుపెట్టి.. క్లారిటీగా కథను చెప్పలేక సినిమా ఫస్టాఫ్‌లో గందరగోళాన్ని క్రియేట్ చేశాడు. ఆరంభంలో ఎవరి క్యారెక్టర్ ఏమిటి? కథకు ఆ క్యారెక్టర్లు ఎలా ట్రీట్ చేస్తున్నాయనే సందేహాలు వస్తాయి. కానీ ఆంటోని క్యారెక్టర్ రంగ ప్రవేశం చేసిన తర్వాత సినిమా కథా ప్రవాహం ఓ గాడిన పడుతుంది. అయితే ఫస్టాఫ్‌లో అద్బుతం అనిపించే సన్నివేశాలు లేకపోవడం వల్ల తెలుగు వాళ్లకు గొప్పగా ఎక్సైట్‌మెంట్ కలిగించదు. కేరళ వాసులకు ఇలాంటి గ్యాంగస్టర్ డ్రామా కొత్తగా అయితే వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫస్టాఫ్ రొటీన్, రెగ్యులర్‌గా సాగుతుంది.
ఇక సెకండాఫ్‌లో ఆంటోని డ్రైవర్ స్థాయి నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగే క్రమం కొంత ఆసక్తిగా ఉంటుంది. కానీ కొత్తగా ఫీలయ్యే అంశాలు ఏమీ కనిపించవు. చైల్డ్ సెంటిమెంట్‌తో కూడిన ఎపిసోడ్‌ను వాడుకొని ఆంటోని క్యారెక్టర్‌ను మలుపు తిప్పిన తీరు ఛత్రపతి సినిమాను గుర్తుకు చేస్తుంది. చివర్లలో హడావిడిగా కథను ముగించడం.. అలాగే లోకేష్ కనకరాజ్‌ను అతిథి పాత్ర ద్వారా తీసుకొచ్చి సీక్వెల్‌కు లీడ్ ఇవ్వడం సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్. లార్డ్ మార్కో క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసి మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఓవరాల్‌గా తెలుగు ఆడియెన్స్‌కు మాత్రం రెగ్యులర్, రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగానే అనిపిస్తుంది.
కాటాలన్ సినిమా విషయానికి వస్తే.. సునీల్‌ను పూర్తిస్థాయి విలన్‌గా చూడటం కొత్తగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు డిఫరెంట్ క్యారెక్టర్లలో చూసిన మనకు మొదటగా క్రూరమైన విలన్‌గా యాక్సెప్ట్ చేయడం కష్టమే ఉంటుంది. కానీ విలన్ పాత్రలో మారిగా స్క్రీన్ మీద డామినేట్ చేశాడు. పుష్పలో మంగళం శ్రీను క్యారెక్టర్ తర్వాత ఆ రేంజ్ క్యారెక్టర్‌లో కనిపించాడు. హీరో ఆంటోని వర్గీస్ కంటే ఎక్కువ లెంగ్త్ ఆయనదే కావడం విశేషం. ఇక ఆంటోని విజయ్ అండర్ డాగ్ క్యారెక్టర్ చక్కగా ఒదిగిపోయాడు. ఎడ్డీ, దుషార విజయన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు రవి బస్రూర్ మ్యూజిక్ ప్లస్ పాయింట్. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి మరో అదనపు ఆకర్షణ. సినిమాకు ఉపయోగించిన డార్క్ థీమ్ కలర్‌తో దేవర, కేజీఎఫ్ సినిమాలను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎడిటింగ్, ఇతర విభాగాలు తమ పనిని పర్‌పెక్ట్‌గా చేశాయి. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుసరించిన నిర్మాణ విలువలు బేషుగ్గా ఉన్నాయి. లోకేషన్స్ చాలా బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామాలను ఇష్టపడే వారికి పుష్ప, దేవర, ఛత్రపతి, కేజీఎఫ్ లాంటి సినిమాలను ఇష్టపడే వారికి కాటాలాన్ కూడా నచ్చుతుందేమో..


Click it and Unblock the Notifications