Kattalan First Review: కాటాలాన్ మలయాళం మూవీ ఫస్ట్ రివ్యూ

మలయాళంలో యువ నటుడు ఆంటోని వర్గీస్, దుషారా విజయన్ జంటగా నటించిన చిత్రం కాటాలాన్. ఈ చిత్రంలో తెలుగు నటుడు సునీల్, బాలీవుడ్ నటుడు కబీర్ దుహాన్ సింగ్, మలయాళ నటులు సిద్దిఖీ, జగదీష్, అన్సాన్ పాల్ తదితరులు నటించారు. స్టార్ హీరో ఉన్ని ముకుందన్ అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమాను క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహ్మద్ నిర్మించారు. ఈ చిత్రానికి పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా సాంకేతిక విబాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: రెనడైవ్, చంద్రు సెల్వరాజ్, సందీప్ ఎలామన్, మ్యూజిక్: అజనీష్ లోకనాథ్, రవి బస్రూర్ (పాటలు), బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవి బస్రూర్, ఎడిటింగ్: షామీర్ మహ్మద్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మే 28వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రాన్ని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) రివ్యూ చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? సెన్సార్ తర్వాత ఈ సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Kattalan Censor Review

సత్య మంగళం అటవీ ప్రాంతంలో ఏనుగు దంతాల అక్రమ రవాణ, ఆడవి సంపదను ఆడట్టు జార్జ్ (సిద్దిఖి), ఆలీ (జగదీష్), ఎడ్డీ (కబీర్ దుహన్ సింగ్) దోచుకొంటూ పర్యావరణానికి ముప్పుగా మారుతారు. ఈ క్రమంలో ఆంటోని వర్గీస్( ఆంటోని వర్గీస్)తో వారికి విభేదాలు ఏర్పడుతాయి. ముగ్గురితో కూడిన కరడు గట్టిన ఫారెస్ట్ మాఫియాపై ఆంటోని తిరుగుబాటు చేస్తాడు. తండ్రి హత్యకు కారణమైన వారిపై ఆంటోని ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? తండ్రి కోరికను కొడుకుగా ఆంటోని తీర్చాడా? ఆటవీ సంపదను అక్రమంగా దోచుకొనే వారికి ఆంటోని ఎలా బుద్ది చెప్పాడు? ఈ పోరాటంలో లూసీ (దుషారా విజయన్) పాత్ర ఏమిటి? మారి (సునీల్) ఏం చేశాడు అనేది సినిమా కథ.

మాస్ ఎలిమెంట్స్‌, హై ఎండ్ యాక్షన్, హింస, వయోలెన్స్ అంశాలతో మార్కో సినిమాను నిర్మించిన బ్యానర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఎక్కువగా హింస ఉన్న ఈ చిత్రాన్ని ఇటీవల సెన్సార్ అధికారులు, ప్రతినిధులు సమీక్షించారు. అయితే ఈ సినిమాలోని రక్తపాతంతో ఉన్న సన్నివేశాలపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొన్ని సీన్లన తొలగించాలని, లేదా రక్తపాతాన్ని తగ్గించాలని సూచించారు. అయితే కథ డిమాండ్ కారణంగా మేము అలాంటి సీన్లను తొలగించలేం అని చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. అయితే కొన్ని సూచనలను, సలహాలను నిర్మాత, దర్శకులు పాటించడాన్ని పరిగణనలోకి తీసుకొని తప్పని పరిస్థితి ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కాటాలాన్ సినిమాకు సెన్సార్ జారీ చేసిన సర్టిఫికెట్ ఏ (A). ఈ చిత్రానికి లభించిన సర్టిఫికెట్ ప్రకారం పెద్దలు మాత్రమే చూడాల్సి ఉంటుంది. 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఈ మూవీని చూడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి థియేటర్‌లోకి ప్రవేశం ఉండదు అని సెన్సార్ సర్టఫికెట్‌లో స్పష్టం చేశారు.

కాటాలాన్ చిత్రం లోకేషన్ బేస్‌గా సాగే యాక్షన్ డ్రామా, జంతువుల వధ, ఆటవీ సంపదను దోచుకొనే క్రమంలో క్యారెక్టర్లు వ్యవహరించే ముర్ఖత్వం లాంటి సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లింగ్ మూమెంట్స్ భారీగా ఉన్నాయనే విషయం ప్రోమో కంటెంట్‌తో స్పష్టమైంది. ఈ సినిమా నిడివిని కేవలం రెండు గంటలకు పరిమితం చేశారు. అంటే ఈ చిత్రం రన్‌టైమ్ 120 నిమిషాలుగా సెన్సార్ సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు.

ఆంటోని వర్గీస్, దుషారా విజయన్ పాజిటివ్ క్యారెక్టర్లలో కనిపించగా.. కబీర్ దుహాన్ సింగ్, సిద్దిఖీ, జగదీష్, సునీల్ ప్రతినాయకుల పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో వీరి పెర్ఫార్మెన్స్ హైలెట్‌గా ఉంటుంది. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చే ఎలిమెంట్స్ ఉంటాయనే ఫీడ్ బ్యాక్ బయటకు వచ్చింది. ఈ చిత్రం గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ ఇతర స్టోరీల కోసం ఫిల్మీబీట్ ఫాలో అవ్వండి.

Read more about: sunil Kattalan Shareef Muhammed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X