Kaun Pravin Tambe? Movie review.. 50 ఏళ్ల వయసులో జట్టులో స్థానం.. రాహుల్ ద్రావిడ్‌‌కు లింకు ఏమిటి?

Rating:
2.5/5

నటీనటులు: శ్రేయాస్ తల్పాడే, చిరాగ్ త్రివేది, నితిన్ రావు, అంజలి పాటిల్, ఆశీష్ విద్యార్థి తదితరులు
దర్శకత్వం: జయప్రద్ దేశాయ్
స్క్రీన్ ప్లే: కిరణ్ యదన్యోపవిత్
మ్యూజిక్: అనురాగ్ సైకియా
సినిమాటోగ్రఫి: సుధీర్ పల్సానే
ఎడిటింగ్: గోరక్ష్‌నాత్ ఖాండే
రచన: కపిల్ సావంత్
డైలాగ్స్: కిరణ్ యదన్యోపవిత్,
నిర్మాణం: ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, బూట్ రూమ్ స్పోర్ట్స్
ఓటీటీ రిలీజ్: డీస్నీ+హాట్ స్టార్
ఓటీటీ రిలీజ్ డేట్: 2022-04-01

కౌన్ ప్రవీణ్ తాంబే కథ ఏమిటంటే?

కౌన్ ప్రవీణ్ తాంబే కథ ఏమిటంటే?

ముంబైకి చెందిన ప్రవీణ్ తాంబే ( శ్రేయాస్ తల్పాడే) క్రికెట్ క్రీడలో ఆల్‌రౌండర్. పేదరికంతో బాధపడే ప్రవీణ్ తాంబే ఎప్పటికైనా రంజీ ట్రోఫి టోర్నమెంట్‌లో ఆడాలనే కోరికతో ఉంటాడు. కానీ విధి వెక్కిరించడంతో అనేక అవకాశాలు చేజారిపోతుంటాయి. రంజీలో స్థానం సంపాదించాలనే పట్టుదలతో కష్టపడుతున్న నేపథ్యంలో యాక్సిండెంట్‌కు గురి అవుతాడు. కాలు ఫ్యాక్చర్ కావడంతో క్రికెట్‌కు దూరం అవుతాడు?

కథలో ట్విస్టులు ఇలా..

కథలో ట్విస్టులు ఇలా..

క్రికెటర్ కావాలనుకొన్న ప్రవీణ్ తాంబేకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. క్రీడల్లో రాజకీయాల వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? క్రికెట్ రంగంలో రాణించడానికి తపన పడుతూ.. తన భార్య, ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం ఎలాంటి కష్టాలను చవిచూశాడు. చివరకు 50 ఏళ్ల వయసులో ఐపీఎల్, కరేబియన్ లీగ్స్‌లో ఎలా సత్తా చాటాడు అనే ప్రశ్నలకు సమాధానమే కౌన్ ప్రవీణ్ తాంబే సినిమా కథ.

భావోద్వేగాలతో ఫస్టాఫ్

భావోద్వేగాలతో ఫస్టాఫ్

ప్రవీణ్ తాంబే తన కెరీర్ ఆరంభంలో క్రికెట్‌లో రాణించే సన్నివేశాలతో ఎమోషనల్ మొదలవుతుంది. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు, తన కెరీర్‌లో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకొంటూ పోయే క్రమం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక చిన్న వయసులోనే ఒకే సారి ప్రవీణ్ తాంబేకు, ఆయన సోదరుడికి పెళ్లి చేయడం.. శోభనం సీన్‌కు సంబంధించిన ఎపిసోడ్ వారు అనుభవిస్తున్న పేదరికానికి అద్దం పట్టేలా ఉంటుంది. క్రీడల్లో రాజకీయాలను సహించలేని ప్రవీణ్ విధి వక్రీకరించడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో అతడి క్రికెట్ కెరీర్ ముగిసిపోతుందనుకొంటాం. కానీ పట్టుదలతో మళ్లీ క్రికెట్ ఆడటానికి ప్రయత్నించే తీరు స్పూర్తిదాయకంగా ఉంటుంది. ప్రథమార్థంలో కథ ఇలా సాగుతుంది.

స్పూర్తిదాయకంగా సెకండాఫ్

స్పూర్తిదాయకంగా సెకండాఫ్

కౌన్ ప్రవీణ్ తాంబే సినిమా సెకండాఫ్‌ విషయానికి వస్తే.. కోచ్ విద్యాధర్ పరాద్కర్ (అశీష్ విద్యార్థి) ఎంట్రీతో ప్రవీణ్ ఆట తీరు మారిపోతుంది. ప్రవీణ్ తన ఆటతీరుకు సంబంధించిన చిన్న మార్పు.. అతడి కెరీర్‌లో భారీ కదలికను తెస్తుంది. ఎప్పుడూ క్రికెట్‌తోనేనా నీ జీవితం.. ఉద్యోగం చేసుకో అంటూ భార్య వైశాలీ (అంజలీ పాటిల్), తల్లి (ఛాయా కదమ్) పోరును భరించలేక డ్యాన్స్ బార్‌లో వెయిటర్‌గా మారడం, రాత్రిళ్లు పనిచేస్తూ రోజంతా క్రికెట్‌కు అంకితం కావడమనేది ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేసేలా ఉంటుంది. చివరికి ఐపీఎల్‌లో స్థానం దక్కించుకోవడంతో అతడి జీవిత కథ మారిపోతుంది.

శ్రేయాస్ తల్పాడే, ఇతరుల ఫెర్ఫార్మెన్స్

శ్రేయాస్ తల్పాడే, ఇతరుల ఫెర్ఫార్మెన్స్

ప్రవీణ్ తాంబేగా శ్రేయాస్ తల్పాడే తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. క్రికెటర్‌గా రాణించాలనే లక్ష్యంతో సమస్యలకు ఎదురీతతో తన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. తెర మీద శ్రేయాస్ తల్పాడే కాకుండా ప్రవీణ్ తాంబేను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రవీణ్ తాంబే భార్యగా అంజలీ పాటిల్ వైవిధ్యమైన నటనను ప్రదర్శించింది. భావోద్వేగాలకు గురయ్యే పాత్రను తనదైన శైలిలో మెప్పించింది. కోచ్‌గా అశీష్ విద్యార్థి ఎమోషనల్ రోల్‌లో కనిపించాడు. రాహుల్ ద్రావిడ్‌గా చిరాగ్ త్రివేది ఈ సినిమాకు కొసమెరుపుగా మారాడు. మిగితా పాత్రల్లో అభయ్ కురువిల్లాగా నితిన్ రావు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగాల పనితీరు గురించి

సాంకేతిక విభాగాల పనితీరు గురించి


సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. కథను ఆసక్తికరంగా మలచడంలో జయప్రద్ దేశాయ్ తన సత్తాను చాటుకొన్నారు. కిరణ్ స్క్రీన్ ప్లే బాగుంది. కానీ స్లో నరేషన్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సుధీర్ పల్సానే సినిమాటోగ్రఫి బాగుంది. అనురాగ్ సైకియా రీరికార్డింగ్‌తో పలు సన్నివేశాలు మరింత ఎమోషనల్‌గా కనిపించాయి. గోరక్ష్‌నాత్ ఖాండే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త పదును చూపించాల్సిందనిపిస్తుంది.

Recommended Video

John Abraham కామెంట్స్ పై South Indian ఫ్యాన్స్ ఫైర్ | Filmibeat Telugu
ఫైనల్‌గా

ఫైనల్‌గా

క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే కోరిక ఉన్న ఆటగాళ్ల కథలు ఇప్పటికే వెండితెర ప్రేక్షకులను మెప్పించాయి. 50 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫి క్రికెట్‌, ఐపీఎల్‌లో స్థానం సంపాదించడమే కాకుండా వయోభారం క్రీడలకు అడ్డంకి అనే అపోహలను ప్రవీణ్ తాంబే పటాపంచలు చేసిన కథ ఇది. అయితే జెర్సీ చిత్ర కథ కూడా దాదాపు ఇలానే అనిపిస్తుంది. కాకపోతే ప్రవీణ్ తాంబే సినిమాలో భావోద్వేగాలు సరైన విధంగా పండలేదనిపిస్తుంది. ఎమోషన్స్‌కు ఎక్కువగా స్కోప్ ఉన్న చిత్రంగా అనిపిస్తుంది. ఓ ఆటగాడి పడిలేచే జీవితం యువతరానికి స్పూర్తిని అందిస్తుండనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఓటీటీలో ఉంది కాబట్టి.. తీరికవేళల్లోనైనా ఫీల్‌గుడ్ మూవీ చూడటానికి అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X