twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కావ్యాస్ డైరీ(రివ్యూ)

    By Staff
    |
    Kavya's Dairy
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సినిమా: కావ్యాస్ డైరీ
    బ్యానర్: ఇందిరా ప్రొడక్షన్స్
    నటీనటులు: ఛార్మి, మంజుల, శశాంక్, ఇంద్రజిత్, సత్యం రాజేష్ తదితరులు.
    నిర్మాత: సంజయ్ స్వరూప్
    సంగీతం: మనురమేషన్
    దర్శకుడు: కరుణ ప్రకాష్
    రిలీజ్ డేట్: జూన్ 5, 2009.

    మొన్నో హీరోయిన్ ఓరియెంటెడ్ ఇంగ్లీష్ ధ్రిల్లర్ చూసా...అదిరింది..ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఫాలో అయ్యే నన్ను చివర దాకా రిమోట్ మీద చెయ్య వేయకుండా కూర్చోపెట్టింది తెలుసా..ఆ సినిమాలో ఛార్మిని పెట్టి లో బడ్జెట్ సినిమా లాగిస్తే ఎలా ఉంటుంది.కేక కదా..ఓకే.. స్క్రిప్టు,షాట్ డివిజన్ రెడీ కాబట్టి డైలాగులు రాయించేంద్ధాం..పనిలో పనిగా ఛార్మి కాకుండా ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఉంది అది నువ్వే వేసేస్తే పోలా..అంటూ మంజులని మొబలైజ్ చేసిన ప్రాజెక్టులా అనిపిస్తుంది కావ్యాస్ డైరీ. 1992 నాటి “The hand that rocks the cradle" కి ప్రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఛార్మికి మరో మంత్ర లాంటి హిట్ ఇస్తుందేమో అనే ఆశలురగిలించింది. అయితే గమ్మత్తుగా ఈ చిత్రం తెలుగు తెరపై వాలే సరికి సీరియల్ ఫీల్ తీసుకొచ్చి నస పెట్టడం ప్రారంభించింది.

    పూజ(మంజుల)భర్త, పిల్లలతో హ్యాపీ ఫ్యామిలీకి యాడ్ లా (ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ, పాటలు పాడుకుంటూ)జీవితం గడుపుతూంటుంది. ఆనంద నిలయం లాంటి ఆ ఇంట్లోకి సినిమాటిక్ గా(మంజుల కూతుర్ని ఓ లారి ప్రమాదం నుంచి రక్షించి)ఆయా రూపంలో కావ్య(ఛార్మి) ప్రవేశిస్తుంది. అక్కడనుంచీ పూజ కుటుంబంలో అన్నీ అనుకోని సంఘటనలే..ప్రమాదాలే. ఆమె మరిది(శశాంక్)సైతం కావ్యపై ప్రేమ పెంచుకున్నందుకు పైకి వెళ్ళిపోతాడు. అయితే మరణించేముందు అతనికి ఈ దారణాలన్నిటీకీ కారణం కావ్య అనే భయంకర నిజం తెలుస్తుంది. కానీ తెలిసిన మరుక్షణం పైకి ప్రయాణం కడతాడు. ఎందుకు కూల్ గా ఉండే కావ్య రాక్షసిలా బిహేవ్ చేస్తోంది,ఈ విషయం పూజకు ఎప్పుడు తెలుస్తుంది...వంటి అనేక ధ్రిల్లింగ్ (ఫీలయితే) ప్రశ్నలకు సమాధానాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

    ఇంటర్వెల్ లో ఛార్మినే ఈ చిత్రంలో విలన్ అని తెలిసి ప్రేక్షకుడు షాక్ అవుతాడు అదే మన విజయం అని కథనం ప్రారంభించినట్లు అర్ధమవుతుంది. అయితే అదే కథకు ప్రధాన సమస్య అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేక్షకుడుకు ఇంటర్వెల్ లో ఓపెన్ చేసి ఆమే విలన్ అని చెప్పి..ఆమెను ఎదుర్కోవాల్సిన పాత్ర మంజులకు ప్రీ క్లైమాక్స్ దాకా చెప్పకుండా దాచిపెట్టారు. దాంతో అప్పటివరకూ దుష్టశక్తి చెలరేగిపోయే విధానాన్ని,భీబత్సాన్ని చూడాల్సిన స్ధితి ఏర్పడింది. అంతేగాక కథలో ఆమెను ఎదుర్కోవాల్సిన మంజుల పాత్రలో లీనమై చూసిన వారికి ఆమె ఏమీ చేయక అసహనం కలుగుతుంది. ఛార్మి పాత్రకు పోటాపోటీ ఇస్తే మరో అరుంధతి అయ్యేది. పోనీ ఛార్మిలో ప్రేక్షకుడు లీనమవుదామనుకున్నా ఆమె ఫ్లాష్ బ్యాక్ అడ్డుపడుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఛార్మి భర్త డాక్టర్ కిరణ్ క్యారెక్టర్ మంచిది కాదు. గైనకాలజిస్ట్ గా పనిచేసే అతను అక్కడ వచ్చిన లేడీ పేషెంట్లపై లైంగికంగా దాడిచేయటానికి ప్రయత్నిస్తూంటాడు. అది మంజుల వల్ల బయిటపడి అతను ఆత్మహత్యకు కారణమవుతుంది. (సారీ..ఇది రివిల్ అయినా సస్పెన్స్ పోదు). దాంతో ఛార్మి తన భర్త చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకుంటా అని బయిలుదేరుతుంది. అలాంటి స్ధితిలో ఆలాంటి భర్త ను సపోర్ట్ చేసే ఛార్మి పాత్రను ఎలా సపోర్టు చేస్తాం. అది కుదరని పని.

    అయితే ఈ చిత్రంలో ఛార్మి తన పాత్రలో లీనమై మనను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. మంజుల నటన మాత్రం కృత్రిమంగా కనపడుతుంది.అయితే ఆమె పిల్ల గా వేసిన పాప మాత్రం చాలా బాగా చేసింది. అలాగే డైరక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవటానికి ఏమీలేదు. ఏమన్నా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి అన్పించినా ఆ క్రెడిట్ కెమెరామెన్ కే దక్కుతుంది. ఎందుకంటే చాలా సీన్స్ లో షాట్ బై షాట్ హాలీవుడ్ సినిమానే ఫాలో అయ్యారు. ఇక డైలాగ్ రచయితగా వక్కంతం వంశీలో కిక్ కనపడదు. చాలా డైలాగులు ఇంగ్లీష్ కి తెలుగు తర్జమా అనిపిస్తూ..కుదరని చోట బిచ్ వంటి డైలాగులు ఉన్నపళంగా వాడేస్తూ పోతూంటుంది. అయితే ఎంత ఇంగ్లీష్ సినిమా ఫాలో అయినా ఛార్మి..మంజుల భర్తతో కలసి ప్రక్క పంచుకోవటం వంటివి వదిలేస్తే బాగుండేదనిపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కావ్యాస్ డైరీ అనిపెట్టినందుకు ఆ డైరీకి ఎక్కడో చోట ప్రాముఖ్యత ఇస్తే బావుండేది.కానీ డైరీకి కథకీ సంభంధం ఉండదు. పాటల్లో ఒకటి బాగుంది(అదే టీవీల్లో ప్రొమోలు వేస్తున్నారు.). అలాగే రిలీఫ్ కోసమైనా కామెడీ పెడితే బాగుండేది.పాపం శశాంక్ ఎలాంటి క్యారెక్టర్స్ కి వెళ్ళిపోయాడు..అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. సత్యం రాజేష్ మాత్రం చాలా కాలానికి కాస్త ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించాడు.

    ఏదైమైనా అయినా ఇతరులు డైరీలపై ఆసక్తి పెంచుకోవటం, చదవటం తప్పు అని మర్చిపోయి ఆ చిత్రంకు వెళ్ళినందుకు సరైన బుద్ది వచ్చిందనిపిస్తుంది.ఈ సినిమా వేరే వాళ్ళ డైరీ చదవాలనుకునేవాళ్ళకు శిక్షలా అనిపిస్తుంది. చివర్లో ఆ డైరీ కనపడితే కనికరం లేకుండా కాల్చేయాలనిపిస్తుంది. అయితే ఇంగ్లీష్ సినిమాను పెద్ద మార్పులు లేకుండా ఎలా తెలుగుకు ఎడాప్ట్ చేసారు అన్న విషయం తెలిసికోవాలి అనుకున్న వాళ్ళుకు మాత్రం ఉపయోగం. మల్టీ ఫ్లెక్స్ లకు టార్గెట్ చేసిన ఈ సినిమా అక్కడా ఆడటం కష్టమేనని మొదటి రోజు ఓపినింగ్స్ ని బట్టే చెప్పవచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X