KD The Devil Movie Review: కేడీ ది డెవిల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
కేడీ (కాళిదాస) ది డెవిల్
నటీనటులు: ధ్రువ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి, రేష్మా నానయ్య, వీ రవిచంద్రన్, రమేశ్ అరవింద్, రమేశ్ అరవింద్, యష్ శెట్టి తదితరులు
దర్శకత్వం: ప్రేమ్
నిర్మాత: కే వెంకట నారాయణ (కేవీఎన్)
మ్యూజిక్: అర్జున్ జన్య
సినిమాటోగ్రాఫర్: విలియం డేవిడ్
ఎడిటర్: సంకేత్ ఆచార్
బ్యానర్: కేవీఎన్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2026-05-15
చదువు సంధ్యలు ఒంటికి పట్టకపోవడంతో కాళి అలియాస్ కాళిదాస్ (ధ్రువ సర్జా) కిరోసిన్ డీలర్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తుంటాడు. కాళి అంటే తన అన్నయ్య ధర్మ (రమేష్ అరవింద్) ఓ రకమైన ద్వేషం. కానీ మాఫియా డాన్, కుస్తీ, కబాడ్డీ ఆటగాడు దేవా అలియాస్ డాక్ దేవా (సంజయ్ దత్) అంటే చెప్పలేనంత ఇష్టం. దేవాను కాళి అమితంగా అభిమానిస్తుంటాడు. అయితే ధర్మ ఫ్యామిలీని దేవా గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల దేవాను, ఆయన గ్యాంగ్‌పై కాళి వార్ ప్రకటించకతప్పలేదు. ఈ ఇద్దరి వర్గ పోరాటంలోకి భైరవ (సుదీప్ కిచ్చ) ఎంట్రీ ఇస్తాడు.

జల్సాగా, ఎలాంటి బాధ్యతలు లేకుండా తిరిగే కాళిని ధర్మ ఎందుకు దూరంగా పెడుతాడు? కాళితో ధర్మ మాట్లాడకుండా ఎందుకు ఉంటాడు? మాఫియా డాన్ దేవా అంటే కాళికి ఎందుకు ఇష్టం? కుస్తీ పోటీలో దేవాను కాళి ఎలా ఓడిస్తాడు? ధర్మకు దేవాకు ఉన్న విభేదాలు ఏంటి? ధర్మ స్నేహితుడు అన్నయ్యప్ప (వీ రవిచంద్రన్)కు దేవాకు ఉన్న అంతర్గత విభేదాలు ఏమిటి? పాలిటిక్స్‌లో రాణిస్తున్న అన్నయప్పకు పోటీగా దేవా ఎందుకు నిలవాలని ప్లాన్ చేశాడు? తాను అభిమానించే దేవాను కాళి ఎలా ఎదుర్కొన్నాడు? ఈ కథలో భైరవ ఎవరు? లక్ష్మీ (రీష్మా)తో కాళి లవ్ ట్రాక్ ఎలా సాగింది? సత్య (శిల్పాశెట్టి)కి దేవాకు ఉన్న రిలేషన్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే కేడీ సినిమా కథ.
కేడీ మూవీ విషయానికి వస్తే.. చెప్పుకోవడానికి కథ ఏమి కనిపించదు. నలుగురు వ్యక్తుల మధ్య విభేదాలు, వర్గ పోరాటం, క్యారెక్టర్ ఎలివేషన్స్, హైప్ తప్పా మిగితా విషయం మరోకటి ఏమీ కనిపించదు. సినిమాలో మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు అరుపులు, పెడబొబ్బలు తప్పా కథ, బలమైన సన్నివేశాలు మచ్చుకైనా కనిపించవు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ధ్రువ సర్జా తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేయడం సానుకూలంగా కనిపిస్తుంది. సంజయ్ దత్ క్యారెక్టర్, ఎలివేషన్స్ బాగుంటాయి. అరవింద్ రమేష్ ట్రాక్ ఫర్వాలేదనిపిస్తుంది. మధ్యలో సత్య పాత్రలో శిల్పాశెట్టి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. కానీ ఎక్కువ సేపు అది సస్టేయిన్ కాదు. ఇలా రొటీన్‌గా, రెగ్యులర్ ఫార్మాట్ నస పెట్టేలా సినిమా సాగుతుంది. చివర్లో కిచ్చ సుదీప్ ఎంట్రీతో కొంత అలజడి రేపే ప్రయత్నం కనిపిస్తుంది. అది కూడా పెద్దగా కథకు, సినిమాకు ఉపయోగపడినట్టు కనిపించదు. ఓవరాల్‌గా బిలో యావరేజ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ధ్రువ్ సర్జా తన పాత్రకు తగ్గ యాటిట్యూడ్, స్టయిల్, మాస్ ఎలిమెంట్స్‌ను పుష్కలంగా చూపించాడు. కానీ తన క్యారెక్టర్ ఎలివేట్ చేయడానికి సరైన కథ లేకపోవడంతో తన ప్రతిభకు మించి ఏమీ చేయలేకపోయాడనిపిస్తుంది. సంజయ్ దత్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కొన్ని చోట్ల విలనిజాన్ని తన స్టయిల్‌లో పండించాడు. అరవింద్ రమేష్, రవిచంద్రన్ పెద్దగా స్కోప్ లేని పాత్రలోనే నటించారు. శిల్పాశెట్టి ఒకట్రెండు సీన్లలో మెరిసారు. రీష్మా ఫర్వాలేదనిపిస్తుంది. కిచ్చ సుదీప్ స్పెషల్ ఎంట్రీ కొంత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. అర్జున్ జన్య మ్యూజిక్, విలియం డేవిడ్ సినిమాటోగ్రఫి, ఆర్ట్ వర్క్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. భారీ సెట్లు ఈ సినిమాకు హైలెట్‌గా మారాయి. సెట్స్ డిజైన్‌కు తగినట్టుగా కథ, కథనాలు ఉండి ఉంటే.. మరో కేజీఎఫ్ లాంటి సినిమా అయి ఉండేదని ఫీలింగ్ కలుగుతుంది. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. కానీ విచ్చలవిడిగా ఖర్చు చేసిన నిర్మాత కేవీఎన్ మంచి కథలను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కేడీ స్పష్టం చేసింది. ఓవరాల్‌గా బోరింగ్ సాగే యాక్షన్ డ్రామా.. స్టార్ వాల్యూను ఎంజాయ్ చేయాలనుకొంటే చూడొచ్చు. అంచనాలు లేకుండా వెళ్లినా ఓ రకమైన అసంతృప్తితోనే బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది.


Click it and Unblock the Notifications