twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజంగా కీలుగుర్రంలా కదలని సినిమా

    By Staff
    |

    Keelugurram
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: కీలుగుర్రం‌
    నటీనటులు: రోహిత్‌, బాలాదిత్య, నకుల్‌, రాజేష్‌, బ్రహ్మానందం,‌
    బాబూ మోహన్‌, శివాజీరాజా, పృధ్వి, తనూరాయ్‌, స్వప్న మాధురి, రవళి, షకీలా తదితరులు‌
    కథ: సాయిచంద్ర క్రియేషన్స్‌ యూనిట్‌‌
    మాటలు: తోటపల్లి మధు‌
    సంగీతం: ఎస్‌ఎ రాజ్‌కుమార్‌‌
    ఫోటోగ్రఫీ: కోడి లక్షణ్‌‌
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణ‌
    నిర్మాతలు: సాయ మహీపాల్‌ రెడ్డి, తిరుమల రెడ్డి, మల్లారెడ్డి‌

    మరో సీనియర్‌ దర్శకుడు బాక్సాఫీసు ముందు బోల్తాపడ్డారు. పాత సినిమా టైటిల్‌తో కోడి రామకృష్ణ నలుగురు యువకులను ఎంచుకుని తీసిన చిత్రమిది.

    కథ: రోహిత్‌, నకుల్‌, బాలాదిత్య, రాజేష్‌లు నిరుద్యోగులమని చెప్పుకు తిరిగే కుర్రాళ్ళు. సినిమా ఫక్కీలో ఒక బస్సులో పరిచయమైన వీరు అదే బస్సులో కలిసిన శివాజీ రాజా ఇంటికి వస్తారు. శివాజీరాజా భార్య రవళి ఒక హోటల్‌ నడుపుతుంటుంది. రవళిని మంచి చేసుకుని ఆమె చెల్లెళ్ళు ఇద్దరిని నకుల్‌, బాలాదిత్యలు ప్రేమలో పడేస్తారు. రోహిత్‌కు జోడీగా దర్శకుడు రవళి చెల్లెళ్ళ స్నేహితురాలిగా తనూరాయ్‌ని రంగంలోకి దింపుతాడు. స్నానం చేస్తున్న రోహిత్‌ను చూసి తనూరాయ్‌ ప్రేమలో పడుతుంది. కానీ రోహిత్‌ ఆమె ప్రేమలో పడక తన మరదలి చిన్నప్పటి ఫోటో పెట్టుకుని తిరుగుతుంటాడు. ఆమె తనూరాయేనని అతనికి తెలియదు. తనూరాయ్‌ తండ్రికి ఆమెను ఎన్నారై అయిన పృధ్వికి ఇచ్చి పెళ్ళి చేయాలని ఉంటుంది. కథ ఇలాగే సాగితే బోరుకొడుతుందని దర్శకుడు ఓ విలన్‌ను ప్రవేశపెడతాడు. ఆ విలన్‌కి తమ్ముడు, మరదలు, వారికో బాబు ఉంటారు. వీరందర్నీ చంపేసి ఆస్ధిని చేజిక్కించుకోవాలని విలన్‌ ప్రయత్నం. ఓ కిరాయి హంతకుడిని నియోగించి తమ్ముడిని, మరదల్ని చంపిస్తాడు. వారి బాబు మాత్రం ప్రమాదం నుండి బయటపడి నలుగురు హీరోల చేతిలో పడతాడు. రాహుల్‌, తనూరాయ్‌ల ప్రేమ ఏమవుతుంది? పృధ్వి ఏమైపోతాడు? సినిమా చూసి తెలుసుకోవాలి.

    మైనస్‌ పాయింట్స్‌: ఈ సినిమాలో ఏ క్యారక్టర్‌కూ నేపధ్యం ఉండకపోవడంతో సినిమా తోలుబొమ్మలాటలా సాగింది. కథలో కాలాతీత సంఘటనలు చాలా ఉన్నాయి. విలన్‌ తన తమ్ముడిని మరదల్ని చంపడానికి సినిమా ప్రారంభంలో ఎక్కిన టాటా సుమో ఇంటర్వల్‌ ముందు కన్పిస్తుంది. క్లెయిమాక్స్‌లో చిన్న పిల్లాడిని పెద్ద బిల్డింగ్‌ మీద నుంచి కింద పడేస్తే అతను ఫైట్స్‌ ముగిసేంతవరకు కింద పడకపోవడం విడ్డూరం. చిన్న రౌడీ అయిన బ్రహ్మానందం ఒక నకిలీ పోలీసు స్టేషన్‌కు వచ్చినప్పుడు వెనుక సినిమా యూనిట్‌ సభ్యులు కన్పించడం కెమెరామన్‌ పొరపాటు. తెలుగుసినిమాలకు కొత్తగా సోకిన హోమోసెక్స్‌ జబ్బు ఈ సినిమాకు కూడా పట్టుకుంది. బ్రహ్మానందం, షకీలాల కామెడీ ట్రాక్‌ పండలేదు. చివర్లో పృధ్వి తనూరాయ్‌ని త్యాగం చేసి హీరో అయిపోవడం మరో క్లెయిమాక్స్‌కు విరుద్ధం. దీనితో సినిమాలో హీరో ఎవరన్నది తెలియదు. ఇంటర్వెల్‌ వరకు సినిమా పెద్ద బోర్‌.

    ప్లస్‌ పాయింట్స్‌:రాజ్‌కుమార్‌ సంగీతం ఫర్వాలేదు. మరుధూరి రాజా కొన్ని డైలాగులు బాగున్నాయి. గౌతంరాజ్‌ నూతన్‌ ప్రసాద్‌ను అనుకరిస్తూ చేసిన పోలీసు పాత్ర బాగుంది. ఈ సినిమాలో రాజేష్‌ నటనలో ఈజ్‌ కన్పించింది.

    థట్స్‌ తెలుగు రిమార్క్స్‌: యూత్‌ని ఆకర్షించే ప్రయత్నంలో దర్శకుడు సినిమాను ఫ్యామీలీలకు దూరం చేశాడు. కాలే జి కుర్రాళ్ళు సరదాగా చూస్తే చూడొచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X