For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kerosene movie review సీరియల్ కిల్లింగ్ నేపథ్యంగా.. నేటివిటి డ్రామాగా సస్పెన్స్ థ్రిల్లర్!

  |

  నటీనటులు: ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు
  నిర్మాతలు: దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్
  కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: ధృవ
  బ్యానర్: బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్
  డీవోపీ: విజయ్ భాస్కర్ సద్దాల, ఆయన్ మౌళి, అశోక్ దబ్బీరు
  ఎడిటర్: గుజ్జల రక్షిత్ కుమార్
  మ్యూజిక్ డైరెక్టర్: అనంత నారాయణ ఏజీ, తేజా కునూరు
  సాహిత్యం: తేజస్విని పసుపులేటి
  రిలీజ్ డేట్: 2022-06-17

  ఏపీలోని మారుమూల ప్రాంతమైన జనగూడెంలో వరుస హత్యలు ప్రజలను బెంబెలెత్తిస్తాయి. అదే గ్రామానికి చెందిన తండాలోని రామప్ప (సమ్మెట గాంధీ) కూతురు గౌరీ (లావణ్య చెవుల) అత్యాచారానికి గురై హత్యగావింపబడటం సంచలనం రేపుతుంది. అయితే వరుస హత్యల నేపథ్యం వెనుక కూపీ లాగాడానికి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ వైభవ్ (ధృవ)ను రంగంలోకి దించుతారు.

  మహిళలపై అత్యాచారం, హత్య సంఘటనల దర్యాప్తు చేపట్టిన ఏసీపీ వైభవ్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హత్య కేసులను ఎస్సై (జీవిన్) ఎందుకు క్లోజ్ చేశాడు? స్థానిక ఎమ్మెల్యే (బ్రహ్మాజీ) ఈ కేసులో జోక్యం చేసుకొన్నాడు? గౌరీ మరో ఇద్దరి హత్యల వెనుక కారణం ఎవరు? ముగ్గురిని ఎందుకు హత్య చేశారు? ఏపీసీ ధృవ హంతకులకు ఎలాంటి శిక్షను విధించాడు? ఈ సినిమాకు కిరోసిన్ అని పేరు పెట్టడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే కిరోసిన్ మూవీ కథ.

   Kerosene movie review and Rating: Suspense Thriller with Rural drama

  కిరోసిన్ సినిమాకు కర్త, కర్మ, క్రియ ధ్రువ. సినిమాపై ప్యాషన్‌తో తెలుగు నెటివిటీతో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌కు ఎమోషన్స్ జోడించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగానే కాకుండా దర్శకత్వం బాధ్యతలు చేపట్టి తన ప్రతిభను చాటుకొన్నాడు. సహజసిద్ధంగా పాత్రల డిజైన్.. పల్లె అందాల నడుమన ఆసక్తికరంగా సాగే కథనం సినిమాకు ప్లస్‌గా మారాయని చెప్పవచ్చు. కథను పకడ్బందీగా రాసుకోవడమే కాకుండా.. కొత్తదనం ఉట్టిపడేలా స్క్రీన్ ప్లే.. హ్యుమర్, ఎమోషన్స్ జోడించిన డైలాగ్స్.. సీనియర్ నటులపై దర్శకత్వ పర్యవేక్షణ అతడి టాలెంట్‌కు అద్దం పట్టింది. రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్‌గా కాకుండా.. విభిన్నంగా తెరకెక్కించడంలో ధ్రువ పట్టుదల తెర మీద స్పష్టంగా కనిపిస్తుంది. సైకోల బిహేవియర్ ఎలా ఉంటుంది.. వారు హత్యలకు ఎలా ప్రేరిపితులవుతారు అనే విషయాలను తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు. తొలిసారి దర్శకత్వం బాధ్యతలు, ఇతర విభాగాల రెస్పాన్సిబిలిటీని భుజానికి ఎత్తుకొని క్లాలిటీతో కూడిన సినిమాను అందించడం అభినందనీయం.

  నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ధ్రువ హీరోగా తనదైన శైలిలో కనిపించారు. రెగ్యులర్ పోలీస్ యాటిట్యూడ్‌కు దూరంగా సెన్సిటివ్ ఎలిమెంట్స్‌తో చక్కగా నటించాడు. ఏసీపీ పాత్రలో ఒదిగిపోయిన తీరు.. అతడి కాన్షిడెన్స్‌ను మెచ్చుకోవాల్సిందే. బ్రహ్మాజీ కొద్ది సేపు కనిపించినా నవ్వులు పూయించారు. సమ్మెట గాంధీ, మధుసూధన్ రావు, లక్ష్మణ్ మీసాల, ప్రీతి సింగ్, భావన తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. కిరోసిన్ సినిమాకు అత్యంత బలం.. సినిమాటోగ్రఫి. యువ ప్రతిభావంతులైన విజయ్ భాస్కర్, ఆయన్ మౌళి, అశోక్ అద్భుతంగా గ్రామీణ, పర్వత ప్రాంతాలు, దట్టమైన అటవీ సంపదను అద్భుతంగా కెమెరాలో బంధించారు. తేజా కన్నురు అందించిన బీజీఎం సినిమాలోని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అనంత నారాయణన్ సంగీతం బాగుంది. గుజ్జల రక్షిత్ కుమార్‌కు ఎడిటింగ్ విషయంలో పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వలేదా అనే అనుమానం కలుగుతుంది. అనవసరమైన సీన్లు చాలానే కనిపించాయి. నిడివి తక్కువగా ఉందనే కారణంతో కొన్ని సీన్లను అలాగే పెట్టారేమో అనిపిస్తుంది. తేజస్విని పసుపులేటి సాహిత్యం కొత్తగా ఉంది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను మంచి క్వాలిటీతో అందించిన తీరు చూస్తే.. సినిమాపై వారికి ఉన్న అభిరుచి తెలియజెప్పింది. చిన్న సినిమా అయినప్పటికి.. సాంకేతిక విలువలు పుష్కలంగా ఉన్నాయి. యువ ప్రతిభ సినిమాలో ఉట్టిపడేలా ఉంది. క్రైమ్, థ్రిల్లర్, నేటివిటి సినిమాలను ఇష్టపడే వారికి కిరోసిన్ నచ్చుతుంది.

  English summary
  Kerosene movie is set to released on June 17th which directed and acted by Young aspiring actor Dhruv. Here is the exclusive review from Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X