Kesari 2 Twitter Review: కేసరి 2 హిందీ మూవీ ట్విట్టర్ రివ్యూ
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, స్టార్ హీరో ఆర్ మాధవన్ హీరోలుగా, అనన్య పాండే, రెజీనా కసాండ్రా హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం కేసరి చాప్టర్ 2: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్. చరిత్ర ఆధారంగా రూపొందుతున్న కోర్టు రూమ్ డ్రామాకు డైరెక్టర్ కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిన ఈ సినిమాను హీరూ యష్ జోహర్, అరుణా భాటియా, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, అమృత్‌పాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ నిర్మించారు.
బాలీవుడ్‌లో 2019 సంవత్సరంలో రూపొందిన కేసరి సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో సైమన్ పైస్లీ డే, అలెక్స్ ఓనెల్, అమిత్ సియాల్, మసాబా గుప్తా, స్టివెన్ హార్ట్‌లీ నటించారు. ఈ సినిమాకు దేబోజిత్ రే సినిమాటోగ్రఫి, సాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్ అందించారు. నితిన్ బేద్ ఎడిటర్‌గా బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

జలియన్ వాలాభాగ్ దురాగతాన్ని చరిత్ర పుస్తకాల్లో చదువుకొన్నాం. కానీ దానిని తెరపైన ప్రత్యక్షంగా, సజీవంగా చూసేలా కేసరి 2 సినిమాను తీసుకొచ్చారు. నేను పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. నన్ను అంతలా కదిలించింది. ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావాల్సిందే. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్ అద్బుతంగా నటించారు. మీరు మిస్ కాకుండా తప్పుకుండా చూడండి అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని రాశారు.
జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఆధారంగా తెరకెక్కిన కేసరి 2 సినిమాను ఫ్యాన్ షో ప్రీమియర్‌గా చూశాను. ఈ సినిమా టెర్రిఫిక్‌గా ఉంది. ఈ సినిమాను తప్పకుండా చూడండి అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.
కేసరి చాప్టర్ 2 సినిమా బెస్ట్ మూవీ. ఈ దశాబ్దంలోనే ఉత్తమ చిత్రంగా మారే అవకాశం ఉంది. అక్షయ్ కుమార్ విభిన్నమైన నటన బాగుంది. యాక్టర్‌గా తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. ఈ సినిమా చాలా బాగుంది అంటూ నెటిజన్ తన రివ్యూను అందించాడు.
కేసరి 2 సినిమాను తప్పకుండా చూడండి. జలియన్ వాలాబాగ్ సందర్భంగా జరిగిన వాస్తవాలు మీకు సజీవంగా తెలుస్తాయి. ఆ విషయాలు చూస్తే ఆవేదనతో హృదయం ద్రవించి పోతుంది. బ్రిటీష్ పాలనపై శంకర్ నాయర్ చేసిన పోరాటం అమోఘం. అక్షయ్ కుమార్ తన కెరీర్‌లో చూపించిన అద్బుతమైన పెర్ఫార్మెన్స్. అనన్యపాండే, ఆర్ మాధవన్ గుర్తుండిపోయే నటనను ప్రదర్శించారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కేసరి చాప్టర్ 2 సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూశాను. నిజంగా అద్బుతంగా ఉంది. చరిత్రను సాక్ష్యంగా చూపించేలా కోర్టు రూమ్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించారు. బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన శంకర్ నాయర్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు సినిమా కట్టిపడేసేలా ఉంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications











