Kesari 2 Movie Review: కేసరి చాప్టర్ 2 హిందీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.5/5

నటీనటులు: అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే, రెజీనా కసండ్రా, సైమన్ పైస్లీ డే, అలెక్స్ ఓనెల్, అమిత్ సియాల్, మసాబా గుప్తా, స్టివెన్ హార్ట్‌లీ తదితరులు
డైరెక్టర్: కరణ్ సింగ్ త్యాగీ
నిర్మాతలు: హీరూ యష్ జోహర్, అరుణా భాటియా, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, అమృత్‌పాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ
సినిమాటోగ్రఫి: దేబోజిత్ రే
మ్యూజిక్: సాష్వత్ సచ్‌దేవ్
ఎడిటర్‌: నితిన్ బేద్
బ్యానర్: ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2025-04-18

స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా అమృత్‌సర్‌కు సమీపంలోని జలియన్‌వాలా బాగ్‌లో సమావేశమైన భారతీయులపై జనరల్ డయ్యర్ ఏప్రిల్ 13, 1919 సంవత్సరంలో విచాక్షణాత్మకంగా జరిపించిన కాల్పుల్లో 1500 మందికి పైగా మృత్యువాత పడ్డటం చరిత్రలో చీకటి రోజుగా మారిపోయింది. అత్యంత దారుణ సంఘటనపై బ్రిటీష్ ప్రభుత్వంపై అడ్వకేట్ సర్ శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్), యువ అడ్వకేట్ దిల్‌రీత్ సింగ్ (అనన్యపాండే) కేసు వేస్తారు. ఆ సంఘటనలో దోషిగా జనరల్ డయ్యర్ అని వాదిస్తారు. శంకరన్ నాయర్ వాదనలను తిప్పి కొట్టడానికి ప్రముఖ ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిలే్లే మెక్‌కిన్లే (ఆర్ మాధవన్)ను రంగంలోకి దించుతారు.

Kesari 2 Movie Review

బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే శంకరన్ నాయర్ డయ్యర్‌ దురాగతంపై ఎందుకు కేసు వేశారు? కేసు వేయడానికి శంకరన్ నాయర్‌ను యువ న్యాయవాది దిల్‌రీత్ గిల్ ఎలా ప్రేరేపించింది? బ్రిటీష్ కోర్టులో ప్రతికూల పరిస్థితుల మధ్య శంకరన్, గిల్ తమ వాదనలు ఎలా వినిపించారు? శంకరన్ నాయర్‌కు మెక్‌కిన్లేకు ఉన్న వైరాన్ని బ్రిటీష్ ప్రభుత్వం ఎలా వాడుకోవాలని చూసింది? శంకరన్‌ను మెక్ కిన్లే ఎలా ముప్పు తిప్పలు పెట్టారు? జనరల్ డయ్యర్‌పై వేసిన కేసు చెల్లదని బ్రిటీష్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత శంకరన్, దిల్‌రిత్ గిల్ పరిస్థితి ఏమైంది? అన ప్రశ్నలకు సమాధానమే కేసరి చాప్టర్ 2 సినిమా కథ.

బ్రిటీష్ ప్రభుత్వం దమనకాండను వ్యతిరేకిస్తూ భారతీయ న్యాయవాదులు డయ్యర్ సర్కార్‌పై తిరుగుబాటు చేసిన అంశాన్ని కోర్టు రూమ్ డ్రామాగా మలిచిన తీరు బాగుంది. దర్శకుడు త్యాగి రాసుకొన్న కథ, భావోద్వేగమైన అంశాలు, కథలో పాత్రలు అద్బుతంగా కనిపిస్తాయి. చరిత్ర సాక్ష్యంగా నిలిచిన కొన్ని పాత్రలు సజీవంగా ప్రేక్షకుడితో మాట్లాడుతున్నారా? అనే విధంగా డ్రామాను రక్తి కట్టించారు. ఆ కాలం నాటి పరిస్థితులకు ప్రేక్షకుడిని తీసుకెళ్లి రెండున్నర గంటలపాటు ఎంగేజ్ చేసిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. స్క్రీన్ ప్లే, కథలోని ట్విస్టులను అత్యంత ఆసక్తికరంగా చిత్రీకరించిన విధానం సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందని చెప్పొచ్చు.

సర్ శంకరన్ నాయర్‌గా అక్షయ్ కుమార్, మెక్ కిన్లేగా ఆర్ మాధవన్, దిల్‌రీత్ గిల్‌గా అనన్యపాండే ఈ సినిమాకు మూడు పిల్లర్లుగా నిలిస్తే.. దర్శకుడు నాలుగో స్తంభంగా కనిపిస్తాడు. ఈ ముగ్గురి పాత్రలను డిజైన్ చేసిన విధానానికి దర్శకుడికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ ముగ్గురు కూడా ఒకరికొకరు పోటీ పడి నటించారు. యాక్టర్లుగా కాకుండా నటీనటులుగా తెరపైన కనిపించేందుకు వారు చేసిన కృషి ఈ సినిమాకు మరో బ్యూటీగా నిలిచింది. ఈ చిత్రంలోని ప్రతీ పాత్ర ప్రేక్షకుడిని కదిలిస్తుంది. బాధపెడుతుంది. చప్పట్లు కొట్టిస్తుంది. హృదయాన్ని హత్తుకొనేలా చేస్తుంది.

కేసరి చాప్టర్ 2 సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ అత్యంత బలంగా నిలిచాయి. శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాకు ప్రాణంగా నిలిచింది. పాటలు భావోద్వేగాన్ని రగిలిస్తే.. బీజీఎం కోర్టు రూమ్‌లో డ్రామాతో ఉత్తేజాన్ని అందిస్తుంది. ఇక 1919 నాటి పరిస్థితులు, వాతావరణం, దుస్తులు తదితర అంశాల విషయం సహజత్వం ఉట్టిపడేలా జాగ్రత్త పడ్డారు. ఈ సినిమాలో ఎడిటింగ్ విభాగం పేర్చిన సన్నివేశాలు ఎమోషనల్ డ్రామాను గుండెకు హత్తుకొనేలా చేశాయి. నిర్మాణ విలువలు భేషుగ్గా ఉన్నాయి. స్క్రిప్టు వర్క్ చాలా బ్రహ్మండంగా చేశారు. ధర్మ ప్రొడక్షన్ తన బ్యానర్‌ ప్రమాణాలకు తగినట్టుగా ఈ సినిమాను రూపొందించింది.

హిస్టరీలోని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకొని ఈ మధ్యకాలంలో వచ్చిన కోర్డు రూమ్ డ్రామా గానీ, సామాజిక ఇతివృత్తాలతో రూపొందిన సినిమాల్లో కేసరి 2 ది బెస్ట్‌గా కనిపిస్తుంది. అక్షయ్, మాధవన్, అనన్యపాండే, రెజీనా పెర్ఫార్మెన్స్, టెక్నికల్ అంశాలు ఈ సినిమాను మరో రేంజ్‌కు చేర్చాయి. కంటెంట్, కటౌట్ ఉన్న సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. కేసరి 2 మిస్ చేసుకోకండి.. తప్పకుండా థియేటర్‌లోనే ఈ సినిమాను చూడండి.. గొప్ప అనుభూతితో సంతృప్తి చెందడమే కాకుండా పైసా వసూల్ కూడా అనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X