twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేసరి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Kesari Movie Review And Rating | Akshay Kumar | Parineeti Chopra | Anurag Singh | Filmibeat Telugu

    Rating:
    3.0/5
    Star Cast: అక్షయ కుమార్, పరిణితి చోప్రా, మిర్ సర్వార్
    Director: అనురాగ్ సింగ్

    బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా ముద్ర వేసుకొన్న అక్షయ్ కుమార్ ప్రస్తుతం రూటు మార్చి విభిన్నమైన చిత్రాలతో సక్సెస్ సాధిస్తున్నారు. ఎయిర్‌లిఫ్ట్, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, గోల్డ్ చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. ఇలా విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్న అక్షయ్ తాజాగా కేసరి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1897లో బ్రిటీష్ పాలనలో అఫ్ఘనిస్థాన్ వేర్పాటు వాదులతో జరిగిన యుద్ధం నేపథ్యంగా ఈ సినిమా రూపొందిద్దుకొన్నది. మార్చి 21న హోలీ పండుగ సందర్భంగా వచ్చిన ఈ చిత్రం అక్షయ్ కుమార్‌కు మరో సక్సెస్‌ను అందించిందా? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని మిగిల్చిందనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     కేసరి సినిమా కథ

    కేసరి సినిమా కథ

    బ్రిటీష్ సైన్యంలో హవల్దార్‌గా ఈశ్వర్ సింగ్ (అక్షయ్ కుమార్) పనిచేస్తుంటాడు. అఫ్ఘనిస్థాన్‌లో ఓ మహిళను కొందరు ముష్కరులు చంపడానికి ప్రయత్నిస్తుండగా ఈశ్వర్ సింగ్ ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తాడు. తన పై అధికారి వారిస్తున్నప్పటికీ వినకుండా ఆ మహిళను కాపాడుతాడు. దాంతో అధికారి ఆగ్రహానికి గురైన ఈశ్వర్ సింగ్.. ఎలాంటి ప్రాధాన్యం లేని సారాగార్హి అనే కోటలో విధులు నిర్వహించే 21 మందితో కూడిన 36 సిక్కు రెజిమెంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడుతాడు. ఆ కోటపై 10 వేల అఫ్ఘనిస్థాన్ వాదులు దాడి చేస్తారు.

    కథలో ట్విస్టులు

    కథలో ట్విస్టులు

    10 వేల మంది అఫ్ఘనిస్థాన్ మత, వేర్పాటువాదులను ఎదుర్కోవడానికి ఈశ్వర్ సింగ్ ఏం చేశాడు? అఫ్ఘనిస్థాన్ మహిళలను ఏ పరిస్థితుల్లో కాపాడేందుకు ప్రయత్నం చేశాడు. వేలాది మంది కోటను చుట్టుముట్టడానికి, దాడి చేయడానికి ప్రయత్నిస్తే 21 మంది సైనికుల్లో ఎలాంటి ధైర్యాన్ని నూరిపోసాడు? తుదిశ్వాస వరకు సైనికులు చేసిన పోరాటం ఎంత వరకు సత్పలితాన్ని ఇచ్చింది. సిక్కుల ధైర్య సాహసాలు ప్రత్యర్థులను ఎలా ఆకట్టుకొన్నాయి అనే ప్రశ్నలకు సమాధానమే కేసరి సినిమా కథ.

     కేసరి మూవీ ఫస్టాఫ్‌

    కేసరి మూవీ ఫస్టాఫ్‌

    అఫ్ఘనిస్థాన్ మత ఛాందసవాదుల్లో చిక్కుకున్న మహిళను రక్షించే అంశంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కి ఈశ్వర్ సింగ్ తన సొంత నిర్ణయంతో మహిళను కాపాడే ఎపిసోడ్ ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని నింపుతుంది. ఈశ్వర్ సింగ్‌ను సారాగర్హి కోటకు ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత కథలో వేగం, కథనంలో పస తగ్గడంతో ప్రేక్షకుడికి కొంత అసహనానికి కారణమవుతుంది. ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఫస్టాఫ్‌లో ప్రధాన భాగం నత్తనడకన సాగడంతో సినిమాపై ప్రేక్షకుడి పట్టు సడలినట్టు కనిపిస్తుంది.

     కేసరి మూవీ సెకండాఫ్

    కేసరి మూవీ సెకండాఫ్

    ఇక రెండో భాగం మంతా సారాగర్హి కోటను 10వేల మంది అఫ్ఘనిస్థాన్ వాదుల నుంచి కాపాడుకోవడమనే అంశంపైనే సాగుతుంది. 21 మంది సైనికులకు హవల్దార్ ఈశ్వర్ సింగ్ ధైర్యాన్ని నూరిపోయడం, బ్రిటీష్ సేనల నుంచి ఎలాంటి సహకారం లేకపోవడం కథ కొంత ఎమోషనల్‌గా సాగుతుంది. 21 మంది సైనికులు పోరాటం ప్రేక్షకుడిలో భావోద్వాన్ని నింపుతుంది. సిక్కు సైనికులు చేసిన పోరాటం తన ప్రత్యర్థులను కూడా మెప్పించే విధంగానే కాకుండా స్ఫూర్తిని రగిలించే పాయింట్‌తో కథ ముగుస్తుంది

     దర్శకుడు అనురాగ్ సింగ్ గురించి

    దర్శకుడు అనురాగ్ సింగ్ గురించి

    ఏ కథలోనైనా సైనికులు, యుద్ధం అనే అంశాలు భావోద్వేగాన్ని రగిలించేందుకు కారణమవుతాయి. కానీ కేసరి విషయానికి వస్తే అలాంటి అంశాలు చాలా తక్కువగా ఉంటాయి. కేవలం సిక్కు సైనికుల ధైర్య సాహసాలపైనే దర్శకుడు అనురాగ్ సింగ్ ఫోకస్ చేయడం కథ బలహీనంగా మారిందనిపిస్తుంది. కథలో బలమైన సన్నివేశాలను రాసుకోకపోవడం సినిమాకు మరో మైనస్. తొలి చిత్ర దర్శకుడిగా ఓ మంచి పాయింట్‌ను ఎంచుకొన్న అనురాగ్ సింగ్.. సారాగర్హి పోరాటాన్ని ప్రభావమంతమైన కథగా మలిచే క్రమంలో తడబాటుకు లోనైనట్టు కనిపిస్తుంది.

     అక్షయ్ కుమార్ యాక్టింగ్

    అక్షయ్ కుమార్ యాక్టింగ్

    కేసరి సినిమాకు అక్షయ్ కుమార్ వెన్నుముక అని చెప్పవచ్చు. స్క్రిప్టులో అనేక లోపాలను కేవలం తన ఫెర్ఫార్మెన్స్‌తో సరిచేశాడని చెప్పవచ్చు. సిక్కు యోధుడిగా అక్షయ్ నటించాడనే కంటే జీవించాడని చెప్పవచ్చు. సినిమాలో అక్షయ్ చేసిన ఫైట్స్, యాక్షన్ సీన్లు అబ్బురపరుస్తాయి. హై ఇంటెన్సిటీ వార్ సీన్లలో అక్షయ్ నటన అద్భుతంగా ఉంటుంది.

    కథలో ఆకట్టుకొనే డైలాగ్స్

    కథలో ఆకట్టుకొనే డైలాగ్స్

    మనం బానిసలం.. భరత గడ్డపై అంత పిరికివాల్లే జన్మిస్తారు అని ఓ తెల్లవాడు నాతో చెప్పాడు. ఇప్పుడు జవాబు చెప్పే సమయం ఆసన్నమైంది అంటూ అక్షయ్ చెప్పిన డైలాగ్స్ భావోద్వేగానికి గురిచేస్తాయి. నన్ను చంపేయండి.. కానీ నా తలపాగాను మాత్రం ముట్టుకోవద్దు అంటూ క్లైమాక్స్‌లో చెప్పిన అక్షయ్ చెప్పిన డైలాగ్స్ రక్తాన్ని ఉడికిస్తాయి. జీవన్మరణ పోరాటంలో ప్రత్యర్థిని మట్టుపెట్టిన విధానం ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుంది. ‘మాట మాటకు అల్లాను మధ్యలో ఎందుకు తీసుకొస్తావు, ఆయుధాలు లేకుండా యుద్ధం చేయగలమా?' ‘యుద్ధంలో నీ ఆయుధాన్ని నువ్వు ఉపయోగించు.. నా ఆయుధాన్ని నేను ఉపయోగిస్తా' లాంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉంటాయి.

    హీరోయిన్ పరిణితి చోప్రా గురించి

    హీరోయిన్ పరిణితి చోప్రా గురించి

    కేసరి కథలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం వల్ల ఎమోషనల్ యాంగిల్ పూర్తిగా మిస్ అయిందని చెప్పవచ్చు. భార్య, భర్తల, కుటుంబాల మధ్య ఉంటే ఎమోషన్ పెద్దగా పండలేదని చెప్పవచ్చు. కథలో గెస్ట్ రోల్‌లా పరిణితి చోప్రా పాత్ర ఉండటంతో ఆమె నటనకు స్కోప్ లేకపోయింది.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    గోవింద్ నామ్‌దేవ్, మిర్ సర్వార్ లాంటి ప్రతిభావంతులైన నటులు ఉన్నప్పటికీ అవి అసలే ఎలివేట్ కాలేకపోయాయి. అందుకు కారణం వారి గెటప్స్ కూడా ఒకటని చెప్పవచ్చు. సిక్కు సైనికుల ఆహ్యారం, గెటప్ వల్ల ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదనే ఫిలింగ్ కలుగుతుంది.

     టెక్నికల్‌ అంశాలు

    టెక్నికల్‌ అంశాలు

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మనీష్ మోరే ఎడిటింగ్ అంత గొప్పగా లేదు. దాంతో సినిమాలో పేలవమైన సన్నివేశాలు (ముఖ్యంగా ఫస్టాఫ్‌లో) చికాకుపెట్టిస్తాయి. అంశుల్ చోబే సినిమాటోగ్రఫి సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. అఫ్ఘన్ కొండ ప్రాంతాలను, యుద్ధ పోరాటాలను తెరపైన అద్భుతంగా చిత్రీకరించారు. తెరీ మిట్టి తప్పా పెద్దగా ఆకట్టుకునే పాటలు లేకపోవడం మరో మైనస్.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఎలాంటి ఎమోషన్స్, బలమైన సన్నివేశాల లేకుండా కేవలం యుద్ధ సన్నివేశాల నేపథ్యంగా కేసరి తెరకెక్కింది. యాక్షన్ ప్రాధానంగా సాగే ఈ చిత్రంలో భావోద్వేగాలు పండలేవనే చెప్పాలి. అన్ని వర్గాలను ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలు తక్కువే. టెక్నికల్ విభాగాల పనితీరు కూడా అంతంత మాత్రమే. అక్షయ్, పరిణితి తప్ప మిగితా నటీనటులు ఊరు, పేరు లేని వాళ్లు కావడం మరోమైనస్. యాక్షన్, దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రాలను చూసే ప్రేక్షకులకు, అక్షయ్ కుమార్ యాక్టింగ్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కేసరి గొప్ప చిత్రం కాకపోయినా చరిత్రపై ఆసక్తి ఉండే ప్రేక్షకులు ఓ సారి చూడటానికి అవకాశం ఉన్న సినిమా అని చెప్పవచ్చు.

     బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్

    • అక్షయ్ కుమార్ యాక్టింగ్
    • సినిమాటోగ్రఫి
    • ప్రొడక్షన్ వ్యాల్యూస్
    • మైనస్ పాయింట్స్

      • కథ, కథనాలు
      • ఎడిటింగ్
      • స్లో నేరేషన్
      • తెర ముందు, తెర వెనుక

        తెర ముందు, తెర వెనుక

        నటీనటులు: అక్షయ కుమార్, పరిణితి చోప్రా, మిర్ సర్వార్ తదితరులు

        కథ, దర్శకత్వం: అనురాగ్ సింగ్
        నిర్మాతలు: కరణ్ జోహర్, అరుణా భాటియా, హీరూ యష్ జోహర్, అపూర్వ మెహతా, సునీర్ ఖేతర్ పాల్
        సంగీతం: రాజు సింగ్
        సినిమాటోగ్రఫి: అంశుల్ చోబే
        ఎడిటింగ్: మనీష్ మోరే
        బ్యానర్: ధర్మ ప్రొడక్షన్స్
        రిలీజ్ డేట్: 2019-03-21

    English summary
    Kesari is a Hindi-language action-war film, written and directed by Anurag Singh.It was jointly produced by Karan Johar, Aruna Bhatia, Hiroo Yash Johar, Apoorva Mehta and Sunir Khetarpal under the banners of Dharma Productions, Cape of Good Films, Azure Entertainment and Zee Studios. The film stars Akshay Kumar, with Parineeti Chopra, Mir Sarwar, Vansh Bhardwaj, Jaspreet Singh, Vivek Saini and Vikram Kochhar in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X