twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేకలో బేస్ తగ్గింది...(కెవ్వు కేక రివ్యూ)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : అల్లరి నరేష్ సినిమాలంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే నరేష్ సినిమాలు చూసి తెగ నవ్వుకున్న ప్రేక్షకులకు ఆయన తాజా సినిమా 'కెవ్వు కేక' కేకపెట్టించే కామెడీ పంచుతుందని జోరుగా ప్రచారం చేసారు. గతంలో అల్లరి నరేష్‌తో బ్లేడ్ బాబ్జీ లాంటి హిట్ చిత్రం చేసిన దేవిప్రసాద్ దర్శకత్వం కావడంతో ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి సినిమా అంచనాలను ఏమేరకు రీచ్ అయిందో చూద్దాం...

    స్టోరీ వివరాల్లోకి వెళితే...
    బుచ్చి రాజు(అల్లరి నరేష్) కళానికేతన్ షోరూంలో సేల్స్ మేన్ జాబ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మహి(షర్మిల మాంద్రే)తో ప్రేమలో పడతాడు. అయితే మహి తండ్రి సుబ్బ రావు(ఎంఎస్ నారాయణ) వీరి పెళ్లికి ఒప్పుకోడు. తన కూతురును బాగా డబ్బున్న వాడికి ఇచ్చి చేయాలనేది ఆయన కోరిక. తాను డబ్బున్న వాడిని అని సుబ్బారావుని నమ్మించే ప్రయత్నం చేసి విఫలం అవుతాడు.

    దీంతో ఆరు నెలల్లో కోట్లు సంపాదించి మహిని పెళ్లి చేసుకోవడానికి వస్తానని సుబ్బారావుతో బుచ్చిరాజు చాలెంజ్ చేస్తాడు. డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచిస్తుండగా బుచ్చి రాజుకు తన మామ అబ్రకదబ్ర అప్పారావు(కృష్ణ భగవాన్) ద్వారా ఓ విషయం తెలుస్తుంది.

    మిగతా వివరాలు స్లైడ్ షోలో....

    ఇదండీ అసలు స్టోరీ...

    ఇదండీ అసలు స్టోరీ...

    గొట్టం గోపాల కృష్ణ(ఆశిష్ విద్యార్థి)చేతిలో తన తండ్రి మోసపోయాడని, గోపాలకృష్ణ నుంచి తనకు రావాల్సిన డబ్బు చాలానే ఉందని తెలుసుకుని అతని కోసం బ్యాంకాక్ వెళతాడు. మరి బుచ్చి రాజు తన ప్రయత్నంలో ఎలా సక్సెస్ అయ్యాడు? మహిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది తర్వాతి కథ.

    పెర్మార్మెన్స్ ఎలా ఉందంటే...

    పెర్మార్మెన్స్ ఎలా ఉందంటే...

    పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, అల్లరి నరేష్ ఎప్పటిలాగే రొటీన్ కామెడీ, పంచ్ డైలాగులతో రొటీన్‌గా ఆకట్టుకున్నాడు. దీంతో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాడు. అయితే సినిమాలో అతని లుక్ బాగుంది. హీరోయిన్ షర్మిలా మాంద్రే యాక్టింగ్ పరంగా ఫర్వాలేదు. గ్లామర్ పరంగా ఓకే. విలన్ పాత్ర అయినా కామెడీతో ఆకట్టుకున్నాడు ఆశిష్ విద్యార్థి. ఇతర నటీనటులు వారి పాత్రల మేరకు ఓకే...

    అంచనాలను అందుకోలేక పోయింది

    అంచనాలను అందుకోలేక పోయింది

    సినిమా కామెడీ సన్నివేశాలతో కాస్త నవ్వించినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఫస్టాఫ్‌లో సినిమాలో కొన్ని సీన్లు మాత్రమే థియేటర్లో నవ్వులు పూయించాయి. సినిమాలో కమెడియన్స్ ఉన్నా వారిని సరిగా ఉపయోగించుకోలేక పోయారు. సెకండాఫ్ లో సినిమా కాస్త గంధరగోళంగా తయారైంది. జరుగుబోయే సీన్ ప్రేక్షకులు ముందే తెలిపోతుండటంతో థ్రిల్ లేకుండా పోయింది.

    కేక పెట్టించే రేంజి కాదు

    కేక పెట్టించే రేంజి కాదు

    టెక్నికల్ విభాగాలన్నింటి పనితనం కూడా ఆకట్టుకునే స్థాయిలో లేదు. ఓవరాల్‌గా సినిమా గురించి మాట్లాడుకుంటే కొత్తదనం లేని కథ, కథనం, పట్టులేని స్క్రీన్ ప్లే వెరసి ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలకు తగిన విధంగా అలరించలేక పోయింది. సినిమా కాస్త నవ్విస్తుంది కానీ...కేక పెట్టించే రేంజి మాత్రం కాదు.

    నటీనటుల వివరాలు

    నటీనటుల వివరాలు

    సంస్థ: జాహ్నవి ప్రొడక్షన్స్‌ నటీనటులు: అల్లరి నరేష్‌, షర్మిలా మాండ్రే, ఆశిష్‌ విద్యార్థి, ఎమ్మెస్‌ నారాయణ, కృష్ణభగవాన్‌, సన, గీతాసింగ్‌, జ్యోతి, అపూర్వ తదితరులు ఈచిత్రంలో నటించారు.

    తెర వెనక ఉండి నడిపించింది...

    తెర వెనక ఉండి నడిపించింది...

    కథ: దేవిప్రసాద్, వేగేశ్న సతీష్, మాటలు: వేగేశ్న సతీష్, కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, సంగీతం: చిన్ని చరణ్, భీమ్స్, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాణ నిర్వహణ: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: శ్రీమతి నీలిమ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దేవి ప్రసాద్. నిర్మాత: బొప్పన చంద్రశేఖర్‌.

    English summary
    
 Comedy King Allari Naresh has once again teamed up with Devi Prasad five years after the release of their hit movie Blade Babji. In a nutshell, Kevvu Keka is a avarage comedy entertainer, which a family can sit together. It has its own share of drawbacks, but it will be a treat for comedy lovers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X