KGF 2 First review వచ్చేసింది.. వరల్డ్ క్లాస్ మూవీ.. సినిమాకు ఆ ఇద్దరే హైలైట్?:

బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలు గురించి మాట్లాడాలి అంటే KGF గురించి మాట్లాడుకోవాలి. 2018 ఆఖరులో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ముగింపుగా రాబోతున్న చాప్టర్ 2 పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఆ వివరాలు

110 కోట్ల బిజినెస్

110 కోట్ల బిజినెస్


KGF పార్ట్ వన్ విడుదలైనప్పుడు పెద్దగా అంచనాలు లేవు. అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా కన్నడ సినిమా సత్తాను దేశానికి చాటి చెప్పింది. ఆ సినిమా దెబ్బకు ఇప్పుడు సెకండ్ చాప్టర్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో బిజినెస్ అయితే గట్టిగానే జరిగింది. నిర్మాతలకు రిలీజ్ బిజినెస్ తోనే టేబుల్ ప్రాఫిట్ దక్కడం విశేషంగా చెప్పచ్చు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 110 కోట్ల బిజినెస్ చేసింది.

 సరికొత్త రికార్డులను

సరికొత్త రికార్డులను


ఈ సినిమా బాక్సాఫీస్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అని అర్థమవుతోంది. పోటీగా బీస్ట్ లాంటో మరో పెద్ద సినిమా వచ్చినా కూడా KGF చాప్టర్ 2 భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందని బాక్సాఫీస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సౌత్ టెలివిజన్ హక్కులు ఇప్పటికే జీ ఛానెల్ సంస్థ సొంతం చేసుకుంది. కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం భాషలకు సంబంధించిన శాటిలైట్ హక్కులను భారీ ధరకు జీ సంస్థ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.

, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో

, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో


ఇక సినిమా విడుదలకు దగ్గర పడడంతో ఎప్పటిలాగానే యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యులు, సినీ అనలిస్ట్ ఉమైర్ సంధు కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. ఒక భారీ మెసేజ్ ను ఈ సినిమా కోసం ఆయన రాసుకొచ్చాడు. ఈ కేజీఎఫ్ 2 కన్నడ సినిమాకు కీర్తి కిరీటం లాంటిది. సినిమా మొదటి నుంచి చివరి వరకు హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో నిండిపోయిందని చెప్పుకొచ్చాడు.

డైరెక్టర్ పనితనం


ఈ సినిమా నిండా పదునైన డైలాగ్స్ ఉన్నాయని, సంగీతం ఫర్వాలేదు కానీ అదిరిపోయే బీజీఎం దాన్ని బ్యాలెన్స్ చేసిందని చెప్పుకొచ్చారు. ఇదొక అద్భుతమైన మూవీ. సినిమా ఆద్యంతం అదే ఇంటెన్సిటీ చూపించడంలో డైరెక్టర్ పనితనం గొప్పగా ఉందని ప్రసంశలు గుప్పించాడు.

షాక్‌కి గురిచేస్తుందని

షాక్‌కి గురిచేస్తుందని


అంతే కాక సినిమాలో నటించినవాళ్లంతా అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇది కేవలం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన బ్లాక్ బ్లస్టర్ కాదు... ఇదొక వరల్డ్ క్లాస్ మూవీ. యశ్, సంజయ్ దత్ పాత్రలు అమితంగా ఆకట్టుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాక క్లైమాక్స్ మిమ్మల్ని షాక్‌కి గురిచేస్తుందని మొత్తం మీద సినిమా గూస్ బంప్స్ అంతే.' అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఉమైర్ సంధు తన రివ్యూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఉమైర్ సంధు రివ్యూ మీద భిన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X