For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఖాకీ మూవీ రివ్యూ: పోలీస్ పవర్ చూపించిన కార్తీ

  By Rajababu
  |

  Rating:
  3.0/5
  Star Cast: కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యు సింగ్
  Director: వినోద్

  Khakee Movie Public Talk ఖాకీ మూవీ పబ్లిక్ టాక్

  ఊపిరి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లోను మెప్పించారు తమిళ నటుడు కార్తీ. ఆ తర్వాత వచ్చిన చెలియా, అంతకుముందు వచ్చిన కాష్మోరా చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టులేకపోయాయి. ప్రస్తుతం మరోసారి పవర్ పోలీస్ ఆఫీసర్‌గా కార్తీ ఖాకి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీకి జంటగా అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. వాస్తవ కథ ఆధారంగా చేసుకొని పరిశోధనాత్మక చిత్రంగా ఖాకి నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోలీస్ పాత్రలో కార్తీ ప్రేక్షకులను మెప్పించారా? రకుల్, కార్తీ కెమిస్ట్రీ తెరమీద ఏ విధంగా వర్కవుట్ అయింది అనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

   ఖాకి కథ ఇదే..

  ఖాకి కథ ఇదే..

  ధీరజ్ (కార్తీ) నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. నిక్కచ్చిగా డ్యూటీ చేయడం మూలంగా ట్రాన్సఫర్లతో జీవితం ముందుకెళ్తుంటుంది. ఆ క్రమంలో తమిళనాడులో క్రూరమైన వరస దోపిడిలు పోలీస్ శాఖకు సవాల్‌గా నిలుస్తాయి. దోపిడిలకు పాల్పడుతున్నది అంతర్రాష్ట దొంగల ముఠా అని తన ఇన్వెస్టిగేషన్‌లో ధీరజ్ తెలుసుకొంటాడు. దోపిడి దొంగల దాడి కారణంగా తన భార్య (రకుల్)ను కోల్పోతాడు.

  ముగింపు ఇలా..

  ముగింపు ఇలా..

  అంతర్రాష్ట దొంగల ముఠా ఆటను ఎలా కట్టించాడు. ఆ క్రమంలో ఎలాంటి సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? రకుల్ ఏ కారణంగా ప్రాణాలు కోల్పోయింది? కీలకమైన కేసును ఛేదించిన ధీరజ్‌కు పై అధికారుల నుంచి ఎలాంటి పరిస్థితి ఎదురైంది అనే ప్రశ్నలకు సమాధానమే ఖాకి.

   ఖాకి విశ్లేషణ

  ఖాకి విశ్లేషణ

  దండుపాళ్యం లాంటి దోపిడి, నేర చరిత కథలు టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. అలాంటి కథకు ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథను జోడించి యాక్షన్ చిత్రంగా మలిచారు. దానికి తోడు కుటుంబం, భార్య లాంటి అంశాలతో సెంటిమెంట్‌ను దట్టించారు. మరుగునపడిన కీలకమైన కేసును బయటకు లాగి ఛేదించిన తీరు తెరపైన ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కార్తీ యాక్టింగ్, భావోద్వేగాలు కథను రక్తి కట్టించాయి. పక్కా కథ, స్క్రీన్ ప్లే దానికి తోడు కావడంతో రెండున్నర గంటలపాటు తెరపైన థ్రిల్లింగ్ సాగుతుంది. కథను ముందుకు నడిపించిన తీరు దర్శకుడి హెచ్ వినోద్ ప్రతిభకు అద్దం పట్టింది. క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్, సెంటిమెంట్ అంశాలను ఆస్వాదించే ప్రేక్షకులకు ఈ సినిమా ఓ కేరాఫ్ అడ్రస్. కాకపోతే సినిమా నిడివి, వినోదం లేకపోవడం ప్రేక్షకుడిని కొంత ఇబ్బందిని గురిచేసే అంశం.

   తొలిభాగం

  తొలిభాగం

  కార్తీ తన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పడం ప్రారంభించడంతో సినిమా తొలిభాగం ఆరంభం అవుతుంది. విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకొన్న పోలీస్ అధికారి కుమారుడిగా కార్తీ పోలీసు శాఖలో చేరడం, శిక్షణ, పోస్టింగ్‌తో సినిమా ముందుకెళ్తుంటుంది. ఆ తర్వాత రకుల్‌తో ప్రేమ, పెళ్లి ఓ ట్రాక్‌లో నడిపిస్తూనే మరో ట్రాక్‌లో కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంటుంది. ఇంటర్వెల్‌కు ముందు 15 నిమిషాలు సాగిన ఎపిసోడ్ సినిమాను మరో మెట్టు ఎక్కించడమే కాకుండా రెండో భాగంపై ఆసక్తిని రేపుతుంది. రకుల్‌పై ఓ కీలకమైన సన్నివేశాన్ని చూపించి ఇంటర్వెల్ బ్యాంగ్‌ అదిరించాడు.

   రెండోభాగం

  రెండోభాగం

  రెండో భాగంలో భార్య రకుల్ ఆరోగ్యం, డ్యూటీ మధ్య నలిగే ఆఫీసర్‌గా కార్తీ మరోసారి బాధ్యాతయుతమైన నటనను ప్రదర్శించాడు. రాజస్థాన్‌కు చేరిన కేసు దర్యాప్తు, యాక్షన్ సీన్లు, చేజింగ్ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. విలన్ అభిమన్యు సింగ్ గ్యాంగ్ ఆట కట్టించే విధానంపై అనుసరించిన తీరు దర్శకుడు టాలెంట్‌కు సాక్ష్యంగా నిలిచింది. నిజాయితీగా వ్యవహరించే అధికారులకు పోలీస్ శాఖలో జరిగే అన్యాయాన్ని ముగింపుగా చూపడం ప్రేక్షకుడిని ఆకట్టుకునే అంశం.

   డైరెక్టర్ వినోద్ రీసెర్చ్ గుడ్

  డైరెక్టర్ వినోద్ రీసెర్చ్ గుడ్

  పోలీస్‌శాఖ దర్యాప్తు, విశ్లేషణ లాంటి అంశాలపై దర్శకుడు వినోద్ చేసిన పరిశోధన థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న విషయాలపై జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆయన దర్శకత్వం ప్రతిభకు ఓ లోపంగా కనిపిస్తాయి. సాధారణ ప్రేక్షకులకు నచ్చే విధంగా కథను నడిపించడంలో వినోద్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

   పవర్‌ఫుల్‌గా కార్తీ

  పవర్‌ఫుల్‌గా కార్తీ

  ఇక కార్తీకి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. తెరమీద నిజమైన పోలీసు అనే భ్రాంతిని కలిగించడంలో కార్తీ సఫలయ్యాడు. తెరమీద ఆవేశం, ఎమోషన్‌ను చక్కగా పలికించాడు. రకుల్‌తో రొమాంటిక్ సీన్లలో సహజత్వాన్ని ప్రదర్శించాడు. కార్తీ కెరీర్‌లో ఖాకి మంచి చిత్రంగా మిగిలిపోతుంది.

   రకుల్ గ్లామర్

  రకుల్ గ్లామర్

  రకుల్ ప్రీత్ సింగ్ అల్లరి యువతిగా, ఆ తర్వాత బాధ్యతాయుతమైన భార్యగా కనిపించింది. తన పాత్ర పెద్దగా రకుల్ ఉపయోగపడకపోయినా తెర మీద గ్లామర్‌గా, హోమ్లీగా కనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఉండటం కారణంగా రకుల్ క్యారెక్టర్‌ను తగ్గించారేమో అనే అనుమానం కలుగుతుంది. అయినా తన పాత్ర పరిధి మేరకు రకుల్ ఫర్వాలేదనిపించింది.

  జిబ్రాన్ సంగీతం

  జిబ్రాన్ సంగీతం

  ఖాకి చిత్రానికి మహ్మద్ జిబ్రాన్ అందించిన సంగీతం అదనపు ఆకర్షణ. యాక్షన్ ఎపిసోడ్స్‌లో, చేజింగ్ సీన్లలో జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు సన్నివేశాలకు ప్రాణం పోసింది. కీలక సన్నివేశాల్లో మ్యూజిక్ మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. ఒకట్రెండు రొమాంటిక్ పాటలు అలరిస్తాయి.

   సూర్యన్ సినిమాటోగ్రఫీ

  సూర్యన్ సినిమాటోగ్రఫీ

  ఖాకీ సినిమాకు సత్యన్ సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫీ అదనపు ఎసెట్. తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా చేజింగ్ సీన్లు మంచి థ్రిలింగ్‌ను కలిగిస్తాయి. రాజస్థాన్ ఎడారుల్లో చిత్రీకరించిన సీన్లు తెర మీద ఆకట్టుకునేలా ఉన్నాయి.

   ఎడిటింగ్‌ అంశాలు..

  ఎడిటింగ్‌ అంశాలు..

  ఖాకి సినిమాలో ప్రధానమైన మైనస్ పాయింట్ ఏమిటంటే సినిమా లెంగ్త్. సెకండాఫ్‌లో ఈ సమస్య ఎక్కువగా అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో కత్తెర్లు పడాల్సినవి చాలానే కనిపిస్తాయి. ముఖ్యంగా టెలివిజన్ వార్తలు కథా వేగానికి అడ్డం పడినట్టు అనిపిస్తాయి. అంతేకాకుండా చాలా నాసిరకంగా ఉంటాయి. అలాంటి సీన్లను తొలగిస్తే సినిమా వేగం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. శివ నందీశ్వరన్ ఎడిటింగ్ ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉంది.

   ప్రొడక్షన్‌లోకి ఆదిత్య మ్యూజిక్

  ప్రొడక్షన్‌లోకి ఆదిత్య మ్యూజిక్

  సినిమా పరిశ్రమలో మ్యూజిక్ రంగంలో విశేషమైన సేవలందించిన ఆదిత్య మ్యూజిక్ తొలిసారి నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ చిత్రానికి తెలుగులో నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్ర ప్రమోషన్, నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.

  పాజిటివ్, నెగిటివ్ పాయింట్స్

  పాజిటివ్, నెగిటివ్ పాయింట్స్

  బలం, బలహీనతలు
  కార్తీ యాక్టింగ్
  కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్
  యాక్షన్ సీన్లు

  మైనస్ పాయింట్స్
  సెకండాఫ్‌‌లో స్లో నెరేషన్
  లెంగ్త్

   తెర వెనుక.. తెర ముందు..

  తెర వెనుక.. తెర ముందు..

  నటీనటులు: కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యు సింగ్ తదితరులు

  దర్శకత్వం: వినోద్
  సంగీతం: జిబ్రాన్
  నిర్మాతలు: ఉమేశ్ గుప్తా, ఆదిత్య మ్యూజిక్
  సినిమా నిడివి: 161 నిమిషాలు
  రిలీజ్ డేట్: నవంబర్ 17, 2017

  English summary
  Tamil hero Karthi is versatile actor. He get a lot of applause from the audience doing a many good pictures. Now Karthi came with Khakee movie. Rakul Preet Singh is the herione for the movie. This movie released on November 17th. In this occassion, Telugu Filmibeat brings exclusively Review for you
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X