twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతుకుల బొంత ఖాకీ చొక్కా

    By Staff
    |

    Khaki Chokka
    -ధర్మా
    చిత్రం: ఖాకీచొక్కా
    నటీనటులు: సాయికుమార్‌, నీలాంబరి, మురళీమోహన్‌, థ్రిల్లర్‌ మంజు,
    సత్యప్రకాష్‌, జయప్రకాష్‌రెడ్డి, జయలక్ష్మి
    సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌
    కెమెరా: శ్రీనివాస్‌
    నిర్మాత: ప్రసాదరావు
    కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, ఫైట్స్‌, దర్శకత్వం: విక్కీ

    టైటిల్‌కున్న బలం వల్ల ఈ సినిమాకు మంచి క్రేజే వచ్చింది. అందునా వందలాది చిత్రాలకు ఫైట్‌ మాస్టర్‌గా పనిచేసిన విక్కీ తొలి సారి దర్శకత్వం వహిస్తుండటంతో బావుంటుందేమో అన్న ఆశ కలగటం సహజం. కానీ సినిమా చూసిన తర్వాత ఆయన్ని తిట్టుకోని ప్రేక్షకుడు ఉండడు. పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ సినిమాలో అరుపులు కేకలు, ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ప్రేక్షకులు ఓపికగా భరించే సన్నివేశాలే లేవు. ఏ సన్నివేశానికా సన్నివేశంతో సినిమా పూర్తిగా అతుకుల బొంతలా తయారైంది.

    కథ గురించి చెప్పుకోవాలంటే శూన్యం.

    మాజీ ఎమ్మెల్యే జయ్రపకాష్‌రెడ్డి, అతని కొడుకులు అన్యాయాలు చేస్తూ అక్రమాలకు ఆనవాళ్ళుగా ఉంటుంటారు. వారిని ఆటోడ్రైవర్‌ థ్రిల్లర్‌ మంజు ఎదిరిస్తుంటాడు. మరో వైపు కళ్ళెదుట భార్యను అవమానిస్తున్నా పట్టించుకోకుండా సర్దుకు పోతుంటాడు సాయికుమార్‌. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మాజీ ఎమ్మెల్యే బృందాన్ని అరికట్టాలంటే సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ఎ.సి.పి. ప్రతాప్‌ వల్ల మాత్రమే వీలవుతుందని, అతను ఒక్క రిటైర్డ్‌ మిలిటరీ ఆఫీసర్‌ బోసు (మురళీమోహన్‌) మాట మాత్రమే వింటాడని చెప్పటంతో కమీషనర్‌ బోసు సాయం కోరతాడు.

    ఆయన చెప్పినా మాట వినని సాయికుమార్‌ తన వల్ల కాదంటాడు. నిందిస్తున్న బోసుకు ఫ్ల్యాష్‌బ్యాక్‌ను వివరిస్తుంది అతని భార్య (నీలాంబరి). దాని ప్రకారం ఓ అమ్మాయి రేప్‌ కేసులో భవాని (సత్యప్రకాష్‌)ని అరెస్ట్‌ చేసి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడేట్టు చేస్తాడు సాయి. ఆ తర్వాత జర్నలిస్టు అయిన నీలాంబరి ని పెళ్ళి చేసుకుంటాడు. స్వార్థపరుల కుట్రతో పదవికి రాజీనామా చేయటమే కాకుండా వారి దాడిలో అతని భార్య నడిరోడ్డుపై ప్రసవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో భార్య కోరిక మేరకు తన ఎదట ఎటువంటి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకుండా ఉంటాడన్న మాట. అనంతరం బోసు చేసిన త్యాగంతో మరల ఖాకీని ధరించి దుండుగుల పీచమణచటంతో సినిమా కంచికి ప్రేక్షకులు ఇంటికి.

    ఈ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పకుంటే అంత మంచిది. అనవసరపు హడావుడి తప్ప విషయం శూన్యం. కథ నుంచి కథనం, మాటలు, ఫైట్స్‌, దర్శకత్వం విక్కీ అందించారు. ఆయనలో ఏదో చెప్పాలన్న తపనైతే ఉంది కానీ అందుకు సంబంధించిన పరిశీలన, పరిజ్ఞానం ఏమాత్రం లేవని అర్థం అవుతుంది. డైలాగులు ఒక్కోటి వింటుంటే బాగా ఉన్నాయనిపిస్తుంది. అయితే సినిమాలో మాత్రం అంతగా పేలలేదు.

    ప్రత్యేకించి మురళీమోహన్‌ పోషించిన పాత్రకు స్పందన లేనే లేదు. సాంకేతికంగా చెప్పుకునేందుకు కూడా ఏమీ లేదు. ఫైట్‌ మాస్టర్‌ అయిన విక్కీ నుంచి వచ్చిన ఈ చిత్రంలో కనీసం ఫైట్స్‌ కూడా ఆకట్టుకునేలా లేవు. గాలిలో ముష్టి ఘాతాలతో ఫైట్స్‌ ఉన్నాయి. ఒక్క ఫైర్‌ ఫైట్‌ మాత్రం ఫర్వాలేదు. ఎవరికీ ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వనటువంటి చిత్రమిది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X