Khauf Web Series Review: ఖావుఫ్ వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: మోనిక పన్వర్, రజత్ కపూర్, రియా శుక్లా, చమ్ దారంగ్, అభిషేక్ చౌహాన్, అషీమా వర్ధాన్, ప్రియాంక సేతియా, రష్మి జురైల్ మాన్, గగన్ అరోరా తదితరులు
దర్శకత్వం: పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్
క్రియేటర్: స్మితా సింగ్
సినిమాటోగ్రఫి: పంకజ్ కుమార్
నిర్మాణం: మ్యాచ్ బాక్స్ షాట్స్
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్స్: 8
ఓటీటీ రిలీజ్ డేట్: 2025-04-18
గ్వాలియర్‌కు చెందిన మాధురి అలియాస్ మధు (మోనిక పన్వర్) లైఫ్‌లో ఓ పెద్ద సమస్య కుంగిపోయి ప్రశాంతంగా, స్వేచ్చగా బతికేందుకు ఢిల్లీకి వస్తుంది. ఢిల్లీలో ఉద్యోగం సంపాదించేందుకు తన బాయ్‌ఫ్రెండ్ అరుణ్ (అభిషేక్ చౌహన్) సహకరిస్తాడు. తన ఆర్థిక స్తోమతకు తగినట్టుగా ఢిల్లీ నగర శివారులోనే ఓ ప్రభుత్వ హాస్టల్‌లో ఉండేందుకు సిద్దపడుతుంది. అయితే ఆ హాస్టల్‌లోకి వెళ్లిన తర్వాత తాను ఉండే రూమ్‌లో అంతకుముందు ఓ అమ్మాయి చనిపోయిందని తెలుస్తుంది. ఆ గదిలో ఏదో తెలియని ఆత్మ వెంటాడుతందని భయపడుతుంది. తన తన హాస్టల్‌లో ఉండే అమ్మాయిలు కోమల్ (రియా శుక్లా), నిక్కి (రష్మి జురైల్ మాన్), రిమా (ప్రియాంక సేతియా), స్వెత్లానా (చుమ్ దరంగ్) హాస్టల్ వదిలి పొమ్మని హెచ్చరించి భయపెడుతారు.

అయితే మాధురికి ఎదురైన చేదు అనుభవం ఏమిటి? గ్వాలియర్ నుంచి ఢిల్లీకి రావడానికి కారణం ఏమిటి? అరుణ్‌తో మాధురికి ఉన్న అఫైర్ ఎలాంటిది? నకుల్ ఖన్నా (గగన్ అరోరా)ను ఆమె ఎందుకు వెంటాడుతుంది? తన హాస్టల్‌లోని తాను ఉంటున్న గదిలో అమ్మాయి ఎలా చనిపోయింది? పాత ఢిల్లీలో ఉన్న హకీమ్ (రజత్ కపూర్)ను మాధురీ ఎందుకు సంప్రదించింది? మహిళలను హకీమ్ ఎందుకు చంపుతున్నాడు? కానిస్టేబుల్ మిశ్రా (గీతాంజలి కులకర్ణి) కొడుకు అదృశ్యం వెనుక కారణం ఏమిటి? నకుల్ ఫ్రెండ్స్‌ను మాధురి ఎందుకు చంపింది? అన ప్రశ్నలకు సమాధానమే ఖావుఫ్ వెబ్ సిరీస్ కథ.
హారర్ ఎలిమెంట్స్ ఉన్న పక్కా ఎమోషనల్, మర్డర్ మిస్టరీ స్టోరిని దర్శకుడు పంకజ్ కుమార్, సూర్య రాసుకొన్న తీరు బాగుంది. కథలోకి నాలుగైదు లేయర్లు జొప్పించి.. ప్రతీ లేయర్‌లో కథను ఆసక్తికరమైన సన్నివేశాలుగా తీర్చిదిద్దడంలో తమ ప్రతిభను చాటుకొన్నారు. మొదటి రెండు ఎపిసోడ్స్ తర్వాత కొంత ఓపికకు పరీక్ష పెట్టినట్టు కథను ఉద్దేశపూర్వకంగానే సాగదీశారా? అనే విధంగా ఉంటుంది. మళ్లీ చివరి మూడు ఎపిసోడ్‌లో కథలో కదలిక మొదలవుతుంది. చివరి మూడు ఎపిసోడ్స్‌ను కంటెంట్ పరంగా ఎఫెక్టివ్‌గా ప్రజెంట్ చేశారని చెప్పవచ్చు.
ఇక నటీనటుల విషయానికి వస్తే. మాధురిగా మోనికా పన్వర్ ఈ సిరీస్‌ను మొత్తంగా తన భుజాలపై మోశారు. ఎమోషనల్ సీన్లో భావోద్వేగానికి గురిచేస్తూ.. గ్లామర్ సీన్లలో అడల్డ్ కంటెంట్‌ను జనరేట్ చేస్తూ.. తన పాత్రకు ఎలాంటి అంశాలను అందించాలో అన్నీ చేసేసిందనిపిస్తుంది. ముఖ్యంగా సీరియస్‌గా సాగే ప్రతీ సన్నివేశంలో ఆమె పెర్ఫార్మెన్స్, మైన్యూట్‌గా ఉండే ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకొనేలా ఉంటాయి. రజత్ కపూర్ హకీం పాత్రలో విభిన్నమైన నటనను పోషించారు. ఇక ఈ చిత్రంలో నటించిన నలుగురు అమ్మాయిలు, అరుణ్, నకుల్ తమ ప్రజెన్స్‌ను స్టోరీలో చాటుకొంటారు.

ఇక సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే.. ఈ సిరీస్‌కు డిజైన్ కలర్ టోన్ కథకు కావాల్సిన మూడ్‌ను క్రియేట్ చేసింది. స్పోక్ ఎఫెక్ట్, బ్లాక్ అండ్ గ్రే కలర్ టోన్ సన్నివేశాలను మరింత హారర్‌గా మార్చారు. ఇక ఢిల్లీలోని పాత భవనాల్లో చేసిన షూట్, అలాగే డార్క్ హారర్ కామెడీకి కావాల్సిన ఎన్విరాన్‌మెంట్‌ను సినిమాటోగ్రాఫర్ పంకజ్ కుమార్ చక్కగా కెమెరాలో బంధించాడు. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త షార్ప్‌గా కట్ చేసి నిడివిని తగ్గించే అవకాశం ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
ఖావుఫ్ గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఓ డిఫరెంట్ క్రైమ్, హారర్ జోనర్. తనకు జరిగిన అన్యాయానికి పగతీర్చుకొనే అమ్మాయి చుట్టూ జరిగే సంఘటనలు, మిస్టరీ ఎలిమెంట్స్ సిరీస్‌ను చూసేలా ఆసక్తిని రేపుతాయి. అయితే స్లో నరేషన్, మల్టీపుల్ లేయర్స్ వల్ల కథ ముందుకు సాగదేంటి? అనే ఫీలింగ్ కలుగుంది. హారర్ సినిమాలను చూసే వారికి నచ్చే అవకాశం ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి వీలున్న సమయంలో తీరికగా చూసుకొండి.. ఓ డిఫరెంట్ అనుభూతిని కలిగిస్తుంది.


Click it and Unblock the Notifications











