Killer Artiste Movie Review: కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, సత్యం రాజేశ్, ప్రభాకర్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, భద్రమ్, తాగుబోతు రమేష్, సుదర్శన్. పీ కిరీటీ, వెంకీ మంకీ, సోనియా ఆకుల, స్నేహ మాధురి శర్మ, తదితరులు
కథ, దర్శకత్వం: రతన్ రిషి
నిర్మాత: జేమ్స్ వాట్ కొమ్ము
ఎడిటర్: ఆర్ఎం విశ్వనాథ్ కుచనపల్లి
సినిమాటోగ్రఫి: చందూ ఏజే
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
సౌండ్ డిజైన్: సాయి మనీధర్ రెడ్డి
ఆర్ట్: రవిబాబు దొండపాటి
ఫైట్ మాస్టర్: దేవరాజు
బ్యానర్: జేకే ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2025-03-21

విక్కీ (సంతోష్ కల్వచెర్ల) జాను (క్రిషేక పటేల్) ప్రేమించుకొంటారు. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే అందుకు నిరాకరిస్తారు. ఈ క్రమంలో విక్కీ సోదరి (స్నేహ మాధురి శర్మ) అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తుంది. ఇదిలా ఉండగా, రేప్ మర్డర్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న పిచ్చి రవి అలియాస్ సైకో రవి (ప్రభాకర్) జైలు నుంచి తప్పించుకొంటాడు. జాను ఇంటిలోకి జరుగుతున్న పార్టీలోకి దూరి పిచ్చి రవి ఒక్కొక్కరిని చంపుతుంటాడు.

Killer Artiste Movie Review in Telugu

విక్కీ, జాను ప్రేమను తల్లి (పులి సీత) ఎందుకు నిరాకరిస్తుంది? జాను తల్లిదండ్రులు ఎందుకు సపరేట్ అయ్యారు? విక్కీ సోదరి అనుమానాస్పద మరణానికి కారణం ఎవరు? జాను లవ్ స్టోరీపై తండ్రి రవీంద్ర (వినయ్ వర్మ) అభిప్రాయం ఏమిటి? పిచ్చి రవి ఏ పరిస్థితుల్లో పోలీసుల నుంచి తప్పించుకొన్నారు? జాను ఇంటిలోకి చేరి ఒక్కొక్కరిని చంపడం వెనుక కారణాలు ఏంటి? పిచ్చి రవి విధ్వంస, మారణకాండను విక్కీ అడ్డుకొన్నాడా? తన చెల్లెలి మరణానికి కారణమైన వారిని గుర్తించి ప్రతీకారం తీర్చుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా కథ.

చరిత్రలో మనకు తెలిసిన 64 కళలకు మించి అదనంగా మర్డర్ చేయడమనేది 65వ కళగా భావిస్తూ ఆ పాయింట్ చుట్టు క్రైమ్, థ్రిల్లర్ అంశాలను జోడించి దర్శకుడు రతన్ రిషి రాసుకొన్నారు. ప్రేమకు కులమతాల అడ్డు, పరువు ప్రతిష్టలను అంశంగా చేసుకొని కొంత ఎమోషనల్ కంటెంట్‌ను జోడించే ప్రయత్నం బాగుంది. కానీ క్రైమ్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి.. భావోద్వేగ అంశాలకు తక్కువ స్కోప్ ఇవ్వడం వల్ల సినిమా కథ చెప్పాల్సిన టార్గెట్‌ను మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. జాను ఇంటిలో జరిగే క్రైమ్ డ్రామాను సాగదీసి బోర్ కొట్టించాడే అనిపిస్తుంది. కానీ చివర్లో హానర్ కిల్లింగ్ అంశాన్ని, హీరో సోదరి మరణం వెనుక ఓ ట్విస్టును తెరపైకి తీసుకొచ్చి ఫీల్ గుడ్ అంశంగా మార్చే ప్రయత్నం బాగుంది. కానీ అప్పటికే సినిమాపై ప్రేక్షకుడు ఓ నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఏర్పడింది.

ఇక నటీనటులు విషయానికి వస్తే.. విక్కీ పాత్రలో సంతోష్ కల్వచెర్ల కొత్తవాడైనప్పటికీ.. క్యారెక్టర్‌కు తగిన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నాడు. ఎమోషనల్ సీన్లలో మెచ్యురిటీతో కూడిన ఫెర్ఫార్మెన్స్ చేసి మెప్పించే ప్రయత్నం చేశాడు. నటనపరంగా ఇంకాస్త మెరుగు పరుచుకొంటే మంచి అవకాశాలు లభించే ఛాన్స్ ఉంది. ఇక జానుగా క్రిషేక పటేల్ గ్లామర్ పరంగా ఫర్వాలేదనిపించింది. హీరోతో రొమాంటిక్ సీన్లలో మంచి కెమిస్ట్రీని పండించింది. చివరల్లో బిగ్‌బాస్ ఫేమ్ సోనియా ఆకులు భావోద్వేగమైన పాత్రతో సినిమాను మలుపుతిప్పేలా చేసింది.

Killer Artiste Movie Review in Telugu

ఇక విలన్ పాత్రలో పిచ్చి రవిగా ఫుల్ లెంగ్త్ పాత్రతో ప్రభాకర్ మంచి అవకాశాన్ని చేజిక్కించుకొని ఆ క్యారెక్టర్‌కు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. ఇక రవీంద్రగా వినయ్ వర్మ మంచి ట్విస్టు ఉండే పాత్రనే కాకుండా.. కథను మలుపుతిప్పి ఓ క్యూరియాసిటీని కలిగించేదిగా ఉంది. తన పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశాడు. ఇక ఇన్స్‌పెక్టర్‌గా సత్యం రాజేశ్ మరో కీలక పాత్రలో కనిపించాడు. అలాగే కమెడియన్ భద్రం సీరియస్ రోల్‌లో వెరైటీ క్యారెక్టర్‌తో ఆకట్టుకొన్నారు. ఇక ఈ సినిమాలో నటించిన వారంతా తమ పాత్రలకు పరిధి మేరకు ఓకే అనిపించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్‌గా కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సీన్లను బాగా ఎలివేట్ చేశాడు. చందూ ఏజే సినిమాటోగ్రఫి కూడా బాగుంది. రవిబాబు దొండపాటి ఆర్ట్ వర్క్ సినిమాకు రిచ్ ఫీలింగ్ తెచ్చిపెట్టింది. జాను ఇంటిలో జరిగే క్రైమ్ డ్రామా కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. ఆ ఎపిసోడ్‌పై ఆర్ఎం విశ్వనాథ్ కుచనపల్లి కాస్త గట్టిగానే కత్తెర్లు వేయాల్సి ఉందనిపిస్తుంది. సమాజం మనకు అన్ని నేర్పిస్తుంది. కానీ మనం ఏం నేర్చుకొన్నామనేది ముఖ్యం, నీకూ నాకు ప్రపంచం ఒక్కటే కానీ.. నువ్వూ, నేనూ ఎప్పటికీ ఒక్కటి కాలేము లాంటి డైలాగ్స్ ఆలోచింపదగినదిగా ఉన్నాయి. జేమ్స్ వాట్ కొమ్ము అనుసరించిన నిర్మాణ విలువలు హై రేంజ్‌లో ఉన్నాయి. పాత్రల కోసం నటీనటుల ఎంపికను చూస్తే.. సినిమాపై వారికి ఉండే అభిరుచి ఏమిటో తెలియజెప్పింది.

హానర్ కిల్లింగ్ అనే పాయింట్‌తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. కానీ హార్ట్‌ను టచ్ చేసే పాయింట్‌కు క్రైమ్ జోనర్‌ను జోడించి చేసిన ప్రయత్నం బాగానే ఉంది. కానీ మితిమీరిన హింస, రక్తపాతం ఈ సినిమాకు కొంత మైనస్. ఇలాంటి అంశాలు థియేట్రికల్‌గా కంటే ఓటీటీలో ఎక్కువగా సేల్ అవుతుంటాయి. యాక్టర్ల పెర్ఫార్మెన్స్, టెక్నికల్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. క్రైమ్, థ్రిల్లర్ తరహా సినిమాలను ఇష్టపడే వారికి కిల్లర్ ఆర్టిస్ట్ నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X