King of Kotha Review నత్తనడకగా గ్యాంగ్‌స్టర్ డ్రామా.. నిర్మాతగా, హీరోగా దుల్కర్ హిట్ కొట్టాడా?

Review: 2.5/5

నటీనటులు: దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రసన్న, అనికా సురేంద్రన్, శరన్ శక్తి, షబీర్ కల్లరక్కల్, రితికా సింగ్ తదితరులు
దర్శకత్వం: అభిలాష్ జోషి
రచన: అభిలాష్ ఎన్ చంద్రన్
నిర్మాత: దుల్కర్ సల్మాన్, జీ స్టూడియోస్
సినిమాటోగ్రఫి: నిమిష్ రవి
ఎడిటింగ్: ఉమా శంకర్ సతాపతీ
మ్యూజిక్: జేక్స్ బిజోయ్, షాన్ రహ్మాన్
బ్యానర్: వేఫారెర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2023-08-24

రాజు (దుల్కర్ సల్మాన్), కన్నా భాయ్ (షబ్బీర్ కల్లరక్కల్) చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే మరొకరికి ప్రాణం. కోతా అనే పట్టణంలో ఇద్దరు రౌడీయిజం సాగిస్తూ గంజాయి, ఇతర మాఫియా వ్యవహారాలను కొనసాగిస్తుంటారు. తారతో రాజు ప్రేమలో పడుతాడు. అయితే ఓ కారణంగా రాజు, కన్నాభాయ్ ఇద్దరు బద్ద శత్రువులగా మారుతారు. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే తల్లిదండ్రులను (కోతా రవి), చెల్లెలు (అనికా సురేంద్రన్) విడిచి పెట్టి లక్నోకు వెళ్లిపోతాడు.

King of Kotha Movie Review

రౌడీగా మారడానికి రాజు ప్రేరేపించిన అంశాలు ఏమిటి? కన్నన్, రాజు బాల్య స్నేహితులుగా ఎలా మారారు? ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని రాజు, కన్నన్ శత్రువులుగా ఎలా మారారు? కోతా పట్టణంలో కన్నన్ టీమ్ మాఫియా అరాచకాలు ఎలా సాగాయి? కన్నన్ ఆగడాలను అడ్డుకోవడానికి ఐపీఎస్ సాహుల్ హసన్ (ప్రసన్న) ఎలాంటి ప్లాన్స్ వేశారు. కష్టాల్లో ఉన్న తన ఫ్యామిలీని, చెల్లెల్నిని రక్షించుకొనేందుకు రాజు తిరిగి కోతా పట్టణానికి తిరిగి వచ్చాడా? కన్నన్‌తో వైరం ఎలా కొనసాగింది? కన్నన్ మాఫియా సామ్రాజ్యానికి రాజు ఎలా చెక్ పెట్టాడు? అనే ప్రశ్నలకు సమాధానమే కింగ్ ఆఫ్ కోతా సినిమా కథ.

కోతా పట్టణంలో కన్నన్ అరాచకాల గురించి తెలుసుకొన్న పోలీస్ ఆఫీసర్ సాహుల్.. గంజాయి వ్యాపారంపై ఉక్కుపాదం వేయడానికి ప్రయత్నించడం, అందుకు కన్నన్ తన తడాఖాను చూపించి సాహుల్‌ను, తన ఫ్యామిలీని భయభ్రాంతులకు గురిచేయడం లాంటి అంశాలతో కథ రొటీన్‌గా, రెగ్యులర్‌గా సాగుతుంది. హీరో దుల్కర్ సల్మాన్ ఎంట్రీ కోసం కనీసం 30 నిమిషాలు వేచి చూడాల్సిన పరిస్థితితో కథనం సాగుతుంది. హీరో ఎంట్రీ ఇచ్చిన తర్వాతైనా కథలో వేగం పుంజుకొంటుందా? అంటే అదీ జరగదు. నత్త నడకన కథ సాగుతూ.. రకరకాల అంశాలతో గందరగోళంగా అనిపిస్తుంది.

King of Kotha Movie Review

ఫస్టాప్‌లో విసిగి వేసారిన ప్రేక్షకులకు సెకండాఫ్‌లో కొంత దుల్కర్ సల్మాన్ హీరోయిజం చూసేందుకు ఛాన్స్ దొరకడంతో కొంత ఊరట లభిస్తుంది. సెకండాఫ్‌లో ఎలివేషన్ సీన్లు, డైలాగ్స్, యాక్షన్ సీన్లు సినిమాను పాజిటివ్ జోన్‌లోకి నెడుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్స్ వరకు వచ్చే ట్విస్టులు సినిమాను మరింత సాగదీయడంతో మూవీ ఎప్పుడు ముగుస్తుందా అనేది ప్రేక్షకుడి వంతు అవుతుంది. సెకండాఫ్‌ను దుల్కర్ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో నిలబెడితే.. విలన్‌గా షబ్బీర్ పోటాపోటీగా నటించి ఆకట్టుకోవడం పాజిటివ్ అంశాలుగా కనిపిస్తాయి. దర్శకుడు రాసుకొన్న పాయింట్ బాగున్నప్పటికీ.. కథగా విస్తరించడంలో పలుమార్లు తడబాటుకు గురైనట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

దర్శకుడు రాసుకొన్న పాయింట్ బాగున్నప్పటికీ.. కథగా విస్తరించడంలో పలుమార్లు తడబాటుకు గురైనట్టు స్పష్టంగా కనిపిస్తుంది. రకరకాల పాత్రలతో కంగాళీగా కథను మార్చాడు.

King of Kotha Movie Review: Dulquer Salmaan looks angry young man role

ఇక నటీనటులు విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్ ఇప్పటి వరకు లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ పాత్రలతో ఆకట్టుకొన్నాడు. లవర్ బాయ్ నుంచి భాయ్ పాత్రలో రాజుగా దుల్కర్ ఒదిగిపోయాడు. రాజు క్యారెక్టర్‌ను సినిమాలో సరైన ట్రాక్‌లో ప్లేస్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడనిపిస్తుంది. హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మీ కథలో ప్రధాన పాత్రే అయినప్పటికీ.. సినిమాలో గెస్ట్ రోల్‌కే పరిమితమైంది. కనన్న్‌గా విలన్ పాత్రలో షబ్బీర్ నటన ఆకట్టుకొంటుంది. చెల్లెలిగా అనికా సురేంద్రన్ ఒకే అనిపిస్తుంది. మిగితా పాత్రల్లో నటించిన వారు వారి వారి పాత్రలకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు.

కింగ్ ఆఫ్ కోతా సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను హై రేంజ్‌లో ఎలివేట్ చేసింది. పిరియాడిక్ ఫీల్‌ను అందించడంలో ఆర్ట్ విభాగం వర్క్ బాగుంది. సన్నివేశాలను డిఫరెంట్ లైటింగ్ ఫ్లేవర్‌తో ఫీల్‌గుడ్‌ను అందించడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు నిర్మాత దుల్కర్ తన టేస్ట్‌ను స్క్రీన్‌పై చూపించారు. నిర్మాణ విలువలు టాప్ క్లాస్ ఉన్నాయి. కథ, కథనాలపై మరింత వర్క్ చేసి ఉంటే బెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అయి ఉండేదనిపిస్తుంది.

King of Kotha Movie Review: Dulquer Salmaan looks angry young man role

ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్ అంశాలు ప్యాకేజీగా రూపొందిన గ్యాంగస్టర్ డ్రామా కింగ్ ఆఫ్ కోతా. కమర్షియల్ హంగులు ఉన్న పాయింట్‌ను బలంగా తెర మీద చెప్పడంలో దర్శకుడు తడబాటుకు గురయ్యాడు. అయినా దుల్కర్ తన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను ఆదుకొనే ప్రయత్నం కొంత వరకు సక్సెస్ అయింది. పగ, ప్రతీకారంతో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా తెలుగువారికి కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ మలయాళం, తమిళ ప్రేక్షకులకు నచ్చడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్ పండగలాంటి సినిమా. గ్యాంగ్‌స్టర్ డ్రామాలను ఆలరించే వారు చూడదగిన చిత్రం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X