Kingdom First Review: విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ఫస్ట్ రివ్యూ

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న చిత్రం కింగ్డమ్. విజయ్ దేవరకొండ హీరోగా సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్, జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు, సెన్సార్ బోర్డు రివ్యూ వివరాల్లోకి వెళితే..

శ్రీలంక బ్యాక్ డ్రాప్‌తో సాగే యాక్షన్ ఎమోషనల్ స్టోరీని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెప్పిన విధానం బాగుంది. 40 నిమిషాల నిడివి ఉన్న సినిమాలోని కీలక పార్ట్‌ను చూశాను. ఈ సినిమా కొంత మేరకు చూసిన తర్వాత బ్లాక్‌బస్టర్ అవుతుందని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మర్‌గా నిలుస్తుంది. ఈ సినిమా విజయంపై ఎలాంటి అనుమానాలు లేవు అని ఆయన అన్నారు.

Kingdom Movie Review by Censor Board

కింగ్డమ్ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్, రణ్‌బీర్ కపూర్, సూర్య సపోర్టుగా నిలిచారు. సుమారుగా 2 నిమిషాలు ఉన్న టీజర్‌కు సంబంధించి తెలుగులో ఎన్టీఆర్, హిందీలో రణ్ బీర్, తమిళంలో సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారు. అణగారిన ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిగా.. ఓ వర్గానికి నేతగా యుద్ధం చేసిన యోధుడిగా విజయ్ దేవరకొండను టీజర్ ఎలివేట్ చేసిన తీరు అంచనాలు పెంచింది.

భారీ అంచనాలతో రిలీజ్‌కు సిద్దమైన కింగ్డమ్‌ను ఇటీవల సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) సభ్యులు వీక్షించారు. అయితే సెన్సార్‌కు ఈ కథలోని ఇంటెన్సిటీ, సన్నివేశాల్లో రక్తపాతం నేపథ్యంలో ఏ సర్టిఫికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. అలాంటి అనుమానాలను దర్శకుడు కూడా వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్, కొన్ని యాక్షన్ రిలేటెడ్ సీన్లపై సెన్సార్ వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ కొన్ని మార్పులు చేయాలని సూచనలు చేశారనేది సమాచారం.

అయితే ఈ సినిమా వీక్షించిన అనంతరం డిఫరెంట్ మూవీగా ఫీలయ్యారు. ఈ సినిమాలోని కంటెంట్ గురించి బాగా చెప్పారు. కొన్ని సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చర్చించారు. హింస, రక్తపాతానికి సంబంధించిన కలర్‌ను మార్చాలని చెప్పారు. ఈ సినిమా గురించి పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న తర్వాత సినిమా యూనిట్ ట్వీట్ చేస్తూ.. గన్ లోడ్ చేసి ఎక్కుపెట్టాం. అన్ని తుపాకులు యూఏ సర్టిఫికేట్‌తో సిద్దమయ్యాయి అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 42 నిమిషాలు అంటే.. 162 నిమిషాలు. కానీ ఎక్కడా ల్యాగ్ అనిపించకుండా సన్నివేశాలు చకచకా సాగిపోతాయి అని చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ న్యూస్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X