Kingdom Twitter Review: కింగ్టమ్ మూవీ ట్విట్టర్ రివ్యూ
యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్డమ్. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్, జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కింగ్డమ్ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు కూడా పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా జరిగింది. గురువారం సాయంత్రం వరకు ఈ చిత్రానికి సంబంధించి 2 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ మూవీకి మంచి సందడి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీమియర్ల ప్రదర్శన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

కింగ్డమ్ మూవీలో సూరి పాత్రలో దేవరకొండ చాలా టెర్రిఫిక్‌గా ఉన్నారు. టోటల్‌గా స్క్రీన్ ప్రజెన్స్‌తో అదరగొట్టారు. అనిరుధ్ మ్యూజిక్ వేరే లెవ్. ఈ సినిమాకు మరో హిరోలా కనిపించారు. రగిలే రగిలే పాట సూపర్. మూవీ కంటెంట్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ లెవెల్‌లో ఉన్నాయి. ఈ సినిమా పైసా వసూలు మూవీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
వరల్డ్ ఆఫ్ కింగ్డమ్ నెక్ట్స్ లెవెల్. కేజీఎఫ్ రేంజ్‌లో ఉంది. విజయ్ దేవరకొండకు ఇలాంటి స్క్రిప్టు పడాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. అనిరుధ్ తన మ్యూజిక్‌తో డిఫరెంట్ లీగ్ క్రియేట్ చేశాడు. కింగ్డమ్ సినిమా అద్బుతంగా ఉంది. నాగవంశీకి మరో బ్లాక్ బస్టర్ అని నెటిజన్ కామెంట్ చేశాడు.
కింగ్డమ్ ఫస్టాఫ్ నైస్‌గా ఉంది. అనిరుధ్ మ్యూజిక్, బీజీఎంతో ఫైర్ క్రియేట్ చేశాడు. దేవరకొండ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
కింగ్డమ్ సినిమా గాంగ్‌స్టర్ డ్రామా. బ్రదర్స్ ఎమోషన్స్ బాగా డీల్ చేశారు. గౌతమ్ తిన్ననూరి మార్కు డ్రామా, ఎమోషన్స్ ఉన్నాయి. టెక్నికల్‌గా సౌండ్‌గా రూపొందించారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా ఊహించుకోకండి. కొన్నిసార్లు ఈ సినిమా నడిచే విధానం చాలా స్టోగా ఉంటుంది. ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సినిమా. ఇది కేజీఎఫ్ లాంటి సినిమా కాదు. జెర్సీ గౌతమ్ కింగ్డమ్ మాత్రమే అని ో నెటిజన్ కామెంట్ చేశాడు.
నిజాయితీగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెబుతున్నాను. ఇంతకు ముందు విజయ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. కానీ జైలు సెంటిమెంట్ సీన్లు చూసిన తర్వాత హృదయంలోకి ఇంత డీప్‌గా చొచ్చుకుపోయాడు. హ్యాట్సాఫ్. ఈ సింహాసనాన్ని దక్కించుకొనే అర్హత నీకే ఉంది. ఇక కింగ్డమ్ మీదే అని ో నెటిజన్ ఎమోషనల్‌గా ట్వీట్ చేశాడు.
కింగ్డమ్ సినిమా చూశాను. ఇంట్రో సీక్వెన్స్, బ్రదర్ సీక్వెన్స్ అదిరిపోయాయి. విజయ్, భాగ్యశ్రీ లవ్ సీన్లు, పాట బాగుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు కేక. ఈ సినిమాకు అనిరుధ్ బీజీఎం కేక. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఫస్టాఫ్ బ్లాక్ బస్టర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
అమెరికాలో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఈ సినిమాకు పాజిటివ్ రెస్సాన్స్ వస్తున్న తీరు చూస్తే హ్యాపీగా ఉంది. విజయ్ దేవరకొండ అన్నకు విజయం దక్కుతుందన్న ఆనందం మరింత పెరిగింది అని నెటిజన్లు కామెంట్ చేశారు.
కింగ్డమ్ మూవీ గురించి నిర్మాత నాగవంశీ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. కింగ్డమ్ కేవలం డ్రామా, యాక్షన్ మూవీ కాదు. ఎమోషన్స్ మీతో ఉండిపోయే చిత్రం. గౌతమ్ తిన్ననూరి సినిమాల్లో ఉండే ఎమోషన్స్ క్యారీ అయ్యాయి. ఈ సినిమాపై చూపిస్తున్న ప్రేమ చూస్తే ఆనందంగా ఉంది. బిగ్ స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకొందాం అని నాగవంశీ తన మార్కు రివ్యూను అందించారు.


Click it and Unblock the Notifications











