Kingdom Critic Review: కింగ్డమ్ మూవీ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్
తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్డమ్. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్, జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి పాపులర్ క్రిటిక్ వెల్లడించిన అభిప్రాయం వివరాల్లోకి వెళితే...
సూర్య అలియాస్ సూరి కానిస్టేబుల్. ఓ స్పెషల్ ఆపరేషన్‌పై అధికారులు ఆయనను శ్రీలంకకు పంపిస్తారు. శ్రీలంకలో మాఫియా డాన్ శివ (సత్య దేవ్)ను పట్టుకొనేందుకు వెళ్లిన సూరి.. ఏకంగా అక్కడి మాఫియాకు కింగ్‌గా మారుతాడు. తనకంటూ ఓ నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకొంటారు. పోలీస్ కానిస్టేబుల్ తన నిర్ణయాన్ని, విధులను మార్చుకొన్నాడు? తన సోదరుడు శివ మాఫియా డాన్ ఎందుకయ్యాడు? తాను కూడా మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకొన్నాడు అనేది ఈ సినిమా కథ.

అయితే ఈ సినిమా ఓవర్సీస్ సెన్సార్ సందర్భంగా ముఖ్యంగా దుబాయ్ సెన్సారింగ్ సమయంలో ఈ సినిమాను చూశాను అని క్రిటిక్‌గా తనకు తాను చెప్పుకొనే ఉమేర్ సంధూ సినిమా గురించి ట్వీట్ చేశాడు. ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వెల్లడిస్తూ పోస్టు పెట్టారు. ఆయన వెల్లడించిన రివ్యూ ప్రకారం ఈ సినిమా సూపర్ హిట్ అనే విషయం స్పష్టమైంది.
దుబాయ్ సెన్సార్ బోర్డుకు వేసిన ప్రివ్యూ తర్వాత నా కింగ్డమ్ గురించి నా ఫస్ట్ రివ్యూ. డిజాస్టర్ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ కమ్ బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్యూ గాడ్. కింగ్ డమ్ సినిమా వన్ మ్యాన్ షో. యాక్షన్ స్టంట్స్ టెర్రిఫిక్‌గా చేశారు. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ద్వారా అందర్నీ కట్టిపడేస్తాడు. విజయ్ దేవరకొండకు భారీ హిట్ దక్కడం ఖాయమనే విధంగా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక కింగ్డమ్ కథ, స్క్రీన్ ప్లే విషయానికి వస్తే.. కొత్తదనం ఏమీ లేదు. రెగ్యులర్ కథ, కథనాలే ఉంటాయి. కాకపోతే ఈ సినిమా ఓవరాల్‌గా డీసెంట్ మాస్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రానికి నా రేటింగ్.. 5 పాయింట్లకు గాను.. 3 పాయింట్లు ఇస్తున్నాను అని తన ట్వీట్‌లో వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమాకు మంచి పాజిటివ్ బజ్ ఉంది. ఈ క్రమంలో ఉమేర్ సంధూ పోస్టు ఫ్యాన్స్‌కు కిక్కించేలా ఉంది.
అయితే కొన్ని సినిమాల విషయంలో ఉమేర్ సంధూ ఇచ్చే రివ్యూల విషయంలో పొంతన ఉండదు. ఇటీవల కింగ్డమ్ సినిమా గురించి చెత్త రివ్యూ ఇచ్చాడు. కానీ ఆ సినిమా భారీ విజయం అందుకొన్నది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











