Kingston Movie Review: కింగ్స్టన్ తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, దివ్య భారతీ, చేతన్, ఆళగమ్ పెరుమాళ్, ఎలాంగో కుమారరవేళ్, సాబుమన్, అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేశ్ బాలచంద్రన్ తదితరులు
దర్శకత్వం: కమల్ ప్రకాశ్
నిర్మాతలు: జీవీ ప్రకాశ్, ఉమేశ్ కేఆర్ భన్సల్, మహేశ్వర్ రెడ్డి
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫి: గోకుల్ బినోయ్
ఎడిటర్: సాన్ లోకేష్
రిలీజ్ డేట్: 2025-03-07
డబ్బు కోసం ఏ పనైనా చేసేందుకు సిద్దమయ్యే కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) అత్యాశ పరుడు. అక్రమ వ్యాపారాలు చేసే థామస్ (సాబుమన్ అబ్దుసమద్) గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా పనిచేస్తుంటాడు. అయితే తన సొంతూరు తవత్తూర్ గ్రామానికి ఓ శాపం వల్ల చేపల వేటపై నిషేధం విధిస్తారు. అయితే ఓ విషయంలో థామస్‌ను ఎదురించిన కింగ్.. తన గ్రామానికి చెందిన కట్టుబాట్లను, నిషేధాన్ని ఉల్లంఘించి సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు.
కింగ్ సొంత గ్రామానికి ఎలాంటి శాపాన్ని ఎవరు పెట్టారు? శాపం తర్వాత ఎందుకు చేపల వేటను ఆపివేశారు? చేపల వేట ఆపేసిన తర్వాత గ్రామస్థుల జీవన పరిస్థితి ఏమిటి? తూతుకుడి నుంచి చేపల వేటకు వెళ్లే కింగ్ తన గ్రామానికి ఏం చేశాడు? తన బాస్ థామస్‌కు కింగ్ ఏ పరిస్థితుల్లో ఎదురు తిరిగాడు? తన ఊరి కట్టుబాటును ఎదురించి చేపల వేటకు వెళ్లిన కింగ్‌కు ఎదురైన పరిస్థితులు ఏమిటి? తన ప్రియురాలి (దివ్య భారతి)తో ప్రేమ వ్యవహారాన్ని ఎలా కొనసాగించాడు. తన గ్రామానికి పట్టిన శాపంపై ఉన్న గ్రామస్థుల మూడనమ్మకాన్ని కింగ్ ఎలా పొగొట్టాడు అనే ప్రశ్నలకు సమాధానమే కింగ్స్టన్ సినిమా కథ.

ఓ మరణం వల్ల ఓ గ్రామానికి ఎలాంటి కీడు జరిగింది? వారిలో ఓ మూఢ విశ్వాసాన్ని బలంగా నాటుకుపోయేలా కొందరు ఎలాంటి కుట్రలు పన్నారనే విషయంతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ తర్వాత మాస్ ఎలిమెంట్స్‌తో జీవీ ప్రకాశ్ కుమార్ ఎంట్రీతో కథలో కదలిక జోష్ పెరుగుతుంది. ఫస్టాఫ్‌లో లవ్, మాస్ ఎలిమెంట్స్‌తో సరదాగా సాగిపోతుంది. ఇక సెకండాఫ్‌లో కథలో వైవిధ్యం బాగా జొప్పించారు. హారర్, జాంబీ ఎలిమెంట్స్‌తో కొత్త ప్రయోగాన్ని చేశారు. కథాపరంగా కొత్తగా ఒకే.. ఇంకా బలమైన సన్నివేశాలు, ఎమోషన్స్ వర్క్ చేసి ఉంటే మరింత మంచి ఫలితాన్ని ఇచ్చి ఉండేదనిపిస్తుంది.
సముద్రంలో స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌తో చాలా సినిమాలే వచ్చాయి. కానీ కింగ్స్టన్ సినిమా కోసం దర్శకుడు కమల్ ప్రకాశ్ ఎంచుకొన్న బ్యాక్ డ్రాప్ కొత్తేమీ కాకున్నా.. ఆ బ్యాక్ డ్రాప్‌లో జొప్పించిన హారర్, జాంబీ ఎలిమెంట్స్ సాధారణప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఉన్నాయి. అలాగే దర్శకుడు కథలోకి తీసుకెళ్లడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకొన్నాడు. కానీ కథకు ఫౌండేషన్ వేసిన తీరు వల్ల ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచడానికి చేసిన ప్రయత్నం, అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. దర్శకుడు విజన్ బాగుంది. కానీ బలమైన సన్నివేశాలు, కథను మరింత ఇంటస్ట్రింగ్ చెప్పే ప్రయత్నంలో కొంత తడబాటుకు గురయ్యాడనిపిస్తుంది.
జీవీ ప్రకాశ్ ఈ సినిమాకు వన్ మ్యాన్ షో. హీరోగా మాస్ ఎలిమెంట్స్‌తో తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. లవ్, యాక్షన్, ఎమోషన్స్ సీన్లను బాగా పండించాడు. కథా భారాన్నంత తన భుజాలపై మోసి మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక ఆయనకు జంటగా ప్రియురాలి క్యారెక్టర్‌లో దివ్య భారతీ తన పాత్రలో ఒదిగిపోయింది. యాక్షన్ సీన్లలో ఆకట్టుకొన్నది. లవ్ సీన్లలో మంచి కెమిస్ట్రీని, గ్లామర్‌ను పండించింది. మిగితా పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. తక్కువ బడ్జెట్‌లో హై క్వాలిటీతో లార్జర్ ద్యాన్ లైఫ్ సినిమాను అందించే ప్రయత్నం బాగుంది. సముద్రంలో చిత్రీకరి్ంచిన సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా కనిపిస్తాయి. కొన్ని సీన్లు హాలీవుడ్ సినిమాల్లో మాదిరిగా ఉంటాయి. సినిమాటోగ్రాఫర్ గోకుల్ బినోయ్ వర్క్ ఫెంటాస్టిక్‌గ్‌గా ఉంది. జీవీ ప్రకాశ్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో అరిపించారు. ఎడిటింగ్ పరంగా ఇంకా వర్క్ ఉందనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల నిడివి ఎక్కువగా ఉండటం వల్ల కంటెంట్‌లో ఫీల్ మిస్ అయ్యిందనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు బలంగా మారాయి.
లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన హారర్, సస్పెన్స్, జాంబీ జోనర్ మూవీ. సీ బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన డిఫరెంట్ జోనర్ మూవీ అని చెప్పవచ్చు. ఈ సినిమా ఫస్టాఫ్ కథను ఎస్టాబ్లిష్ చేస్తే.. సెకండాఫ్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో జోష్ కలిగించేలా చేశారు. నటీనటులు పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్, తమిళ వాసన ఎక్కువగా ఉంటుంది. కాకపోతే తెలుగు డబ్బింగ్ బాగా ఉండటంతో అ లోపం పెద్దగా కనిపించదు. హారర్, జాంబీ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











