Kingston Twitter Review: ‌కింగ్‌స్టన్ తెలుగు మూవీ ట్విట్టర్ రివ్యూ

జీవీ ప్రకాష్ కుమార్ , దివ్యభారతి జంటగా నటించిన చిత్రం కింగ్‌స్టన్. కమల్ ప్రకాష్ దర్శకత్వంలో ప్యార్లల్ యూనివర్స్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై జీవీ ప్రకాష్ కుమార్ చ, భవానీ శ్రీ, ఉమేశ్ కుమార్ భన్సాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా మూడు అవతారాలెత్తారు జీవి ప్రకాష్ కుమార్. హార్రర్, సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 7 , 2025న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

దక్షిణాదిలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నారు జీవీ ప్రకాష్ కుమార్. మెలోడీ అయినా, మాస్ బీట్ అయినా అద్భుతంగా ట్యూన్ చేస్తూ సంగీత ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తున్నారు ప్రకాష్. సంగీత దర్శకుడిగా క్షణం తీరిక లేకుండా ఉంటూనే హీరోగానూ ఎంట్రీ ఇచ్చారు. కింగ్‌స్టన్ సినిమా ఆయన కెరీర్‌లో 25వ చిత్రం కావడం విశేషం. టీజర్ , ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో కింగ్‌స్టన్ సినిమాపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.

Kingston Movie Twitter Review in Telugu  GV Prakash Kumar nails with Action and emotions

కింగ్‌స్టన్ చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలో తొలి సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా నిలిచింది. అంటే సముద్రయానం, సముద్రాలపై సాహసం వంటి ఇతివృత్తంగా ఆధారంగా తెరకెక్కిన సినిమా అన్న మాట. ఈ సినిమాకి సంబంధించిన కీలక విషయాలను ప్రమోషన్స్ సమయంలోనే జీవీ ప్రకాష్ కుమార్ పంచుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు షిప్ మీద తడిగా ఉండి జారిపోయేదని.. ఒక్కోసారి ఒక్క షాట్ చేసిన తర్వాత గాయాల బారినపడిన సందర్భాలు కూడా ఉన్నాయట. కింగ్‌స్టన్ కోసం కెమెరామెన్ , సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడ్డారట. సినిమా చూసిన తర్వాత హాలీవుడ్ చిత్రం చూసిన ఫీలింగ్ కలుగుతుందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కింగ్‌స్టన్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఎలా మెప్పించింది చూస్తే..

కింగ్స్టన్ సినిమా ఫస్టాఫ్ బాగుంది. అడ్వెంచరస్‌గా ఉంది. సెకండాఫ్‌లో జరిగే డ్రామా కోసం ఫస్టాఫ్‌లో కథను సెట్ చేసిన విధానం బాగుంది. సెకండాఫ్‌లో స్టోరీలో మ్యాజిక్ చేసే ప్రయత్నం జరిగింది. సెకండాఫ్ సినిమాకు కీలకంగా మారింది. దర్శకుడు కమల్ ప్రకాశ్ కథ చెప్పిన విధానం బాగుంది. క్యారెక్టర్లను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకొనేలా ఉంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

కింగ్స్టన్ సినిమా నాగర్‌కోయిల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందించారు. తమిళ సినిమా రంగంలో అరుదైన అటెంప్ట్. చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. సముద్రం నేపథ్యంగా కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలతో కథను అల్లుకొన్న తీరు బాగుంది. కమల్ ప్రకాశ్ కథను చెప్పిన తీరు యూనిక్‌గా ఉంది. జీవీ ప్రకాశ్ సినిమాలో మ్యూజిక్, యాక్టర్‌గా, నిర్మాతగా డామినేట్ చేశాడు అని ఓ నెటిజన్ తన రివ్యూను ఇచ్చారు.

కింగ్స్టన్ మూవీ ఇప్పుడే చూశాను. ఈ సినిమాలో సముద్రంలో అక్రమ వ్యాపారం ఎలా చేశారనే విషయాన్ని చాలా ఆసక్తిగా చూపించారు. ప్రేక్షకులకు మంచి ట్రీట్‌గా వీఎఫ్ఎక్స్, బీజీఎం డిజైన్‌ను జీవీ ప్రకాశ్ డిజైన్ చేశారు. సెకండాఫ్‌లో ఓ అంశం కథను మలుపుతిప్పిన తీరు బాగుంది. తక్కువ బడ్జెట్‌లో సినిమాను ఓ రేంజ్‌లో తెరకెక్కించిన తీరు బాగుంది. నా రేటింగ్ 4/5 అని ఓ నెటిజన్ తెలిపాడు.

కింగ్స్టన్ సినిమా ఫస్టాఫ్ చాలా బాగుంది. రా ఎలిమెంట్స్‌తో టెర్రిఫిక్‌గా ఉంది. సముద్రంలో అక్రమ వ్యాపారం ఎలా జరుగుతుందనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఓ గ్రామంలో, సముద్రంలో జరిగే మిస్టీరియస్ థింగ్స్‌ను కథలో జొప్పించిన విధానం బాగుంది. కింగ్స్టన్‌గా జీవి ప్రకాశ్ తన పాత్రలో జీవించాడు. సాంగ్స్, బీజీఎం బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

కింగ్స్టన్ ఫస్టాఫ్ బాగుంది. సముద్రం బ్యాక్ డ్రాప్‌తో సన్నివేశాలను తెరకెక్కించిన విధానం బాగుంది. కథలో సస్పెన్స్‌ను మెయింటెన్ చేసిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. ఈ సినిమా స్కేల్ వైజ్‌గా చూస్తే.. జీవీ ప్రకాశ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిలిం. లీడ్ రోల్‌లో ఆయన నటన బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X