twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kinnerasani Movie Review: కళ్యాణ్ దేవ్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

    |

    2.5/5

    టైటిల్‌: కిన్నెరసాని
    రిలీజ్: జూన్‌ 10, 2022 (జీ5)
    నటీనటులు: కల్యాణ్‌ దేవ్‌, అన్‌ షీతల్‌, రవీంద్ర విజయ్‌, మహతి
    దర్శకుడు: రమణ తేజ
    రచయిత: సాయి తేజ దేశ రాజు
    నిర్మాతలు: రజనీ తాళ్లూరి, రవి చింతల
    సంగీతం: మహతి స్వర సాగర్‌
    సినిమాటోగ్రఫీ: దినేశ్‌ కె.బాబు

    విజేత సినిమాతో హీరోగా మారిన కళ్యాణ్ దేవ్ నటించిన తాజా చిత్రం కిన్నెరసాని జీ 5 ఓటీటీ వేదికగా విడుదలైంది. రవీంద్ర విజయ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆన్ శీతల్, కాశిష్ ఖాన్ కీలక పాత్రలలో నటించారు. నాగశౌర్య అశ్వద్ధామ సినిమాకు దర్శకత్వం వహించిన రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం నాడు ఓటీటీ వేదికగా విడుదలైంది. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది అనే విషయాన్ని ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం

    కథ:

    కథ:


    వెంకట్ (కళ్యాణ్ దేవ్) ఒక పెద్ద లాయర్ దగ్గర అప్రెంటిస్ గా పని చేస్తూ ఉంటాడు. స్వతహాగా తెలివికల కావడంతో అనేక కేసులను చిటికెలో సాల్వ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క వేద(ఆన్ శీతల్) ఒక లైబ్రరీ రన్ చేస్తూ ఉంటుంది. చిన్నప్పుడు దూరమైన తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని ఆయన కోసం వెతుకుతూ ఉంటుంది వేద. ఆమెకు ఒక పక్క వెంకట్ సహాయ పడుతూ ఉంటాడు. ఒక రోజు తండ్రి వద్దకు వెళ్లడం ఖాయమని అనుకుంటున్న సమయంలో ఆమెను చంపడం కోసం జయదేవ్( రవీంద్ర విజయ్) ఆమె ఉన్న ప్లేస్ కి వస్తాడు. చివరికి జయదేవ్ వేదను చంపాడా? అసలు జయదేవ్ సీరియల్ కిల్లర్ గా ఎందుకు మారాడు? వెంకట్ తన లవర్ చనిపోయినా, సరే మరి వేదను ప్రేమించేలా ఎందుకు చేశాడు అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

    సినిమాలో ట్విస్టులు

    సినిమాలో ట్విస్టులు


    సినిమా ప్రారంభంలోనే ఒక హత్యతో సినిమా ప్రారంభమవుతుంది. అత్యంత పాశవికంగా గొంతులో పొడిచి చంపిన ఒళ్ళు గగుర్పొడిచే సీన్ తో సినిమా ప్రారంభించారు. అలా సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త ట్విస్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ సినిమా మీద ఆసక్తి పెంచుతూ వెళ్లారు. కిన్నెరసాని అనేది ఒక థ్రిల్లర్ జోనర్ సినిమా కావడంతో సినిమా కథను నేరుగా చెబితే ప్రేక్షకులకు అంత కిక్ ఉండదని భావించారో ఏమో తెలియదు కానీ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయడానికి ప్రయత్నించారు మేకర్స్. ఒక యువతి హత్య తో మొదలైన ఈ సినిమాలో ఆ హత్యతోనే ఒక సస్పెన్స్ విషయం ఉంచేశారు, అసలు ఆమెను ఎవరు హత్య చేశారు? హత్యకు గురయ్యే ముందు ఆ అమ్మాయి కుక్కపిల్లతో ఎవరికి లవ్ లెటర్ పంపింది? అనే అంశాలు చివరివరకు రివీల్ చేయకుండా సస్పెన్స్‌లో ఉంచిన దర్శకుడు చివరికి మాత్రం ఏమాత్రం సప్సెన్స్ తగ్గకుండా రివీల్ చేశారు.

     దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే

    దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే


    దర్శకుడు రమణ తేజ తన మార్క్ మరోమారు నిరూపించుకున్నాడు అని చెప్పాల్సి. గతంలోనే అశ్వద్ధామ అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఈ సినిమాతో కూడా తన దర్శకత్వ ప్రతిభ నిరూపించుకున్నాడు. ఈ సినిమాకు ఆయన చాలా ఎఫర్ట్ పెట్టాడు అనిపించింది. ప్రతి 10-15 నిమిషాలకు ఓ థ్రిల్ ను ఇచ్చి ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసి చాలా మేరకు సఫలం అయ్యాడు కూడా.

     నటీనటుల పనితీరు :

    నటీనటుల పనితీరు :


    ఇక ఈ సినిమాలో నటీనటుల పనితీరు విషయానికి వస్తే కళ్యాణ్ దేవ్ మొదటి రెండు సినిమాలతో పోలిస్తే.. 'కిన్నెరసాని'లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇక నటనకు స్కోప్ ఉంది కానీ ఆయన ది బెస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. ఇక హీరోయిన్ అని చెప్పబడిన కాశీష్ ఖాన్ పాత్ర నిడివి చాలా తక్కువే అయినా ఉన్నంతలో గ్లామర్ తో ఆకట్టుకుంది. మళయాళ హీరోయిన్ అన్ షీతల్‌కు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. ఎమోషనల్ సీన్స్ లో ఆమె ఇంకా బాగా నటించే అవకాశం ఉందనే చెప్పాలి. అయితే విలన్ గా నటించిన రవీంద్ర విజయ్ అందరి కంటే ఎక్కువ మార్కులు సంపాదించాడు. జయదేవ్ అనే సైకో లాంటి పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యారు. భానుచందర్ లాంటి నటుడికి చిన్న పాత్రతో సరిపెట్టారు. ఇక మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించి న్యాయం చేశారు.

     సాంకేతిక నిపుణుల పనితీరు :

    సాంకేతిక నిపుణుల పనితీరు :


    సినిమాలో స్క్రీన్ ప్లేకి టెక్నీకల్ విషయంలో మంచి స్థానం దక్కుతుంది. కమర్షియాలిటీ కోసం అనవసర పాటలు, కామెడీ జోలికి వెళ్లకుండా కథనంపై నమ్మకంతో సినిమా రూపొందించిన దర్శక - రచయితలు, నిర్మాతలను అభినందించవచ్చు. ఇక సాయి తేజ దేశ రాజు అందించిన కథ కథనం మాటలు సరికొత్తగా ఉన్నాయి, కథనం ప్రేక్షకుడిని చివరిదాకా కట్టిపడేస్తుంది. ఉత్కంఠగా సాగిన కథనం సినిమాకి మేజర్ హైలైట్ , రైటర్ కి మంచి మార్కులు పడతాయి. ఇక సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ అందించిన పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ టేబుల్ మీద మరింత సమయం వెచ్చించాల్సింది.

    ఫైనల్ గా:

    ఫైనల్ గా:


    ఈ సినిమా నిడివి రెండు గంటలే అయినా స్లో స్క్రీన్ ప్లే కారణంగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. రొటీన్ స్టోరీ కావడంతో కొత్తదనం ఫీల్ అవ్వక పోయినా కాసేపటికి ఒకటి వచ్చే ట్విస్ట్ లు ఆసక్తి రేపుతాయి. మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే వాళ్ళకు 'కిన్నెరసాని' పర్ఫెక్ట్ ఛాయిస్.

    English summary
    Kinnerasani, featuring Kalyaan Dhev in the lead role, was supposed to be released in theatres but has been released directly on Zee 5 streaming platform. Here’s the review and rating.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X