twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరాకు (‘కిరాక్‌’ రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.5/5
    -----సూర్య ప్రకాష్ జోశ్యుల

    పవన్ కళ్యాణ్ డైలాగులు, ఆయన సినిమాల్లో విజువల్స్, పాటలు బిట్స్, ఆయన్ను అనుకరిస్తూ, భజన చేస్తే సినిమాలు ఆడతాయా... ఏమో...అదే భ్రాంతిలో చాలా మంది కొత్తగా పరిచయమవుతున్న యువ దర్శకులు కథని, మిగతావి వదిలేసి వాటిపైనే కాన్సర్టేట్ చేసి తమకు తోచినట్లు షార్ట్ ఫిలిం కన్నా దారుణంగా సినిమాలు తీసి, దర్శకులు అనిపించుకుంటున్నారు. అంతే తప్ప నమ్మి టిక్కెట్ కొని థియోటర్ కి వచ్చిన ప్రేక్షకులను...చిన్న సినిమా అంటే విరక్తి కలిగేలా చేస్తున్నారు. ఈ దర్శకుడుదీ అదే స్కూల్.

    పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన రాకేష్ (అనిరుధ్) ...మహేష్ వీరాభిమాని అయిన అమృత(చాందిని) తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తున్న సమయంలో వారి మధ్య ఓ కెమెరా ప్రవేశిస్తుంది. అనుకోకుండా వారి జీవితాల్లోకి వచ్చిన ఆ కెమెరా వల్ల...రకరకరాల విచిత్రమైన సంఘటనలు జరుగుతూంటాయి. దాన్ని వదిలించుకుందామని ప్రయత్నం చేసినా అది ఏదో రకంగా వీళ్ల దగ్గరకే చేరుతూంటుంది. ఇంతకీ ఆ కెమెరా కథేంటి... ఆ కెమెరా కి వీళ్లకి సంభంధం ఏంటి.. అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    సినిమాకు కథ అనుకున్నప్పుడు దాన్ని ఏ జానర్ లో చెప్తే ఆసక్తి కరంగా ఉంటుందనే విషయం దృష్టిలో పెట్టుకోపోతే చూసేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా క్షణక్షణనికి జానర్ మారిపోవటం... కథలో ఉన్న కాంప్లిక్ట్ ని హీరో ఫేస్ చేయకుండా కాలయాపన చేసుకుంటూ క్లైమాక్స్ వరకూ సాగతీస్తూ, ఆ గ్యాప్ లో రకరకాల సీన్స్ తో ఫిల్ చేసేయటం చేస్తే... , చూసే ప్రేక్షకుడు సినిమా పూర్తి కాగానే యర్రగడ్డ మెంటల్ హాస్పటిల్ కి దారేది అని వెతుక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఈ సినిమా కథది అదే పరిస్దితి.

    స్లైడ్ షో మిగతా రివ్యూ...

    పవన్ డూపు

    పవన్ డూపు

    యూ ట్యూబ్ లో పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు అనే సక్సెస్ ఫుల్ షార్ట్ ఫిలిం ద్వారా ఫేమ్ లోకి వచ్చిన అనిరుధ్...ఈ సినిమా అంతా పవన్ నే అనుకరిస్తూ... తను నిజంగానే పవన్ కి వీరాభిమాని అని నిరూపించుకున్నాడు. అయితే ఈ ప్రాసెస్ లో సినిమాలో సీన్స్ కు తగ్గ ఎమోషన్స్ ని మిస్ చేసేసాడు.

    పాపకు పెద్ద స్కోప్ లేదు

    పాపకు పెద్ద స్కోప్ లేదు

    మహేష్ అభిమానిగా కథ ప్రకారం పరిచయం అయిన హీరోయిన్ తర్వాత ఎక్కడా ఆ ఊసే లేకుండా హీరోను అదే పనిగా లెంపకాయలు కొట్టుకుంటూ, అతను సారి చెప్పగానే ముద్దులు పెట్టగానే ఓ పాట వేసుకుంటూ తిరుగుతూంటుంది. కాబట్టి ఇక్కడ అభినయాలు కి నటనకు పెద్దగా స్కోప్ లేదు కాబట్టి...పెద్దగా ఈ అమ్మాయి గురించి పెద్దగా మాట్లాడుకునేది ఏమీ లేదు.

    వెన్నెల కిషోర్, పోసాని

    వెన్నెల కిషోర్, పోసాని

    సినిమా ఫస్టాఫ్ లో వచ్చే వెన్నెల కిషోర్ పాత్ర బాగానే నవ్వించింది. సెకండాఫ్ లో వచ్చే వెన్నెల కిషోర్ పాత్ర మాత్రం దారుణంగా ఫెయిలైంది. కొంచెం కూడా నవ్వించలేకపోయింది.

    ఛాయాగ్రహణం

    ఛాయాగ్రహణం



    పైనే చెప్పుకున్నట్లు ఈ సినిమా కెమెరా వర్క్ ఫ్రేమింగ్,షాట్ కంపోజింగ్ బాగుంది. అయితే డీఐ సరిగ్గా చేయకపోవటంతో బ్యాక్ గ్రౌండ్ బర్నింగ్ లు వచ్చి ... చాలా చోట్ల ఇంప్రెస్ చేయలేకపోయింది .

    టెక్నికల్

    టెక్నికల్


    ఎడిటింగ్ ని సరిగ్గా దర్శకుడు చేయించుకోలేకపోయాడో లేక ఎడిటర్ ...పెద్దగా ఈ సీరియస్ గా తీసుకోలేదో అని కొన్ని సీన్స్ ని చూస్తే డౌట్ వస్తుంది. వెన్నెల కిషోర్ ప్రీజ్ చేసి వాయిస్ ఓవర్ చెప్పేటప్పే షాట్ వేసేటప్పుడు ... బ్లర్ ఉన్న ఇమేజ్ ని ఫ్రీజ్ చేసారంటేనే అర్దం చేసుకోవాలి.

    ఎవరెవరు

    ఎవరెవరు

    చిత్రం: కిరాక్
    బ్యానర్ : హిట్‌ టాక్‌ పిక్చర్స్‌ సంస్థ
    నటీనటులు: అనిరుద్ధ్‌, చాందిని , పడమటలంక నవీన్, అశోక్ వర్దన్, కాశీవిశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్‌ తదితరులు
    మాటలు: డాక్టర్‌ ఆర్‌.,
    ఫొటోగ్రఫీ: బి.దుర్గాకిశోర్‌,
    సంగీతం: అజయ్‌ అరసాద,
    ఎడిటింగ్‌: నందమూరి హరి,
    నిర్మాతలు: డి.గోపీకృష్ణ, గంగపట్నం శ్రీధర్‌.
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హారిక్‌ దేవభక్తుని
    విడుదల తేదీ:05,సెప్టెంబర్ 2014.

    ఏదైమైనా ఇలాంటి సినిమాల వల్ల చిన్న సినిమా అంటేనే భయపడే పరిస్ధితి ఏర్పడుతోంది. శాటిలైట్ మార్కెట్ కూడా లేని ఇటువంటి పరిస్దితుల్లో ఇలాంటి సినిమాను ఏ ధైర్యంతో చుట్టేస్తున్నారో అని సందేహం వస్తుంది.

    English summary
    Kiraak is an tollywood romantic comedy movie which is directed by Harik and produced by Gangapatnam Sridhar released today with divide talk. This film stars Anirudh and Chandini in the lead roles. The actor Anirudh earned good fame for his acting skills,who acted in many short films imitating Pawan Kalyan. Music of the movie is composed by Ajay Arasada.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X