twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sammathame Review.. కిరణ్ అబ్బవరం సక్సెస్ అందుకొన్నాడా?

    |

    Rating: 2.5/5

    నటీనటులు: కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరీ, సద్దాం హుస్సేన్ తదితరులు
    దర్శకత్వం: గోపినాథ్ రెడ్డి
    నిర్మాత: కనకలా ప్రవీణ
    మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ చంద్ర
    సినిమాటోగ్రఫి: సతీష్ రెడ్డి మాసం
    ఎడిటర్: విప్లవ్ నైషాధ్యం
    రిలీజ్ డేట్: 2022-06-24

    సమ్మతమే కథ..

    సమ్మతమే కథ..


    హైదరాబాద్‌లో కృష్ణ అనే యువకుడు (కిరణ్ అబ్బవరం) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తల్లి బాల్యంలోనే చనిపోవడంతో తండ్రి అడుగు జాడల్లో పెరుగుతాడు. అయితే తన తల్లిలా సంప్రదాయంగా ఉండే యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకొంటాడు. ఓ ఫంక్షన్‌లో శాన్వీ (చాందిని చౌదరీ)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు.

     సమ్మతమే మూవీలో ట్విస్టులు

    సమ్మతమే మూవీలో ట్విస్టులు


    కృష్ణ కోరుకొన్న లక్షణాలు శాన్విలో ఉన్నాయా? శాన్వీ కోసం కృష్ణ మారాడా? లేక కృష్ణ కోసం శాన్వి మారిందా? ఇద్దరి ప్రేమలో ఏమైనా విభేదాలు నెలకొన్నాయా? చివరకు వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు చేరిందా అనే ప్రధానమైన ప్రశ్నలకు సమాధానమే సమ్మతమే సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?


    సమ్మతమే సినిమా కథ విషయానికి వస్తే.. తాను ఇష్టపడిన అమ్మాయిలో కోరుకొన్న లక్షణాలు లేకపోవడం వల్ల కలిగే కాన్‌ఫ్లిక్ట్ ఆధారంగా తొలి భాగం నడుస్తుంది. అయితే చిన్న పాయింట్‌ను సాగదీయడం వల్ల ప్రేక్షకులకు ఇదంతా అవసరమా అనే ప్రశ్న సినిమా చూసినంత సేపు వెంటాడుతుంది. అయితే ఫన్, లవ్, రొమాంటిక్ అంశాలతో సినిమా తొలి భాగం పర్వాలేదనిపిస్తుంది.

     సెకండాఫ్ ఎనాలిసిస్

    సెకండాఫ్ ఎనాలిసిస్


    సెకండాఫ్‌లోనైనా కథలో వేగం, కొత్తదనం కనిపిస్తుందనే వారికి నిరాశే మిగులుతుంది. కొన్నిసార్లు కథ, కథనంలో కొత్తదనం లేకపోవడం వల్ల బోరింగ్ అనిపిస్తుంది. ఈ కథలో సమస్య బలంగా లేకపోవడం ప్రధానమైన లోపంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో లోపాలను సరిద్దిద్దుకొని ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఎమోషన్స్ పండకపోవడమే అనే ఈ సినిమా ఫీల్‌గుడ్‌ మారకపోవడానికి ప్రధాన కారణం అనిపిస్తుంది.

    దర్శకుడి పనితీరు..

    దర్శకుడి పనితీరు..


    దర్శకుడు గోపినాథ్ రెడ్డి రాసుకొన్న కథ బాగుంది. కానీ ఎమోషనల్ లవ్ స్టోరిగా మలిచి ఉంటే.. మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి సినిమా అయి ఉండేది. ప్రస్తుతం జనరేషన్‌లో జీవితంపై భారీగా ఆశలు, అంచనాలు ఉండే యువతీ, యువకులను దృష్టిలో పెట్టుకొని కథను రాసుకొన్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే.. గోపినాథ్ మంచి సక్సెస్ అందుకొనే పరిస్థితి ఉండేది.

    కిరణ్ అబ్బవరం ఎలా చేశాడంటే?

    కిరణ్ అబ్బవరం ఎలా చేశాడంటే?


    కిరణ్ అబ్బవరం ఎప్పటి మాదిరిగానే.. సినిమా ఎలా ఉన్నా.. తన భుజాలపైనే మోసినట్టు సమ్మతమే సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. యాక్టర్‌గా మెచ్యురిటీ కనిపిస్తుంది. కృష్ణ పాత్రలో కిరణ్ ఒదిగిపోయాడు. ఎమోషన్స్‌‌తోపాటు తనదైన మార్కు వినోదాన్ని పండించే ప్రయత్నం చేశాడు.

    టెక్నికల్ అంశాలు..

    టెక్నికల్ అంశాలు..


    సమ్మతమే చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర సంగీతం బలంగా మారిందని చెప్పవచ్చు. పాటలు చాలా బాగున్నాయి. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫి బాగుంది. విప్లవ్ నైషధ్యం ఎడిటింగ్ బాగుంది. కనకలా ప్రవీణ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?


    నేటితరం యువతీ యువకుల ప్రేమలు, పెళ్లిళ్లు, అభిప్రాయబేధాలు అనే అంశాలను కలబోసి చేసిన చిత్రం సమ్మతమే. కాకపోతే ఎమోషన్స్ పూర్తిస్థాయిలో పండకపోవడం, కథ, కథనాలు ఆకట్టుకోనే విధంగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్‌కు ఈ సినిమా నచ్చుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే అంశాలు ఉన్నాయి.

    English summary
    Young hero Kiran Abbavaram's Sammathame released on June 24th. Here is the Filmibeat Telugu exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X