Kishkindhapuri Critic Review: కిష్కింధపురి మూవీ క్రిటిక్ రివ్యూ

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన చిత్రం కిష్కిందపురి. చావు కబురు చల్లగా చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో యువ హీరో, హీరోయిన్లు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. పీరియాడిక్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్‌‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది.

ఈ సినిమాకు దరహాస్ పాలకొల్లు, కే బాల గణేష్ స్క్రీన్ ప్లే అందించగా, క్రియేటివ్ విభాగంలో జీ కనిష్క, చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫి, నిరంజన్ దేవరమనే ఎడిటర్‌గా, మనీషా దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఇటీవల పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబైంది. అయితే ఈ మూవీకి బజ్ భారీగా క్రియేట్ అవ్వడంతో ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ ప్రీమియర్లను ప్రదర్శించారు. ప్రీమియర్ల తర్వాత వెల్లడైన టాక్ వివరాల్లోకి వెళితే..

Kishkindhapuri Critic Review

తెలుగులో ఓ మంచి హారర్ థ్రిల్లర్ రాక చాలా రోజులైంది. అలాంటి గ్యాప్‌ను కిష్కింధపురి పూరిస్తుంది. ఈ సినిమాను కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేశారు. అందుకు టీమ్ యూనిట్‌కు నా ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన తర్వాత ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా సౌండ్ డిజైన్ చేసిన తీరుకు సర్‌ప్రైజ్ కావాల్సిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాను పూర్తిగా తన భుజాలపై మోశాడు. రాక్షసుడు సినిమా తర్వాత అతడికి బెస్ట్ సినిమాగా మారబోతుంది. అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ బాగుంది. హాస్పిటల్ సీన్‌లో బాగా చేశారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.


కిష్కింధపురి సినిమాను చూశాను. బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టరైజేషన్ బాగుంది. ఈ చిత్రంలో నటించిన వారంతా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. కొన్ని ట్విస్టులు, సీన్లు భయపెట్టే విధంగా ఉంటాయి. హారర్ ఎలిమెంట్స్ ఎలివేట్ చేసే విధంగా సెట్స్, సినిమాటోగ్రాఫి, ప్రొడక్షన్ వాల్యూస్ హైలెట్. ఈ సినిమాకు పాటలు మైనస్, ఎమోషనల్ సీన్లు పూర్తి స్థాయిలో పండకపోవడం మరో మైనస్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో వచ్చిన హారర్ చిత్రాల్లో కిష్కింధపురి ఒకటి. హీరో బెల్లంకొండ సాయి వన్ మ్యాన్ షో మాదిరిగా యాక్టింగ్ చేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. చివరి 30 నిమిషాలు బీజీఎం మాస్ కొట్టుడే. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ పొందాలంటే ఈ సినిమాను చూడండి. బెల్లంకొండకు హిట్ట పడినట్టే అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

కిష్కింధపురి సినిమాను చూశాను. ఫస్ట్ పది నిమిషాలు అదోలా గడిచిపోతుంది. ఆ తర్వాత దర్శకుడు అసలు కథలోకి వెళ్లాడు. ఓ మహల్ అందులో ఓ దెయ్యం. దాని వెనుక కనిపెట్టే హీరో. హరర్ కథను విధానం బాగుంది. టెక్నికల్‌గా, విజువల్‌గా చాలా బాగుంది. సౌండిగ్ సూపర్బ్. అనుపమ, బెల్లంకొండ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

కిష్కింధపురి సినిమా చాలా బాగుంది. టెక్నికల్‌గా అదిరిపోయింది. సలార్, యానిమల్, కంతారాకు వర్క్ చేసిన సౌండ్ డిజైనర్ అందించిన సౌండ్ బ్రిల్లియెంట్‌గా ఉంది. ఈ సినిమాకు సౌండ్ డిజైన్ ప్లస్ పాయింట్. ఈ సినిమా న్యూ జెన్ హారర్ మిస్టరీ. టెక్నికల్ అంశాలు ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి అని బెల్లంకొండ చెప్పిన విషయాలను క్రిటిక్ రమేష్ బాలా
ధృవీకరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X