Kishkindhapuri Movie Review: కిష్కింధపురి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: బెల్లకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్, శాండీ మాస్టర్, మర్కంద్ దేశ్‌పాండే, హినా భాటియా తదితరులు
దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి
నిర్మాత: సాహు గారపాటి
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫి: చిన్మయ్ సలాస్కర్
ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే
బ్యానర్: షైన్ స్క్రీన్
రిలీజ్ డేట్: 2025-09-12
కిష్కింధపురి గ్రామానికి చెందిన రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) సహజీవనం చేస్తుండే ప్రేమికులు. ఘోస్ట్ వాకింగ్ టూర్ పేరుతో టూరిస్టులను పాడుబడిన భవనాలకు తీసుకెళ్లి దెయ్యాల గురించి చెప్పే గైడ్స్‌గా పనిచేస్తుంటారు. ఎప్పుడూ కట్టు కథలు చెప్పి టూరిస్టులను మభ్యపెట్టే వారు ఓ సారి సువర్ణమాయ అనే పురాతన, పాడుబడిన రేడియో స్టేషన్‌లోకి పర్యాటకులను తీసుకెళ్తారు. అయితే ఆ భవనంలో వారికి నిజంగానే దెయ్యం తారసపడి విధ్వంసం సృష్టిస్తుంది. రేడియోలో తాను చంపబోయే వ్యక్తి పేర్లు చెప్పి భయభాంత్రులకు గురి చేస్తుంది.

ఘోస్ట్ టూరిస్ట్ కంపెనీని నడిపే రాఘవ్, మైథిలి ఎలాంటి కట్టు కథలు చెప్పారు? సువర్ణమాయ రేడియో స్టేషన్ కథ ఏమిటి? 35 ఏళ్ల క్రితం రేడియో స్టేషన్ ఎందుకు మూతపడింది? సువర్ణమాయలోకి వెళ్లిన తర్వాత రాఘవ్, మైథిలి టీమ్‌కు ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది? తాము పర్యాటకులుగా తీసుకెళ్లిన వారిని చంపడానికి ప్రయత్నించిన వారిని రాఘవ్ అండ్ టీమ్ కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయా? సువర్ణమాయ భవనంలో దెయ్యంగా మారిన మహిళ కథ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే కిష్కింధపురి సినిమా కథ.
చావు కబురు చల్లగా సినిమాతో దర్శకుడిగా మారిన కౌశిక్.. తన రెండో సినిమాకు ఎంచుకొన్న కథా వస్తువు బాగుంది. కానీ ఆ కథను పూర్తిస్థాయిలో ప్రేక్షకుడిని గొప్ప అనుభూతికి పంచే ప్రయత్నంలో కొంత మేరకు విఫలమయ్యాడు. దెయ్యం కొంప హారర్ ఎలిమెంట్స్‌తో సినిమాను ఇంట్రెస్ట్‌గా మొదలుపెట్టినప్పటికి దానిని చివరి వరకు కొనసాగించలేకపోవడం ఈ మూవీకి ప్రధాన లోపం. అయితే కౌశిక్ రాసుకొన్న కొన్ని సీన్లు మాత్రం టాప్ రేంజ్‌లో ఉన్నాయి. ఘోస్ట్ స్టోరీల్లో సీన్, సీన్‌కు భయపెడుతూ.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెంచుకొంటూ పోతేనే ఆడియెన్స్‌లో ఓ రకమైన ఎక్స్‌పీరియెన్స్‌ను పొందుతాడు. ఈ విషయంలో కొన్నిసార్లు సక్సెస్.. మరికొన్ని సార్లు ఆకట్టుకోలేకపోవడంతో కిష్కింధపురి సాధారణ హారర్, సస్పెన్స్‌గా మారిపోయింది అనే ఫీలింగ్ కలుగుతుంది.
కిష్కింధపురి సినిమా పాజిటివ్ అంశాల విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో రాసుకొన్న హారర్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు హైలెట్ అనిపిస్తాయి. సినిమాటోగ్రఫి, లైటింగ్, కలర్ ప్యాటర్న్ సినిమాను చాలా క్లాసీగా, క్వాలిటీగా మార్చిందని చెప్పవచ్చు. దాదాపు సినిమాలోని సన్నివేశాలను మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక ఈ సినిమా కథ, కథనాలు మైనస్‌గా చెప్పుకోవచ్చు. స్టోరీలోని ఎమోషనల్ పాయింట్లకు కనెక్టివిటీ మిస్ అయింది. హైపర్ ఆది, సుదర్శన్ ఉన్నప్పటికీ వారి నుంచి పూర్తిస్థాయి కామెడీని రాబట్టుకోలేకపోవడం మైనస్. భావోద్వేగాలు పూర్తి స్థాయిలో పండలేదనే ఫీలింగ్ కలుగుతుంది. లాజిక్స్ పరంగా, స్క్రిప్టు పరంగా చాలా లోపాలు ఉన్నాయి.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. తన క్యారెక్టర్ ఎంత కావాలో అంతకంటే ఎక్కువగానే ఫెర్ఫార్మ్ చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో డిఫరెంట్ సాయిని చూస్తారు. ఇక అనుపమ క్యారెక్టర్ ఫస్టాఫ్‌లో సపోర్టింగ్‌గానే కనిపిస్తారు. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ సన్నివేశాల్లో తన యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. విశ్రవ పుత్రగా ఓ స్పెషల్ క్యారెక్టర్ శాండి మాస్టర్ విభిన్నమైన నటనతో ఆకట్టుకొన్నాడు.
ఫైనల్‌గా కిష్కింధపురి సినిమా గురించి చెప్పాలంటే.. హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ సినిమాలకు గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్‌గా కథ చెప్పడం.. థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేస్తే కానీ.. సినిమాకు ఆదరణ ఉంటుంది. అయితే ఈ సినిమా సరిగా ఉడికి.. ఉడకని వంటకంలా కనిపిస్తుంది. కొన్ని సీన్లు అద్బుతంగా ఉంటే.. మరికొన్ని సీన్లు పేలవంగా ఉంటాయి. సెకండాఫ్‌లో ఎమోషన్స్ మిస్ కావడం.. కథలో బలం లేకపోవడం తేలిపోయిందనిపిస్తుంది. అంచనాలు లేకుండా వెళితే.. ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. ఘోస్ట్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది. ఈ వారం ఓ సారి ట్రై చేయండి.


Click it and Unblock the Notifications











