Kisi Ka Bhai Kisi Ki Jaan Review రొటీన్ ఫార్మూలాతో మెప్పించని సల్మాన్ ఖాన్.. హిట్టా? ఫట్టా?

Rating: 1.5/5

నటీనటులు: సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, వెంకటేష్, జగపతి బాబు, విజేందర్ సింగ్, భూమికా చావ్లా, రోహిణి హట్టంగడి, అభిమన్యు సింగ్, షెహనాజ్ గిల్, పలక్ తివారీ తదితరులు
దర్శకత్వం: ఫహద్ సమ్జీ
నిర్మాత: సల్మాన్ ఖాన్
సినిమాటోగ్రఫి: వీ మణికందన్
మ్యూజిక్: రవి బస్రూర్
ఎడిటింగ్: మయురేష్ సావంత్
బ్యానర్: సల్మాన్ ఖాన్ ఫిలింస్
రిలీజ్ డేట్: 2023-04-21

భాయ్‌జాన్ (సల్మాన్ ఖాన్) తన తమ్ముళ్లు మోహ్ (జాస్సీ గిల్), లవ్ (సిద్దార్థ్ నిగమ్), ఇష్క్ (రాఘవ్ జుయల్)తో జీవిస్తుంటాడు. భాయ్ జాన్‌కు పెళ్లి, అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. దాంతో బ్రహ్మచారిగా కాలం గడుపుతుంటాడు. ఈ అన్నదమ్ములు అన్యాయం జరిగితే ఎంతటి హింసకైనా వెనుకాడరు. అయితే తన తమ్ముళ్లకు మాత్రం గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. తన అన్నకు పెళ్లి కాకుండా తాము వివాహం చేసుకోవడమేలా అని ఆలోచిస్తున్న సమయంలో తమ కాలనీలోకి కొత్తగా భాగ్యలక్ష్మీ (పూజా హెగ్డే) అద్దెకు దిగుతుంది. అయితే పెళ్లి అంటే ఇష్టం లేని భాయ్‌జాన్‌లో ప్రేమ చిగురించేలా చేస్తుంది. ఈ క్రమంలో భాగ్యలక్ష్మీపై ఎటాక్ జరుగుతుంది.

భాయ్ జాన్‌కు పెళ్లి అంటే ఎందుకు ఇష్టం లేదు? బాయ్ జాన్‌కు భాగ్యలక్ష్మీ ఎలా చేరువైంది. భాగ్యలక్ష్మీ అన్నయ్య బాలకృష్ణ (వెంకటేష్)పై నాగేశ్వర (జగపతి బాబు) ఎందుకు విద్వేషం పెంచుకొన్నారు? బాయ్‌జాన్‌పై ఎమ్మెల్యే (బాక్సర్ విజేందర్ సింగ్) ఎందుకు పగ పెంచుకొన్నాడు? ఎందుకు భాగ్యలక్ష్మీ కుటుంబంపై ఎటాక్ జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే కిసి కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా కథ.

Kisi Ka Bhai Kisi Ki

ఇక కిసి కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా విషయానికి వస్తే.. తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన వీరమ్, తెలుగులో మంచి సక్సెస్ సాధించిన కాటమరాయుడు సినిమాకు రీమేక్‌గా రూపొందింది. సౌత్ నేటివిటీ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఉత్తరాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొనే అంశాలు ఎక్కువ లేకపోవడంతో తేలిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఎమోషనల్‌ అంశాలు పెద్దగా క్లిక్ కాకపోవడంతో చాలా రొటీన్, రెగ్యులర్ సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది.

కిసి కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో మైనే ప్యార్ కియా హీరోయిన్ భాగ్యశ్రీ, ఆమె భర్త హిమాలయ్, కుమారుడు అభిమన్యుకు సంబంధించిన ఎపిసోడ్ ఆకట్టుకొనేలా ఉంటుంది. కొన్ని ఫైట్స్ సల్మాన్ ఖాన్ స్టయిల్‌కు తగినట్టుగా ఉన్నాయి. ఇక రాంచరణ్, వెంకటేష్, సల్మాన్, పూజా హెగ్డేపై చిత్రీకరించిన పాట కొంత జోష్‌తో సాగుతాయి. కొన్ని పాటల్లో సల్మాన్ స్టెప్పులు మంచి కామెడీని పంచాయి. నార్ ప్రేక్షకులకు ఈ సినిమా కథ పక్కా రొటీన్ మాత్రమే కాకుండా అవుట్ డేటేడ్ మాదిరిగా ఉంటుంది.

 Kisi Ka Bhai Kisi Ki Jaan Review

సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో హ్యుమర్, యాక్షన్, లవ్ సన్నివేశాల్లో కనిపించాడు. పూజా హెగ్డేతో పెద్దగా కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు. వెంకటేష్ పాత్ర తనదైన శైలిలో సహజసిద్దంగా కామెడీని పండించాడు. హింసకు తావులేని.. శాంతి కాముకుడి పాత్రలో వెంకీ కొంత వినోదాన్నిపంచే ప్రయత్నం చేశారు. పూజా హెగ్డే అటు గ్లామర్ పరంగాను, ఇటు ఫెర్ఫార్మెన్స్ పరంగాను ఆకట్టుకోలేకపోయింది. రోహిణి హట్టంగడి, భూమికా చావ్లా, విజేందర్ సింగ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

సాంకేతిక విభాగాల విషయంలోకి వెళితే.. వీ మణికందన్ సినిమాటోగ్రఫి బాగుంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ బీజీఎం బాగుంది. ఈ సినిమాలో పాటలను రవి బస్రూర్, హిమేష్ రేష్మియా, సాజిద్ ఖాన్, సుఖ్‌బీర్, దేవీ శ్రీ ప్రసాద్, అమల్ మాలిక్ అందించారు. అయితే ఈ పాటలు అంతగా ప్రాచుర్యం పొందలేకపోయాయి. మయురేష్ సావంత్ ఎడిటింగ్ ఒకే అనిపించారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.

రెగ్యులర్ కథ, రొటీన్ స్క్రీన్ ప్లే, మూవీలో బలమైన భావోద్వేగమైన అంశాలు లేకపోవడం కిసి కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాకు మైనస్. పేలవమైన కథ కారణంగా సల్మాన్ ఖాన్ స్టార్ డమ్ కూడా ఈ సినిమాను కాపాడటం కష్టంగా మారింది. ఫహద్ సమ్జీ డైరెక్షన్, మేకింగ్ కూడా యావరేజ్‌గా ఉంది. ఈ సినిమాను థియేటర్‌లో చూసే కంటే.. ఓటీటీలోకి వచ్చే వరకు వేచి ఉండటమే ఉత్తమం అనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X