Kodama Simham Re Release Review: కొదమ సింహం రీ రిలీజ్ రివ్యూ

మెగాస్టార్ చిరంజీవి కౌబాయ్ పాత్రలో నటించిన చిత్రం కొదమసింహం. రమా ఫిలింస్ బ్యానర్‌పై కైకాల నాగేశ్వరరావు నిర్మాతగా కే మురళీ మోహన్ రావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించింది. అందాల భామలు రాధ, సోనమ్, వాణి విశ్వనాథ్, బాలీవుడ్ నటుడు ప్రాణ్ చోప్రా, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, టైగర్ ప్రభాకరన్, సుధాకర్, ప్రఖ్యాత హాస్య నటుడు అల్లు రామలింగయ్య, బ్రహ్మనందం, గొల్లపూడి మారుతీరావు, చలపతిరావు, వైవిజయ ప్రధాన పాత్రల్లో నటించారు.

సాంకేతిక విభాగాల నిపుణుల విషయానికి వస్తే.. కేఎస్ హరి సినిమాటోగ్రఫి, నాగేశ్వరరావు, సత్యనారాయణ ఎడిటింగ్ బాధ్యతలు, రాజ్ కోటి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పంపిణీ చేసింది. 1990 ఆగస్టు 9వ తేదీన రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమాను మరోసారి 4K, డాల్బీ టెక్నాలజీతో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించిన కథ, కథనాలు, ఇతర విశేషాల వివరాల్లోకి వెళితే..

Kodama Simham Re Release Review  Chiranjeevi as Indian Cowboy like Robinhood role

ఇండియాలో బ్రిటీష్ పాలన కొనసాగుతున్న కాలంలో ప్రజల నుంచి బలవంతపు వసూళ్లు, లూటీలు జరుపుతూ అరాచకాలు సృష్టిస్తుంటారు. వాటిని సమర్ధవంతంగా భరత్ (చిరంజీవి) ఎదురిస్తుంటారు. తన ప్రాంతంలో జరిగే లూటీలు, దొమ్మీలు, హత్యలు, దాడుల నుంచి ప్రజలు కాపాడుతూ మంచి మనసున్న ధీరుడిగా గుర్తింపు పొందుతాడు. ఆ ప్రాంతంలో మేయర్ (ప్రాణ్) నేతృత్వంలో జరిగే గ్యాంబ్లింగ్, వేశ్యవృత్తిని అడ్డుకొంటాడు. ఆ క్రమంలో భరత్ తల్లిదండ్రులను దుండగులు చంపుతారు. ఆ సమయంలో తాము నిజమైన తల్లిదండ్రులం కాదు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వేరే ఉన్నారని చెప్పి చనిపోతారు.

తన ప్రాంతంలో అరాచకాలను ఎదురిస్తూనే తన తల్లిదండ్రుల జాడ కోసం వెతుకుతుంటారు. తల్లిదండ్రులు (గొల్లపూడి మారుతీ రావు) ఎవరు? అతడు ఎందుకు కనిపించకుండా పోయారు? తన తండ్రి సంరక్షణలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని ఎవరు దొంగిలించారు? ఆ వజ్రాన్ని భరత్ చేజిక్కించుకొన్నారా? ఈ కథలో సుడిగాలి (మోహన్ బాబు) ఎవరు? బిజ్లీతో భరత్ ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? మేయర్‌కు ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే కొదమసింహం సినిమా కథ.

కొదమ సింహంలో తెలుగులో రూపొందిన అడ్వెంచరస్ కౌబాయ్ చిత్రంలో ఒకటి. చిరంజీవి రాబిన్ హుడ్ తరహా ఇండియన్ కౌబాయ్‌గా నటించాడు. ఈ సినిమాలో కౌబాయ్ పాత్రలో హాలీవుడ్ నటుడికి ఏమాత్రం తీసిపోని విధంగా నటించడమే కాకుండా.. పాటలు, స్టెప్పులు, ఫైట్స్‌తో అదరగొట్టారు. జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా రిలీజ్ తర్వాత రావడంతో అంచనాలను భారీగా ఉండటం, వాటిని అందుకోలేదనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమైంది. చిరంజీవి కెరీర్‌లో ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ చిత్రంలో చిరంజీవి ప్రియురాలిగా రాధ, ప్రత్యేక పాత్రల్లో బాలీవుడ్ నటి సోనమ్, వాణి విశ్వనాథ్ నటించారు. సుడిగాలి పాత్రలో మోహన్ బాబు పోషించిన క్యారెక్టర్ ఈ సినిమాకే హైలెట్. హాస్యంతోపాటు మంచి అభినయాన్ని ఆయన ప్రదర్శించారు. ప్రాణ్ చోప్రా మేయర్‌గా విలన్ పాత్రలో కనిపించారు. స్వర్గీయ అల్లు రామలింగయ్య, రంగనాథ్, గొల్లపూడి, చలపతిరావు తమ పాత్రలకు వన్నె తెచ్చారు. వై విజయ్ వేశ్వవృత్తిని కొనసాగించే మహిళగా కీలక పాత్రను పోషించారు.

1990 సంవత్సరంలో రిలీజైన ఈ చిత్రం హాలీవుడ్ ప్రమాణాలకు ఏ మాత్రం తగ్గుకుండా భారీ సెట్టింగులు, కథకు తగిన విధంగా వాతావరణాన్ని అద్బుతంగా సృష్టించారు. కేఎస్ హరి సినిమాటోగ్రఫి, రాజ్ కోటి మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కైకాల సత్యనారాయణ సోదరుడు నాగేశ్వరరావు అనుసరించిన నిర్మాణ విలువలు అత్యుత్తమ ప్రమాణాలకు ధీటుగా నిలిచాయి. సుమారుగా 4 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది.

ఈ సినిమాను ప్రస్తుత సాంకేతిక విలువలతో ప్రేక్షకుల ముందుకు నవంబర్ నెల 21వ తేదీన రిలీజ్ అవుతున్నది. 4K రెజల్యూషన్, 5.1 డిజిటల్ సరౌండ్ సౌండ్ లాంటి సాంకేతిక ప్రమాణాలతో మరోసారి అభిమానులకు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు రెడీ అయింది. మరోసారి చిరంజీవి కౌబాయ్ విశ్వరూపాన్ని చూసేందుకు రెడీ అయిపోదామా?

More from Filmibeat

Read more about: chiranjeevi radha kodama simham
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X