For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘పులి’ పంజాదెబ్బకి ఫ్యాన్స్ పరుగులు...

  By Sindhu
  |
  Komaram Puli
  Rating
  బ్యానర్: కనకరత్న మూవీస్‌
  తారాగణం: పవన్ కళ్యాణ్, నిఖీషా పటేల్, బ్రహ్మాజి, ఆలీ, గిరీష్ ఖర్నాడ్,
  శ్రియ, మనోజ్ భాజ్ పేయ్, చరణ్ రాజ్, నాజర్, తదితరులు.
  కెమెరా: బినోద్‌. కె.ప్రధాన్‌
  ఎడిటింగ్: ప్రభాకరన్
  దర్శకత్వం: ఎస్ జె సూర్య
  సంగీతం: ఎఆర్ రెహమాన్
  పాటలు: చంద్రబోస్
  నిర్మాత: శింగనమల రమేష్
  విడుదల తేదీ: 10/09/10

  పవర్ స్టార్ పులి పంజా విసరడం తో గత రికార్డులు ఎక్కడికక్కడే గల్లంతఅవుతున్నాయి. 600 ప్రింట్లతో 1000థియేటర్లలో విడుదలైన 'కొమరం పులి" రికార్డులుకి ఓపెనింగ్స్ చూస్తుంటే గత రికార్డులు ఎక్కడికక్కడ గల్లంతయ్యే పరిస్థి ఏర్పడిందని సినీ వర్గాలు అంటున్నాయి. నైజాం ఏరియాలోనే 200 థియేటర్ల పైగా విడుదలై ప్రభంజనం సృష్టించింది. మొత్తంలో 'మగధీర" తో పోలిస్తే అంతకంటే ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యాయి. పవన్ పొటన్సియాలిటి ప్రూవ్ చేసి సిన్సీయర్ పోలీస్ అఫీసర్ ఎలాగున్నారో చూపించి తన అద్బుత నటనతో తన అభిమానులను ఆకట్టుకున్నాడు. పగ ప్రతీకారాలకు దూరంగా కథను సిద్దం చేశారు. గత పవన్ సినిమాలకు బిన్నంగా 'పులి"నితీర్చిదిద్దారు. మల్టీప్లెక్స్ థియేటర్స్ లోనూ అధిక సంఖ్యలో విడుదలై పులి ప్రభంజనం సృష్టిస్తోంది. ట్రేడ్ టాక్ నే పులి తారుమారు చేసే అవకాశాలున్నాయి. పులి యావరేజ్ టాక్ తెచ్చుకొన్నా 40కోట్లు దాటేస్తుందనీ సినీవర్గాలు సమాచారం. మగధీర కలెక్షన్స్ ని అవలీలగా దాటేస్తుందనేది అభిమానుల అంచానా....కొమరం పులి అనే పేరు అంత గొప్పగా ఉన్నా....

  కానీ ఈ పులి లో....అన్ని ఎక్కువే హింసతో పాటు...సందేశం కూడా......కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్..ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం. నిఖీషా పటేల్ కిక్. కానీ సినిమా లో...హింస ఎక్కువ హాస్యం తక్కువ. మనం సినిమాకే ఎందుకుపోతాం. కాసేపు నవ్వుకోవడానికి. ఆ నవ్వులోనే కొంచెం సెంటిమెంట్ తాలింపు తర్వాత కొంచెం కొంచెం సమజానికి సందేశం తో డెకరేట్ చేసి సినిమా అభిమనులికి వంటకం అందించాలి.

  కొమరం పులి కథ చాల చిన్నది కానీ తీసిన విధానం...బాగుంది...పులి...ఇంటిపేరు 'కొమరం పులి"....పోలీసు శాఖ లో నీతి నిజాయితి గల పోలీసు అధికారి.....ఒకానొక సందర్బంలో నో పార్కింగ్ చోట ఉన్న డాన్ సలీమ్ కార్నీ బ్లాక్ చేస్తాడు పులి. ఆది తెలుసుకున్న డాన్ సలీమ్(మనోజ్ భాజ్ పేయ్) తన ఇమేజ్ నీ పరువుని తీసినందుకు పగపడతాడు. కానీ పులి మాత్రం అతని బ్యాక్ గ్రౌడ్ తెలుసుకుంటాడు. ఆది ఏమిటి అంటే అతను ఒక పెద్ద డాన్. ఎక్కడ నుంచో మనుషులని పంపి టెర్రరిజం చేయిస్తుంటాడు. ఇది కనుకున్న పులి డాన్ మీద నిగా పెంచుతాడు. హాంగ్ ఖాంగ్ లో ప్రైమ్ మినస్టర్ (గిరీష్ ఖర్నాడ్)ను టర్రరిస్ట్ ల నుండి కాపాడుతాడు. దాంతో ప్రైమ్ మినిష్టర్ తో ప్రశంసలు పొందుతాడు. దాంతో పవన్ పులి స్పెషల్ ఆపీసర్ గా నియమింపబడి పులీ టీమ్ అప్ అయ్యి అమాయక జనాలను కాపాడుతాడు.

  ఇది ఇలా ఉండగా, ఇదే శాఖ లో పనిచేస్తున్న మధుమతి (నిఖీషా పటేల్) పులి మీద మనసు పడుతుంది. కానీ వృత్తే దర్మంగా బావించి. మొదట్లో పట్టించుకోడు. కానీ తర్వాత ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. అదే సమయంలో డాన్ 'పులి" కోసం ఒక నిజం తెలుసుకుంటాడు. అది ఏంటంటే పులి మదర్ శరణ్య భర్తను వెతుకుతూ కనపడటంతోనే మొదలవుతుంది సినిమా ఆయనే పులి నాన్న 'నాజర్" ఎసిపి అని. నాజర్ డాన్ కేసు మొదట్లో చూస్తాడు. తన పనికి ఆడ్డు వస్తున్నాడని, నాజర్ ని చంపించేస్తాడు డాన్. ఈ విషయం పులి కీ కూడా తెలుస్తుంది. దీంతో మరింత పగ పెంచుకుంటాడు. ఆ డాన్ ను అంతమోందించే పనిలో ఇన్ వెస్టిగేషన్ లో డాన్ ఉన్న ప్లేస్ లో డాన్సర్ శ్రియా తో పరిచయం చేసుకొని ఇన్ వెస్టిగేట్ చేస్తాడు. ఆ పగ నిఖీషా ప్రాణాన్ని తీసుకుంటుంది. దాంతో ఎట్లాగైయినా దేశాన్ని డాన్ నుంచి రక్షించాలని, ఎసిపి దగ్గర నుండి పెన్ డ్రైవ్ ద్వారా విషయాలన్ని కనుకొని డాన్ పనిపట్టి కథ క్లైమాక్స్ లో భారీ డైలాగ్స్ తో 'పులి" అనిపించుకుంటాడు.

  ఆర్టిస్ట్ ఫెర్ఫామెన్స్:
  పవన్ కళ్యాణ్: పూర్తి స్థాయి పోలీసు పాత్ర అదరకొట్టాడు. ఆస్ యూసవల్ గా నటతో ఫ్యాన్స్ ని ఆకట్టుకొన్నాడు. పవన్ డైలాగ్స్ లెగ్త్ వున్నా డైలాగ్స్ ప్రదర్శించిన విదానం చాలా చక్కగా వున్నాయి.

  నికిషా: వచ్చింది కొత్త గ్లామర్స్ సెక్సీ గర్ల్, బాగానే ఉంది. పర్వాలేదు ఈ సినిమా పేరు చెప్పుకొని కొన్ని డబ్బులు దండుకుంటుంది.

  శ్రియా: ఐటమ్ సాంగ్ లో ఆవరేజ్ అనిపించుకొంది.

  మనోజ్ బాజ్ పేయ్ బాగా చేసాడు. మంచి లైఫ్ ఉంది అతనికి. ఇంటర్నేషనల్ డాన్ గా బాగా ఇంట్రడ్యూస్ చేసారు డైరెక్టర్

  ఎఆర్ రెహమాన్ సంగీతం అద్భుతం. చాల బాగుంది. ఒక అంతర్జాతీయ సినిమాకి కొట్టిన మ్యూజిక్ ఇచ్చాడు. మొదటగా వినేవారికి అంత నచ్చకపోవచ్చు ఒకటి రెండు సార్లు వింటే చాలా బాగుంది.

  ఎస్ జె సూర్య: ఖుషి-అంత కాకపోయినా ఆదో కష్టపడ్డాడు. కొన్ని సన్నివేస్సాల్లో ఈ సినిమాకి ఇంత డబ్బు అవసరమా అనిపిస్తుంది. మొతానికి. పాత వైన్ బాటిల్ లో కొత్త వైన్ నింపినట్టుగా ఉంది పర్వాలేదు మా పవన్ కళ్యాణ్ మేము చూస్తాం. ఆది ఎట్లా ఉన్న పర్వాలేదు అంటే...వెళ్ళండి మీ ఇష్టం....

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X