Konaseema Thugs Review and Rating.. ఢిఫరెంట్ యాక్షన్ డ్రామా.. బృందా మాస్టర్ దర్శకత్వం ఎలా ఉందంటే?

Rating: 2.75/5

నటీనటులు: హిృదు హరూన్ బాబీ సింహా, మునీష్ కాంత్, ఆర్కే సురేశ్, అనస్వర రంజన్, శరత్ అప్పానీ, తేనప్పన్ పీఎల్ తదితరులు
దర్శకత్వం: బృందా మాస్టర్
నిర్మాతలు: రియా శిబు, ముంతాస్ ఎమ్
మ్యూజిక్: సామ్ సీఎస్
సినిమాటోగ్రఫి: ప్రియేష్ గురుస్వామి
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
రిలీజ్ డేట్: 2023-02-24

కాకినాడలో దౌర్జన్యాలకు పాల్పడే పెద్ది రెడ్డి వద్ద శేషు (హిృదు హరూన్) పనిచేస్తుంటాడు. కాకినాడలో అనాధాశ్రమంలో ఉంటున్న యువతి కోయిల (అనస్వర రాజన్)ను తొలిచూపులోనే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. పెద్ది రెడ్డి మనుషుల నుంచి తప్పించుకొని ఆస్ట్రేలియాకు వెళ్దామనుకొన్న శేషు ఓ కేసులో అరెస్టై కాకినాడ జిల్లా జైలుకు వెళ్తాడు. జైలులో దొర (బాబీ), మధు (మునీష్ కాంత్)ను కలుసుకొని జైలు నుంచి తప్పించుకోవాలని ప్లాన్ వేస్తారు.

పెద్ది రెడ్డి రౌడీలతో శేషుకు ఎందుకు గొడవలు జరిగాయి? ఎలాంటి కేసులో శేషు కాకినాడ జైలుకు వెళ్లాడు? శేషు జైలుకు వెళ్లిన పరిస్థితుల్లొ ప్రేయసి కోయిల ఏం చేసింది? చాలాకాలంగా దొర జైలులో ఎందుకు ఉంటున్నాడు? ఇతర ఖైదీలతో శేషు వేసిన ప్లాన్ వర్కవుట్ అయిందా? జైలు నుంచి క్షేమంగా తప్పించుకొన్నారా? జైలు నుంచి తప్పించుకొన్న శేషు తన ప్రియురాలిని కలుసుకొన్నాడా? ప్రియురాలితో కలిసి శేషు ఆస్ట్రేలియాకు వెళ్లగలిగాడా? అనే ప్రశ్నలకు సమాధానమే కోనసీమ థగ్స్ సినిమా కథ.

 Konaseema Thugs Review and Rating: Brinda Master misses the magic in Action Drama

జైలు అధికారులకు, ఖైదీలకు జరిగే భారీ యాక్షన్ సీన్‌తో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఖైదీల మధ్య గొడవలు, పోలీసుల టార్చర్ లాంటి అంశాలతో కథ సీరియస్‌గా సాగుతుంది. శేషు జైలులో అడుగపెట్టిన తర్వాత మరింత వేగం పుంజుకొంటుంది. శేషు, కోయిల మధ్య లవ్ ట్రాక్, కోయిలను వేధించే రౌడీతో గొడవలు కథను మరింత భావోద్వేగంగా మారుస్తాయి. చక్కటి పాయింట్‌తో సెకండాఫ్‌పై అంచనాలు పెరిగేలా చేశారు. అయితే సెకండాఫ్‌లో ఎలాంటి ఎమోషన్స్ లేకుండా.. ఒకే పాయింట్‌పై సాగదీసి.. సాగదీసి విసుగుపుట్టించేలా చేస్తుంది. జైలు నుంచి తప్పించుకొనే సన్నివేశాల్లో కూడా పెద్దగా క్యూరియాసిటిని కలిగించకపోవడం సినిమా గ్రాఫ్‌ను తగ్గించేలా చేసింది.

కోనసీమ థగ్స్ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో యాక్షన్ సీన్లు కొత్తగా ఉండటమే కాకుండా సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి. ఇక హిృదు హారన్ యాక్టింగ్, యాక్షన్, ఫైట్ల విషయంలో ఇరుగదీశాడనే చెప్పవచ్చు. సినిమా కథను తన భుజాలపైనే మోయడం అభినందించదగిన విషయం. అయితే కథలో భావోద్వేగాలు లేకపోవడంతో హిృందూ కూడా ఏమీ చేయలేకపోయాడని చెప్పవచ్చు. కోయిల పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. బాబీ సింహా లాంటి క్యారెక్టర్‌ను పెద్దగా వాడుకోలేకపోవడం దర్శకురాలిని తప్పు పట్టాల్సిందే. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

దర్శకురాలు బృంద టేకింగ్, మేకింగ్ బ్రహ్మండంగా ఉంది. కానీ కథ బలహీనం, కథనంలో లోపాలు ఈ సినిమాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. సినిమా మొత్తం జైలులోనే సాగడం .. సన్నివేశాలు సాగదీసినట్టు ఉండటం వల్ల కథలో కొత్తదనం కనిపించలేదు. కథ, కథనాల బలంగా రాసుకొని జైలులో ఎమోషన్స్ పండించాల్సి ఉండేదనిపిస్తుంది. ఇక సామ్ సీఎస్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సీన్లను హైలెట్ చేసింది. సినిమాటోగ్రఫి విషయానికి వస్తే ప్రియేష్ గురుస్వామి పనితనం బాగుంది. లైటింగ్, కలర్ ప్యాలెట్ ఉపయోగించిన విధానం పర్‌ఫెక్ట్‌గా ఉంది. ఎడిటర్ ప్రవీణ్ ఆంటోనికి ఇంకాస్త పని ఉందని చెప్పవచ్చు.

ఫైనల్‌గా
ఆవేశంలో తప్పిదాలు చేసి శిక్ష అనుభవించే ఖైదీల జీవితాల నేపథ్యంగా కొంత ఎమోషన్స్, మరికొంత యాక్షన్‌తో రూపొందిన చిత్రం కొనసీమ థగ్స్. కథలో భావోద్వేగాలు తేలిపోవడంతో రొటీన్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుుగుతుంది. కాకపోతే యాక్షన్ సీన్లు, బీజీఎం లాంటి సాంకేతిక అంశాలు సినిమాకు పాజిటివ్‌గా మారాయి. యాక్షన్ చిత్రాలను ఆదరించే వారికి కొనసీమ థగ్స్ తప్పకుండా నచ్చుతుంది. బృందా మాస్టర్ అభిమానులను కూడా ఆలరించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X