కొంచెం..కొంచమే (రివ్యూ)


తారాగణం: సిద్దార్ధ,తమన్నా,ప్రకాష్ రాజ్,రమ్య కృష్ణ,
నాజర్,బ్రహ్మానందం,వేణుమాధవ్,సుధ తదితరులు.
ఛాయా గ్రహణం: విజయ్.కె.చక్రవర్తి
ఆర్ట్: చిన్నా
ఎడిటింగ్: శ్రకర్ ప్రసాద్
మాటలు: అబ్బూరి రవి
పాటలు: సిరివెన్నెల,వేటూరి,చంద్రబోస్
సంగీతం: శంకర్ ఇషన్ లయ్
నిర్మాత: నల్లమలుపు బుజ్జి
కథ,దర్శకత్వం: కిషోర్ కుమార్
రిలీజ్ డేట్: 05 పిబ్రవరి 2009
బొమ్మలిల్లు ఎమోషన్స్ తో, నువ్వొస్తానంటే..నేనువద్దంటానా స్క్రీన్ ప్లేతో డాడీ..డాడీ(హరీష్,అక్కినేని)పాయింటుని డీల్ చేస్తూ వచ్చిన ఫార్ములా ఫీల్ గుడ్ చిత్రం ఇది. అయితే నమ్ముకున్న ఈ మూడింటిలో ఏదీ పూర్తిగా ఫాలోకాకుండా, అన్నిటి నుంచీ కొంచెం, కొంచెం(నచ్చినవి) తీసుకుని, కలుపుకుంటూ రావటంతో సంపూర్ణమైన చిత్రం చూస్తున్న ఫీల్ ఎక్కడా తేలేకపోయింది. అలాగే ఈ చిత్రాన్ని ఫస్టాఫ్ యూత్, సెకెండాఫ్ ప్యామిలీ అన్నట్లు విభజించటంతో ఏ వర్గాన్ని పూర్తి స్ధాయిలో తృప్తి పరచలేకపోయింది. ఇవన్నీ ఇలా ఉన్నా ఈ మాత్రం ఎంటర్టైన్ చేసే సినిమాలు కూడా లేకపోవటం ఈ సినిమాకు కలిసివచ్చే అంశం. మరో ప్రక్క సినిమా పూర్తి స్ధాయి క్లీన్ గా ఉండటం ఫ్యామిలీలును ఆకట్టుకుంటుంది.
తల్లి, తండ్రులు విడివిడిగా ఉన్నా హ్యాపీగా ఉంటున్న కుర్రాడు సిద్దు(సిద్దార్ధ). అతని జీవితంలోకి తండ్రి చాటు బిడ్డ గీతా సుబ్రమణ్యం(తమన్నా) ప్రవేశిస్తుంది. ఎప్పటిలాగే మొదట ఎడమొహం పెడమొహంగా ఉన్నా...తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆలస్యం ఎందుకని ఆమె ఇంటికెళ్ళి ప్రపోజల్ పెడతారు. అప్పుడామె తండ్రి (నాజర్)సిద్దుకి ఓ కండీషన్ పెడతాడు. ముందు విడిపోయిన మీ అమ్మా నాన్నను (రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్)ని కలుపు..అప్పుడు ఆలోచిస్తాను అంటాడు. ఎందుకంటే అటువంటి కుటుంబంలోని నా కూతర్ని ఎలా పంపుతాను అంటాడు. ఆ పరిస్ధితుల్లో సిద్దు ఏం డెషిషన్ తీసుకున్నాడు...చివరకి వాళ్ళ ప్రేమ కథ ఎలా సుఖాంతమైంది అన్నదే మిగతా కథ.
టైటిల్, పోస్టర్స్ చూసి హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ స్టోరీ అనుకుని ఫిక్స్ అయి వెళితే కథ టర్న్ తీసుకుని ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ మధ్య జరిగే కథలా మారిపోతుంది. అలాగే హీరోకు సమస్య అయిన తల్లి తండ్రులను కలపాలనే లక్ష్యం సెకెండాఫ్ లో ఓ పాట అయ్యాక వస్తుంది. దాంతో అప్పటి వరకూ ఏమీ జరిగినట్లనిపించదు. ఇక ఈ కలపాలనే ప్రక్రియలో హీరో, హీరోయిన్స్ పెద్దగా కష్టపడినట్లు కనపడరు. (నువ్వొస్తానంటేనే లో బెటర్..వ్యవసాయం చేస్తాడు). అలాగే అంత ఈజీగా కలిసిపోతారు అనుకున్నప్పుడు ఎప్పుడో ఆ పని చేయవచ్చు కదా అనే డౌట్ కూడా వస్తుంది.ఇక క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ తో సిద్దార్ధ మాట్లాడే డైలాగులు చూస్తుంటే..బొమ్మరిల్లు స్పష్టంగా గుర్తుకు రావటం ఖాయం. వీటిన్నిటికీ మించి లెంగ్త్ బాగా ఎక్కువయింది.
ఇక ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది.. విజయ్ చక్రవర్తి కెమెరా. చాలా చోట్ల విజువల్ ట్రీట్ గా మార్చటంలో సఫలీకృతుడయ్యాడు. అబ్బురి రవి మాటలు బాగున్నా...త్రివిక్రమ్ స్కూల్ లోంచి బయిటకు రాకపోవటంతో ఎక్కడో ఇంతకు ముందు విన్నట్లు అనిపిస్తాయి. సంగీతంలో టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఇక ఆర్టిస్ట్ ల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది తమన్నానే. ఆమె సినిమాకు యు.ఎస్.పి. సిద్దార్ధ అయితే కొత్తగా చేసిందేమీ లేదు..పాత ఎక్సప్రెషన్స్ నే ఇచ్చుకుంటూ చాలా ఈజ్ తో చేసుకుంటూ పోయాడు. ఇక కొత్తగా పరిచయమైన దర్శకుడు కిషోర్ ఈ సినిమాను మినిమం గ్యారింటీగా తీయాలన్న తపనే ప్రతీ ప్రేమ్ లోనూ, కామిడీలోనూ (బ్రహ్మానందం క్యారెక్టర్ అలాగే కథకు సంభందం ఉండదు)జాగ్రత్త పడుతూ చేసాడు. అయితే ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా గొప్ప చిత్రం చేసాడన్న పేరు రాదు.బొమ్మరిల్లు రాకముందు ఇది తీసుంటే ప్రపంచం గుర్తించేది. ఇక నిర్మాతగా బుజ్జికి మరో చింతకాయల రవి లాంటి అనుభవమే ఎదురవ్వవచ్చు. అంతా సినిమా బాగుంది అంటారు..గానీ ఎంతవరకూ ప్రేక్షకులుకు ఎక్కుతుందనేది వెయిట్ చేయాల్సిందే.
ఇక మొదటే చెప్పుకున్నట్లు క్లీన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపుదిద్దటంతో ఫ్యామిలీస్ నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. సెకెండాఫ్ బాగుంది కాబట్టి కలక్షన్స్ కీ ఇబ్బంది ఉండకపోవచ్చు. ఫలితం కూడా కొంచెం..కొంచెం నుండి పెరగవచ్చు.


Click it and Unblock the Notifications











