For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Konda movie review కొండా ‘భయో’పిక్.. RGV స్టైల్‌లోనే.. !

  |

  Rating: 2.5/5

  ఉత్తర తెలంగాణలో తిరుగులేని రాజకీయ దంపతులు కొండా మురళి, కొండా సురేఖ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం కొండా. అత్యంత వివాదాస్పదమైన సంఘటనలు, సంచలన విషయాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ కథను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరక్కించారు. అయితే అతి సాధారణ జీవితం నుంచి వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్స్ కొండా దంపతుల జీవితం వెండితెర మీద కూడా అదే స్థాయిలో ఆకట్టుకొందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కొండా చిత్రాన్ని సమీక్షించాల్సిందే..

  కొండా మూవీ కథ..

  కొండా మూవీ కథ..

  విప్లవ, ఆధునిక భావాలు కలిగిన కొండా మురళి (త్రిగుణ్) వరంగల్‌లోని లాల్ బహద్దూర్ కాలేజీలో స్టూడెంట్. అప్పటికే నక్సలైట్ ఉద్యమంలో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్న ఆర్కే అలియాస్ రామకృష్ణ భావాలకు మురళి ఆకర్షిలవుతాడు. అదే కాలేజీలో చదువుతున్న సురేఖ (ఇరా మోర్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే రాజకీయంగా తనపై కుట్రలు పాల్పడుతున్న పొలిటిషియన్ నల్లా సుధాకర్ (పృథ్వీ)పై ఎదురు తిరుగుతాడు.

   కొండా మూవీలో ట్విస్టులు

  కొండా మూవీలో ట్విస్టులు

  నక్సలైట్ ఉద్యమంతో కొండా మురళికి అనుబంధం ఏమిటి? నల్ల సుధాకర్‌తో విబేధాలు ఎందుకు ఏర్పడ్డాయి? తనపై హత్యా ప్రయత్నం చేసిన నల్ల సుధాకర్, పోలీసులను కొండా మురళి ఎలా ఎదురించాడు? తన రాజకీయ ప్రస్థానంలో కొండా సురేఖ అండగా ఉన్న తీరు.. రాజకీయ ప్రత్యర్థులపై ఆమె ఎలాంటి వ్యూహాలు అనుసరించింది అనే ప్రశ్నలకు సమాధానమే కొండా చిత్రం.

  ఫస్టాఫ్‌ ఎలా ఉందంటే?

  ఫస్టాఫ్‌ ఎలా ఉందంటే?

  కొండా బయోపిక్ విషయానికి వస్తే.. తొలి భాగమంతా అధిక భాగం వాస్తవాలకు దూరంగా ఫిక్షన్, గ్లామర్ అంశాలకు పెద్ద పీట వేశారనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు ఏదో జరుగుతుందనే భావన కలుగుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక నక్సలైట్లకు సంబంధించిన సన్నివేశాలు చాలా పేలవంగా కనిపిస్తాయి. అందుకు వర్మకు ఆ టాపిక్‌పై అవగాహన లేకపోవడమే అనేది స్పష్టంగా అనిపిస్తుంది.

  సెకండాఫ్ కాస్త గ్రిప్పింగ్‌గా

  సెకండాఫ్ కాస్త గ్రిప్పింగ్‌గా

  ఇక కొండా సెకండాఫ్‌ విషయానికి వస్తే.. కొంత బెటర్‌గా అనిపిస్తుంది. డ్రామా, ఫ్యాక్షన్ అంశాలు, కొండా మురళి రెబెల్‌గా మారే అంశాలు ఆసక్తికరంగా కనిపిస్తాయి. అయితే కీలక పాత్రలను పేరు, ఊరు లేని నటుల చేత చేయించడంతో ఆ పాత్రలు తెర మీద ప్రభావం చూపలేకోయాయని అనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో చాలా సన్నివేశాల్లో నాటకీయత తప్ప ఎమోషనల్‌గా ఆకట్టుకోలేకపోయాయని చెప్పవచ్చు. ఫస్టాప్‌తో పోల్చితే సెకండాఫ్ కాస్త గ్రిప్పింగ్‌గా అనిపిస్తుంది.

  వర్మ డైరెక్షన్ గురించి..

  వర్మ డైరెక్షన్ గురించి..

  భారీ భావోద్వేగాలకు, అనేక ట్విస్టులతో కూడిన కొండా మురళి, సురేఖ జీవితాలు బయోపిక్‌కు పక్కా సూట్ అవుతాయి. అయితే అతి సాధారణమైన స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన వారి జీవితాలను తెరకెక్కించడంలో ఎప్పటిలానే రాంగోపాల్ వర్మ తడబాటుకు గురయ్యారు. అయితే వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టి బయోపిక్‌ తీయడానికి బదులు బయోఫిక్షన్ తీయడానికే మొగ్గు చూపారనే విషయం ప్రతీ ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. పాత్రలను డిజైన్ చేయడంలో ఏరు దాటి తెప్పను వదిలేసే ప్రయత్నం ఆర్జీవి చేశారనిపిస్తుంది.

  త్రిగుణ్, ఇరా మోర్ గురించి

  త్రిగుణ్, ఇరా మోర్ గురించి

  నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ కథలో త్రిగున్, ఇరా మోర్ తమ పాత్రలకు పూర్తి స్థాయి న్యాయం చేశారు. ఇప్పటి వరకు లవర్ బాయ్, సాఫ్ట్ హీరోగా కనిపించిన త్రిగుణ్ రెబెల్‌గా ఆకట్టుకొంటాడు. అలాగే ఇరా కూడా భావోద్వేగమైన పాత్రలో ఒదిగిపోయింది. ఇక పృథ్వీ రెగ్యులర్ విలన్‌గా కనిపించాడు. ఆర్కేగా నటించిన ప్రశాంత్ ఫర్వాలేదనిపించారు. ఆటో రాంప్రసాద్ గుర్తుండిపోయే పాత్రలో నటించాడు. తులసి, ఎల్బీ శ్రీరాం మిగితా పాత్రల్లో కనిపించిన వారు ఫర్వాలేదనిపించారు.

  టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గురించి..

  టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గురించి..

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మల్హర్ భట్ జోషి సినిమాటోగ్రఫి బాగుంది. అయితే బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల ఆయన ప్రతిభ పరిమితమైందనిపిస్తుంది. డీఎస్ఆర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మిగితా నిపుణులు ఫర్వాలేదనించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కథ, సినిమా పరిధికి లోబడి ఉన్నాయి.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  అత్యంత భావోద్వేగం, రాజకీయ ఎత్తుగడలు, ఫ్యాక్షన్ అంశాలకు తావుండే కథ కొండా. కానీ పూర్తిస్థాయిలో అలాంటి అంశాలు ఎలివేట్ కాలేదనిపిస్తాయి. కొండా దంపతులు జీవితం తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ జిల్లాను ప్రభావితం చేయదగ్గ అంశం. ఈ ప్రాంతంలోని వారికి ఈ సినిమాపై ఆసక్తి తప్పకుండా ఉంటుంది. మిగితా ప్రాంతాల్లోని ప్రేక్షకులు ఈ సినిమాను ఆకర్షింపబడే స్థాయిని బట్టి సినిమా సక్సెస్ ఉంటుంది. ఇటీవల కాలంలో రాంగోపాల్ వర్మ ఉంటున్న తన జోన్ నుంచి బయటకు వచ్చి మంచి చిత్రం అందిస్తారనే వారికి నిరాశే మిగిల్చాడనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఈ సినిమా రేంజ్‌ అనేది స్పష్టంగా తెలుస్తుంది.

  Venkaiah Naidu...నో మోర్ పాలిటిక్స్ అమ్మా *Politics | Telugu OneIndia
  కొండా నటీనటులు, సాంకేతిక నిపుణులు

  కొండా నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: త్రిగుణ్, ఇరా మోర్‌, పృథ్వీరాజ్‌, తుల‌సి, ఎల్బీ శ్రీ‌రామ్‌, 'ఆటో' రామ్ ప్రసాద్, అభిలాష్ చౌద‌రి, శ్ర‌వ‌ణ్‌, అభిలాష్ చౌదరి, శ్రవణ్, అనిల్ కుమార్ రెడ్డి లింగంపల్లి, గిరిధర్ చంద్రమౌళి, రవి, షబీనా తదితరులు
  కథ, కథనం, ద‌ర్శ‌క‌త్వం: రాం గోపాల్ వ‌ర్మ‌
  నిర్మాత: కొండా సుష్మితా పటేల్
  ఆర్ట్: అంజి, ఆటో జానీ
  ఫైట్స్: శ్రీకాంత్
  సమర్పణ: శ్రేష్ఠ పటేల్ మూవీస్
  ఎడిట‌ర్‌: మ‌నీష్ ఠాకూర్‌
  నిర్మాణం: ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్
  సినిమాటోగ్రఫి: మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి
  సంగీతం: డీఎస్‌ఆర్‌
  కో-డైరెక్ట‌ర్: అగ‌స్త్య మంజు
  రిలీజ్ డేట్: 2022-06-23

  English summary
  Konda movie hits the theatres on June 23th. Here is the exclusive review from Teugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X