For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Konda Polam Movie Review: వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ వావ్.. క్రిష్ డైరెక్షన్ ఎలా ఉందంటే?

  |

  Rating: 2.75/5

  తెలుగు సాహిత్య ప్రపంచంలో ఇటీవల కాలంలో ఎక్కువగా పాఠకులను, విమర్శకులను ఆకట్టుకొన్న నవల కొండ పొలం. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ఈ నవలను అదే పేరుతో దర్శకుడు క్రిష్ వెండితెర మీద ఆవిష్కరించారు. ఉప్పెనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న పంజా వైష్ణవ్ తేజ్, గ్లామర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఈ సినిమాను రూపొందించారు.

  రిలీజ్‌కు ముంద అటు సాహితీ ప్రియులను, ఇటు సినీ అభిమానులను విశేషంగా ఆకర్షించింది. అయితే ఈ సినిమా కొండ పొలం అందించిన అనుభూతిని, భావోద్వేగాలను దర్శకుడు క్రిష్ ఆవిష్కరించారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ, కథనాలను, నటీనటులు తీరుతెన్నులను సమీక్షిద్దాం..

  కొండ పొలం కథేంటంటే?

  కొండ పొలం కథేంటంటే?

  కడప జిల్లాలోని గొర్ల కాపరి కుటంబానికి చెందిన కటారు రవి యాదవ్ (పంజా వైష్ణవ్ తేజ్) ఉన్నత చదువులు చదివినప్పటికీ ఇంటర్వ్యూ ఫోభియాతో ఉద్యోగం సంపాదించాలేకపోతాడు. నిరాశ, నిస్పృహలతో ఇంటికి చేరుకొని తండ్రి (సాయిచంద్) తో పాటు ఓబు (రకుల్ ప్రీత్ సింగ్) గొర్లను కాచేందుకు కొండ పొలంకు వెళ్తారు. నల్లమల ప్రాంతం కలప స్మగ్లింగ్‌కు పాల్పడే గుంటనక్కలను, పులి బారిన పడే గొర్లను కాపాడేందుకు రవి ముందడుగు వేస్తాడు?

  కొండ పొలం సినిమాలో ట్విస్టులు

  కొండ పొలం సినిమాలో ట్విస్టులు

  కొండ పొలంకు వెళ్లిన రవిలో కలిగిన మానసిక ప్రవర్తనకు, తెచ్చుకొన్న మనోధైర్యం కారణాలు ఏమిటి? తనకు బావ లాంటి రవిపై మనసు పడిన ఓబుకు ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది. సివిల్ సర్వీస్ పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించినప్పటికీ.. అటవీ అధికారి పోస్టును ఎందుకు కోరుకొన్నారు? ఎలాంటి అనుభవాలు, జీవిత పాఠాలతో రవి తన లక్ష్యాలను చేరుకొన్నాడు? ముఖ్యంగా ఇంటర్వ్యూలో మనోధైర్యం కోల్పోయే రవికి అడవి తల్లి నేర్పిన జీవిత పాఠాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే కొండ పొలం సినిమా కథ.

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

  ఢిల్లీలో సివిల్స్ సర్వీస్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన రవిని బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ద్వారా కథ భావోద్వేగంగా మొదలవుతుంది. తన జీవిత నేపథ్యం గురించి చెప్పమని అడిగిన ప్రశ్న ద్వారా రవి తన గతాన్ని చెప్పడం ద్వారా ఓ ఎమోషనల్ నోట్‌తో కథ మనసును టచ్ చేసేలా ఉంటుంది. కాకపోతే కథలో కీలకంగా మారే ఓబు పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ఏ మాత్రం సరికాదనే విషయం తొలి సీన్‌లో అర్ధమవుతుంది.

  ఓబు పాత్ర తెర మీద కీలకంగా మారే ప్రతీ సారి కథను ఆ పాత్ర డైల్యూట్ చేసి పడేస్తుందనే రంపపు కోత మొదలవుతుంది. కథలో భావోద్వేగాలు ఉప్పొంగిన ప్రతీసారి ఓబు పాత్ర తెరమీద నీళ్లు చల్లిన విధంగా ఉంటుంది. ఇలాంటి కొన్ని లోపాలను అధిగమించి.. క్రిష్ కథను బాగా హ్యాండిల్ చేశాడని తొలి భాగంలో ఓ ఫీల్ కలుగుతుంది.

  సెకండాఫ్ కాస్త స్లోగా, ఎమోషనల్‌గా

  సెకండాఫ్ కాస్త స్లోగా, ఎమోషనల్‌గా

  ఇక సెకండాఫ్‌లో సాయిచంద్ ఎమోషనల్ ఎపిసోడ్స్, పులి బారిన పడే మేకను రక్షించే సీన్లు, భార్యతో రవి ప్రకాశ్ సన్నివేశాలు కొండ పొలం సినిమాను భావోద్వేగంలోకి నెట్టుతాయి. ఇలాంటి పాజిటివ్ అంశాలను రకుల్ ప్రీత్ చేసి నాసిరకం హావభావాలు, పేలవమైన నటన కథను డస్ట్‌బీన్‌లో పడేసిందా అనే అనుమానం కలుగుతుంది. కథను రకుల్ ప్రీత్ దెబ్బ తీసిన ప్రతీసారి పంజా వైష్ణవ్ తేజ్ సినిమాను తన భుజాన వేసుకొని రక్షించే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌లో కథ మరీ నత్త నడకగా సాగడంతో ప్రేక్షకుల సహానానికి అద్దం పట్టినట్టు కనిపిస్తుంది.

  దర్శకుడు క్రిష్ బ్రహ్మండంగా..

  దర్శకుడు క్రిష్ బ్రహ్మండంగా..

  దర్శకుడు క్రిష్ విషయానికి వస్తే.. కథకు సరిపోయే విధంగా పాత్రల ఎంపికలో అద్భుతమైన పరిణితి, విజన్‌ను ప్రదర్శించాడు. సాయిచంద్, ఇతర పాత్రలో విషయంలో బాగా ఆలోచించిన ఆయన.. ఎలాంటి యాక్టింగ్ స్కిల్స్ లేని, బలమైన పాత్రలను పోషించినట్టు ట్రాక్ రికార్డు లేని రకుల్‌ ప్రీత్‌ను బలమైన ఓబు పాత్రకు ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

  ఇక కథ, కథనాల విషయానికి వస్తే క్రిష్ అద్భుతమైన పరిణితిని తెర మీద చూపించారు. కొన్ని సీన్లను కంటతడి పెట్టించేలా చిత్రీకరించారు. కథనం కాస్త నెమ్మదిగా సాగినా.. ఈ కథను చెప్పడానికి అలాంటి వ్యూహం అనుసరించాల్సిందే. ఆ విషయంలో క్రిష్‌ను తప్పు పట్టాల్సిన అవసరం లేదనిపిస్తుంది.

  క్రెడిట్ అంతా వైష్ణవ్ తేజ్‌దే..

  క్రెడిట్ అంతా వైష్ణవ్ తేజ్‌దే..

  ఇక కొండ పొలం సినిమా కంటెంట్ పరంగా, యాక్టింగ్ పరంగా మరో రేంజ్‌లో ఉందంటే ఆ క్రెడిట్ వైష్ణవ్ తేజ్‌దే అని చెప్పవచ్చు. ప్రతీ సీన్‌లో కళ్లతో పలికించిన హావభావాలు వావ్ అనే రేంజ్‌లో ఉంటాయి. నిప్పు కణికల్లా, తీక్షణమైన చూపులతో వైష్ణవ్ తేజ్ ఆకట్టుకొన్నాడు? రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రను అద్భుతంగా పోషించాడు. గ్రామీణ యువకుడిగా, సివిల్ సర్వెంట్ యాస్పిరేషన్ ఉన్న యువకుడిగా రవి పాత్రలో ఒదిగిపోయాడు. కెరీర్ ఆరంభంలోనే రెండు అద్భుత పాత్రలతో వైష్ణవ్ మరింత క్రేజ్‌ను, అభిమానాన్ని సంపాదించుకొన్నాడనే చెప్పవచ్చు.

  బాబోయ్ రకుల్ ప్రీత్ సింగ్..

  బాబోయ్ రకుల్ ప్రీత్ సింగ్..

  పుట్టెడు తేనెలో ఒక నీటి చుక్క చాలూ అనే విషయం రకుల్ ప్రీత్ ఓబు పాత్రతో అర్ధమైపోతుంది. ఎలాంటి పాత్ర పోషిస్తున్నాం. ఆ క్యారెక్టర్‌కు కావాల్సిన మేకోవర్ గురించిన విషయాలను అటు రకుల్ గానీ, ఇటు దర్శకుడు క్రిష్ గానీ పట్టించులేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అడవిలో కూడా నిగనిగలాడే మేకప్, పాత్రలో లీనవ్వాలనే డెడికేషన్ ఎక్కడ ఓబు పాత్రను పోషించిన రకుల్‌లో కనిపించదు. కొండ పొలెం సినిమా ఫలితం ఏదైనా తారుమారైతే అందుకు బాధ్యత రకుల్ పోషించిన పాత్ర వల్లనే అని చెప్పవచ్చు. ఓబు పాత్రలోని ఆత్మ సౌందర్యం కంటే.. రకుల్ పాత్రలోని బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. దాని వల్ల మూల్యం ఏ రేంజ్‌లో ఉంటుందో కొద్ది రోజుల్లోనే స్పష్టమవుతుంది.

  మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే..

  మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే..

  కొండ పొలెం సినిమాలో మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే.. సాయిచంద్, మహేష్ విట్టా, కోటా శ్రీనివాసరావు, రచ్చ రవి, రవి ప్రకాశ్, హేమ, ఆనంద్ విహారి లాంటి వాళ్లు సినిమాను నిలబెట్టడానికి తమ వంతు పాత్రను సమర్ధవంతంగా పోషించారు. తన గొర్రె పులిబారిన పడిన సన్నివేశంలో మహేష్ విట్టా నటన గుండెను పిండేస్తుంది. రవి ప్రకాశ్ ఫోన్ ఎపిసోడ్ సూపర్‌గా ఉంటుంది. నాజర్ కూడా గుర్తుండి పోయే పాత్రలో కనిపించారు.

  కీరవాణి మ్యూజిక్ అదరగొట్టేలా

  కీరవాణి మ్యూజిక్ అదరగొట్టేలా

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. కొండ పొలం సినిమాకు అసలు హీరో కీరవాణి. ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశానికి ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉంది. పలు సీన్లు మరో రేంజ్‌లో ఉండటానికి ఆయన మ్యూజిక్ చాలా దోహదపడింది. ఇక జానశేఖర్ వీస్ సినిమాటోగ్రఫి మరో హైలెట్. అడవి అందాలను అద్భుతంగా చిత్రీకరించడమే కాకుండా ప్రతీ సీన్‌ను మంచి పెయింటింగ్ మాదిరిగా తీర్చిదిద్దారు. ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండాఫ్‌లో కొంత పని ఇంకా మిగిలే ఉందనే ఫీలింగ్ కలుగుతుుంది. శ్రవణ్ కటికనేని పనితీరు బాగుంది.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కొండ పొలం సినిమాను సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి తెరకెక్కించారు. కొండ పొలం నవలను సినిమాగా తెర మీద చూపించడానికి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటులు ఎంపిక (రకుల్ ప్రీత్ సింగ్ మినహా) చాలా బాగుంది. ఎంచుకొన్న లొకేషన్లు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు సానుకూలమైన అంశాలుగా నిలిచాయి. కంటెంట్ పరంగా రిచ్‌గా, టెక్నికల్‌గా ఈ సినిమాను ప్రేక్షకులను మెప్పించే విధంగా తీశారని చెప్పవచ్చు.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  సదువుకున్న గొర్రె, సదువుకోని గొర్రెతో మాటాడేది సూసినవా? మాటలే కొండ పొలం సినిమాకు మహా బలం. వ్యక్తిత్వం వికాసం, జీవన వికాసానికి గొప్పగా ఉపయోగపడే విధంగా రూపొందిన మట్టి మనుషుల కథ. బతుకు పోరాటంలో అటవీ సంపదను కొల్లగొట్టడం, సంప్రదాయ వృత్తుల విధ్వంసం లాంటి అంశాలను హృదయానికి టచ్ చేసే విధంగా తెర మీద ఆవిష్కరించారు. కాకపోతే ఒకట్రెండు కీలక పాత్రలను ఎంచుకొన్న విధానమే సినిమాపై ప్రతికూల ప్రభావం పడేలా చేసింది. మట్టి వాసన, అడవి తల్లి ప్రేమను పొందాలనుకొనే ప్రేక్షకులు కొండ పొలం సినిమాను థియేటర్లలో చూడాల్సిందే. ఇటీవల కాలంలో వచ్చిన క్లీన్, అండ్ గ్రీన్ సినిమా అని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు.

   బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్
  కథ, కథనాలు
  వైష్ణవ్ తేజ్, ఇతర నటీనటులు యాక్టింగ్
  క్రిష్ టేకింగ్
  సినిమాటోగ్రఫి, మ్యూజిక్

  మైనస్ పాయింట్స్
  రకుల్ ప్రీత్ సింగ్
  సెకండాఫ్‌ మరీ స్లోగా ఉండటం

  Kondapolam Movie Team Interview
   కొండ పొలంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  కొండ పొలంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, కోట శ్రీనివాసరావు, నాజర్, అన్నపూర్ణ, హేమ, ఆంథోని, రవి ప్రకాశ్, మహేశ్ విట్టా, రచ్చ రవి తదితరులు
  దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
  రచన: సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి
  నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
  సినిమాటోగ్రఫి: జ్ఞానశేఖర్ వీఎస్
  మ్యూజిక్: ఎంఎం కీరవాణి
  ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
  బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
  రిలీజ్ డేట్: 2021-10-08

  English summary
  Konda Polam movie review: Sannapu Reddy Venkat Rami Reddy's Konda Polam novel adopted to Screen. Krish Jagarlamudi directed this movie. Konda Polam movie released on October 8th, 2021.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X