Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Kondaveedu Review బిగ్‌బాస్ శ్వేతావర్మ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
నటీనటులు: బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ గోర్లే, నళినీకాంత్ , నవీన్‌రాజ్ సంకారపు తదితరులు
దర్శకుడు: సిద్ధార్థ్ శ్రీ
నిర్మాతలు: మధుసూధనరాజు, బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి
డిస్ట్రిబ్యూటర్: రామకృష్ణ
సినిమాటోగ్రఫి: రఘు రాయల్
సంగీతం: కనిష్క
ఎడిటర్: శివ శర్వాణి
బ్యానర్: బీపీ ఆర్ సినిమా
రిలీజ్ డేట్: 2022-07-08

కొండవీడు అటవీ ప్రాంతానికి చెందిన బాకు బాబ్జీ (ప్రతాప్ రెడ్డి) కలప స్మగ్లింగ్ చేస్తుంటాడు. బాకు బాబ్జీ అక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నించే అధికారులను నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంటాడు. అటవీ ప్రాంతంలో అమ్మాయిలను, చిన్నపిల్లలను మానభంగం చేస్తుంటాడు. బాకు బాబ్జీ అక్రమాలకు ప్రొఫెసర్ అడ్డుతగులుతాడు. బాకు బాబ్జీ ఆగడాలను అడ్డుకొనే ప్రొఫెసర్‌కు అడవిలో వంశీకృష్ణ, సామవేద (శ్వేతా వర్మ) కలుస్తారు.
బాకు బాబ్జీ అక్రమాలను, స్మగ్లింగ్‌ను ప్రొఫెసర్ ఎందుకు అడ్డుకొంటాడు? అసలు వంశీకృష్ణ ఎవరు? సామవేద ఎందుకు అడవిలో ఉంటుంది? సామవేదను శాండి (నవీన్) ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? వంశీకృష్ణ అడవిలో ఎందుకు ఒంటరిగా తిరుగుతుంటాడు? బాకు బాబ్జీకి చిక్కిన సామవేద, వంశీ, ప్రొఫెసర్ పరిస్థితి ఏమైంది? సామవేద, వంశీ మధ్య ప్రేమ ఎక్కడికి దారి తీసింది? బాకు బాబ్జీ ఆగడాలకు అంతం ఎవరు పలికారు అనే ప్రశ్నలకు సమాధానమే కొండవీడు సినిమా కథ.
పర్యావరణ పరిరక్షణ, అటవీ సంపద ప్రాముఖ్యత నేపథ్యంగా దర్శకుడు సిద్దార్థ్ శ్రీ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. అయితే పూర్తిస్థాయిలో కథను విస్తరించి ఉంటే.. మంచి యాక్షన్ థ్రిల్లర్ అయి ఉండేదనిపిస్తుంది. కొత్త వారితో పెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకొన్న దర్శకుడు తీరు బాగుంది. బడ్జెట్ పరిమితుల లేకుండా ఉండి ఉంటే.. మంచి ఫీల్ గుడ్ సినిమాగా మారి ఉండేదనిపిస్తుంది. అటవీ సంపదను నాశనం చేయడం వల్ల ఆక్సిజన్ కరువు అవుతుంది. భవిష్యత్‌లో ఆక్సిజన్ డబ్బు పెట్టుకొని కొనుక్కొనే దుస్థితి రాకూడదనే మంచి సందేశాన్ని ప్రేక్షకులకు ఇచ్చే ప్రయత్నం చేయడం అభినందనీయం.
కొండవీడు సినిమాకు శ్వేతావర్మ నటన ప్రత్యేక ఆకర్షణ. గ్లామర్‌పరంగా, బాడీ లాంగ్వేజ్ పరంగా శ్వేతా వర్మ ఆకట్టుకోవడమే కాకుండా నటనపరంగా మెచ్యురిటీ ప్రదర్శించింది. బాకు బాబ్జీగా ప్రతాప్ రెడ్డి నేచురల్‌గా విలనిజం ప్రదర్శించాడు. మిగితా పాత్రల్లో కొత్తవారైనప్పటికీ.. తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. కనిష్క సంగీతం బాగుంది. రఘు రాయల్ అటవీ అందాలను ఆహ్లాదకరంగా తెరకెక్కించారు. శివ శర్వాణి ఎడిటింగ్ పరంగా పర్వాలేదనిపించారు. కథ తగ్గిన క్వాలిటీని అందించడంలో నిర్మాతలు మధుసూదనరాజు, బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి సక్సెస్ అయ్యారు. రాజీపడకుండా ఖర్చుకు వెనుకాడలేదనే విషయం ప్రతీ సన్నివేశంలో కనిపించింది. అటవీ సంపద పరిరక్షణ ప్రాముఖ్యత, పర్యావరణంపై అవగాహన ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.