twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Korameenu review రంగస్థలం తరహాలో పక్కా నేటివిటి.. ఎమోషనల్ థ్రిల్లర్‌‌‌గా..

    |

    RATING: 3/5

    ఆనంద్ రవి, హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోరీ దత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, ఇందు కుసుమ, ప్రసన్న కుమార్, ఆర్కే నాయుడు తదితరులు
    స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్: ఆనంద్ రవి
    డైరెక్టర్: శ్రీపతి కర్రి
    నిర్మాత : పెళ్లకూరు సమన్య రెడ్డి.
    సినిమాటోగ్రాఫర్: కార్తీక్ కొప్పెర
    సౌండ్ డిజైన్: సాయి వర్మ ముదునూరి
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సిద్ధార్థ్ సదాశివుని
    ఎడిటర్: విజయ్ వర్ధన్ కె
    పాటలు: అనంత నారాయణన్ ఏజీ
    ప్రొడక్షన్స్ డిజైనర్: ముసి ఫణి తేజ
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్ కుమార్ జన స్వామి
    ప్రొడక్షన్ హౌస్: ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్
    పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి బియాండ్ మీడియా‌
    స్టైలిష్: పూజ శేఖర్
    రిలీజ్ డేట్: 2022-12-31

    కొరమీను కథ ఏమిటంటే

    కొరమీను కథ ఏమిటంటే

    వైజాగ్‌లోని జాలరిపేటలో కరుణ (హరీష్ ఉత్తమన్) డ్రగ్స్, ఇతర దందాలతో ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటాడు. కరుణ వద్ద కోటి (ఆనంద్ రవి) డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. కరుణ హీరోయిజాన్ని చూసి మీనాక్షి (కిషోరి దాత్రక్) అతడి ప్రేమలో పడిపోతుంది.

    అయితే కరుణను ప్రేమించే మీనాక్షి అంటే కోటికి పిచ్చి ప్రేమ. ఇలాంటి పరిస్థితుల్లో కరుణ ఆగడాలను అరికట్టడానికి మీసాల రాజు (శత్రు) ఆ ప్రాంతానికి పోలీస్ అధికారిగా వస్తాడు. అయితే మీసాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే పోలీస్ అధికారి మీసాల రాజు మీసాలను కొందరు బలవంతంగా తీసేస్తారు..

    కొరమీను కథలో ట్విస్టులు

    కొరమీను కథలో ట్విస్టులు

    మీసాల రాజు మీసాలను ఎవరు తీసేశారు? తన మీసాలను తీసేసింది ఎవరనే విషయాన్ని మీసాల రాజు తెలుసుకొన్నాడా? తన మీసాలను తీసేసిన వ్యక్తిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకొన్నాడు? తాను ప్రేమించే మీనాక్షి.. కరుణను ఇష్టపడి సర్వం సమర్పించుకొన్న తర్వాత కోటి పరిస్థితి ఏమిటి?
    ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే కరుణ తనను మోసం చేస్తే మీనాక్షి ఏం చేసింది? కరుణ మోసానికి గురైన మీనాక్షిని కోటి ఆదరించాడా? తన ప్రేమకు, జీవితానికి అడ్డు ఉన్న కరుణను కోటీ ఎలా అడ్డు తొలగించుకొన్నాడు? జాలరీపేట ప్రాంతానికి మీసాల రాజు ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేయించుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే కొరమీను సినిమా కథ.

    సినిమా ఎలా ఉందంటే?

    సినిమా ఎలా ఉందంటే?

    జాలరీపేటకు వచ్చిన మీసాల రాజు మీసాలు తీసేయడంతో కథ కొంత ఫన్‌గా, మరికొంత ఎమోషనల్ నోట్‌తో ప్రారంభమవుతుంది. కరుణ అరాచకాలు, అక్కడి ప్రజల జీవనవిధానం ఆసక్తికరంగా తెరకెక్కించడంతో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసేలా చేస్తుంది. కరుణ, మీనాక్షి, అలాగే కోటి, మీనాక్షి మధ్య నడిచే డ్రామా, సన్నివేశాలను ఎలివేట్ చేసే డైలాగ్స్ ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తాయి.

    ప్రతీ సన్నివేశాన్ని హైలెట్ అయ్యేలా మూవీని నడిపించడంతో ఎదో మంచి కథ, ఫీల్‌తో సినిమా ఉండబోతుందనే విషయం సినిమా ఆరంభమైన కొద్ది సేపట్లోనే తెలుస్తుంది. అయితే చక్కటి ట్విస్టుతో ఫస్టాఫ్‌ ముగించి సెకండాఫ్‌‌పై క్యూరియాసిటీని పంచేలా చేయడంలో దర్శకుడు శ్రీపతి కర్రి, కథకుడు ఆనంద్ రవి సక్సెస్ అయ్యాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథను డీల్ చేసిన విధానం ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉందనిపిస్తుంది. అయితే చివరి 30 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చాయని చెప్పవచ్చు.

    ఆనంద్ రవి, కిషోరి దాత్రక్ ఫెర్ఫార్మెన్స్

    ఆనంద్ రవి, కిషోరి దాత్రక్ ఫెర్ఫార్మెన్స్

    కొరమీను సినిమాకు రచయితగా, డైలాగ్ రైటర్‌గానే కాకుండా హీరో ఆనంద్ రవి కోటి పాత్రలో ఒదిగిపోయాడు. అండర్ డాగ్ క్యారెక్టర్‌ను తన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా చక్కగా డిజైన్ చేసుకొన్నాడనిపిస్తుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో హావభావాలు పలికించిన విధానం బాగుంది. మీనాక్షి‌తో సన్నివేశాలు, అలాగే కరుణను ఎదురించే సీన్లలో బాడీ లాంగ్వేజ్ బాగుంది.

    ఇక మీనాక్షి పాత్రలో కిషోరి ధాత్రక్ అద్బుతమైన నటనను ప్రదర్శించింది. మొదటి సినిమాలోనే ఫెర్ఫార్మెన్స్ పరంగా వేరియేషన్స్ పలకించింది. బాగా అనుభవం నటిగా తన పాత్రను తెర మీద పండించింది. భవిష్యత్‌లో మంచి నటిగా మారేందుకు కావాల్సిన టాలెంట్ ఉందని ఈ పాత్ర ద్వారా నిరూపించుకొన్నది.

     శత్రు, హరీష్ ఉత్తమన్, ఇతరుల గురించి

    శత్రు, హరీష్ ఉత్తమన్, ఇతరుల గురించి

    ఇక పోలీస్ ఆఫీసర్‌గా శత్రు డిఫరెంట్ రోల్‌లో మరోసారి విజృంభించాడు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషిస్తాడనే అభిప్రాయాన్ని మరోసారి కలిగిస్తాడు. ఇక కరుణ పాత్రలో హరీష్ ఉత్తమన్ మళ్లీ ఫెంటాస్టిక్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. పలు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రతో సినిమాకు బ్యాన్ ‌బోన్‌గా నిలిచాడు. రాజా రవీంద్ర ఎమోషనల్ పాత్రతో ఆకట్టుకొన్నాడు. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. హీరోగానే కాకుండా రచయితగా, డైలాగ్ రైటర్‌గా ఆనంద్ రవి తన పెన్ పవర్ చూపించాడు. ఈ సినిమాకు సిద్దార్థ్ సాదాశివుని అందించిన బీజీఎం స్పెషల్ ఎట్రాక్షన్. పలు సీన్లు హార్ట్ టచింగ్‌గా చిత్రీకరించడంలో సినిమాటోగ్రాఫర్ కార్తీక కొప్పెర, మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఎడిటర్ విజయ్ వర్ధన్ పనితనం, అనంత నారాయణన్ సాహిత్యం సినిమాకు బలంగా మారాయి. సినిమాను చక్కటి నేటివిటీ సినిమాగా మార్చడంలో నిర్మాత పెళ్లకూరుసమన్యరెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను పరిమిత బడ్జెట్‌తో కూడా రిచ్‌గా అందించిన తీరు చూస్తే .. సినిమాపై టీమ్‌కు అభిరుచి తెలియజేస్తుంది.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    కొరమీను సినిమా సముద్ర తీర ప్రాంతంలో పెనువేసుకొన్న పరిస్థితుల బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన పక్కా నేటివిటి సినిమా. బలమైన ప్రత్యర్థిని ఓ సామాన్యుడు ఎదుర్కొనే అండర్ డాగ్ చిత్రం. ప్రేమ, ఎమోషన్స్, యాక్షన్, సాహిత్యం పుష్కలంగా ఉన్న సినిమా అని చెప్పవచ్చు. శ్రీపతి కర్రి టాలెంట్, శత్రు, హరీష్ ఉత్తమన్, అలాగే కిషోరి ధాత్రక్ యాక్టింగ్ ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయని చెప్పవచ్చు. వీకెండ్‌లో రంగస్థలం, ఉప్పెన తదితర నేటివిటి సినిమాల ఫీల్ పొందడానికి కొరమీన్ చూడవచ్చు. అంచనాల లేకుండా వెళితే మంచి అనుభూతిని పక్కగా పంచుతుంది.

    English summary
    Anand Ravi's latest writing is Korameeenu. Directed by Sripati Karri. This movie hits the silverscreens on December 31st. In thi ocaasion, Telugu filmibeat brings Exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X