Kota Bommali PS Review పాలిటిక్స్‌పై సెటైర్స్‌తో ఓటు విలువ చెప్పే.. కోట బొమ్మాళి సినిమా రివ్యూ
Rating: 2.75/5
నటీనటులు: శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్, మురళీ శర్మ, దయానంద్ రెడ్డి, విష్ణు ఓఐ తదితరులు
దర్శకత్వం: తేజ మార్ని
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పిడి
మ్యూజిక్: మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్
సినిమాటోగ్రఫి: జగదీష్ చీకటి
ఎడిటింగ్: కార్తీకా శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నాదికుడికర్
బ్యానర్: గీతా ఆర్ట్స్ 2 (GA2)
రిలీజ్ డేట్: 2023-11-24
టెక్కలి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో కోట బొమ్మాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఊహించని సంఘటనలు చోటు చేసుకొంటాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బరిసెల జయరాం (మురళీ శర్మ) వర్గానికి చెందిన రాజారావు (విష్ణు ఓఐ) అనే కార్యకర్త రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. తమ పోలీస్ జీపు ఎదురుగా వచ్చి రోడ్డుపై పడి ఉన్న రాజారావును హాస్పిటల్‌కు ఎస్ఐ రామకృష్ణ (శ్రీకాంత్), కానిస్టేబుల్స్ కుమారి, రవి (శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్) తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే అతడు మరణిస్తాడు. అయితే విష్ణును ఆ ముగ్గురే చంపారని పార్టీ కార్యకర్తలు ఆరోపణలు చేయడంతో వారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్దమవుతారు.

విష్ణు అనే కార్యకర్త మరణానికి అసలు కారణం ఏమిటి? సహాయం చేయబోయిన సమయంలో హత్య కేసు తమ మీద పడటంతో రామకృష్ణ, రవి, కుమారి ఏం చేశారు? ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడానికి రజియా ఆలీ (వరలక్ష్మీ శరత్ కుమార్) ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ఈ ముగ్గురిలో రామకృష్ణను ఎమ్మెల్యే ఎందుకు టార్గెట్ చేశాడు? రామకృష్ణను సొంత కూతురు ఎందుకు అసహ్యించుకొంది? పోలీసులు వెంటాడుతున్న సమయంలో చివరకు రామకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? రామకృష్ణ నిర్ణయం రజియా అలీకి ఎలాంటి చేదు అనుభవాన్ని మిగిల్చింది అనే ప్రశ్నలకు సమాధానమే కోటబొమ్మాళి సినిమా కథ.

కోట బొమ్మాళి సినిమా విషయానికి వస్తే మలయాళంలో అవార్డు విన్నింగ్ సినిమా నాయట్టు ఆధారంగా రూపొందింది. అయితే మలయాళ మాతృకను తెలుగు నేటివిటికి అనుగుణంగా పూర్తిగా మార్చి వేసి.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంగా సినిమాను తెరకెక్కించారు. అయితే స్క్రిప్టును దర్శకుడు తేజ మార్ని డీల్ చేసిన విధానం, పాత్రలను భావోద్వేగంగా మలిచిన విధానంతోనే సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌లో డిటేయిలిటీ ఎక్కవ కావడంతో కొంత స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో కథను గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్ చెప్పిన తీరు వల్ల కొన్ని సీన్లు ఉద్దేగానికి గురిచేసేలా ఉన్నాయి.
నటీనటులు విషయానికి వస్తే.. రామకృష్ణగా శ్రీకాంత్ మేక అద్బుతంగా తన పాత్రను పోషించాడు. పాత్ర తీరును బట్టి అత్యంత సహజమైన రీతిలో హావభావాలను ప్రదర్శిస్తూ మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. సినిమా భారాన్నంతా తన భుజాలపై మోశాడనే చెప్పాలి. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ తమ పాత్రలతో సినిమాకు బలంగా మారడమే కాకుండా చక్కగా ఒదిగిపోయారు. మురళీశర్మ సాఫ్ట్ విలనిజాన్ని తనదైన శైలిలో పండిచారు. సెటైర్లు, బయటకు కనిపించిన క్రూరత్వాన్ని పాత్ర ద్వారా ప్రదర్శిస్తూ ఆకట్టుకొన్నారు. మరోసారి పోలీస్ అధికారిగా రజియా అలీ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. మిగితా పాత్రల్లో కనిపించిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ విభాగాలు ఈ సినిమాకు కీలకంగా మారాయి. దట్టమైన అడవుల్లో ఎన్‌కౌంటర్, చేజింగ్ సన్నివేశాలను జగదీష్ చీకటి అద్బుతంగా చిత్రీకరించారు. లింగిడి పాట రిలీజ్‌కు ముందే సెన్సేషన్ కావడంతో మంచి క్రేజ్ కనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సన్నివేశాలను ఎమోషనల్‌గా మార్చింది. జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాసు, విద్య అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.


Click it and Unblock the Notifications











