twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kotha Kothaga movie review ఫీల్‌గుడ్ లవ్ స్టోరి కొత్త కొత్తగా.. నూతన నటీనటుల మంచి ప్రయత్నం!

    |

    న‌టీన‌టులు: అజయ్, వీర్తి వఘాని, ఆనంద్, కాశీ విశ్వనాధ్, తులసి, కల్యాణి నటరాజన్, పవన్ తేజ్, ఈ రోజుల్లో సాయి త‌దిత‌రులు
    దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి
    నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర
    బ్యానర్: ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్
    స‌మ‌ర్పకులు: బీజీ గోవిందరాజు
    సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
    ఎడిటర్: ప్రవీణ్ పూడి
    సినిమాటోగ్రఫి: వెంకట్
    ఫైట్ మాస్టర్: పృధ్వీ శేఖర్
    ఆర్ట్ డైరెక్టర్: సురేష్ భీమగాని
    రిలీజ్ డేట్: 2022-09-09

    సిద్దూ (అజయ్), రాజీ అలియాస్ రాజ రాజేశ్వరి దేవి (వీర్తి వఘాని) కలిసి ఇంజనీరింగ్ ఒకే కాలేజీలో చదువుకొంటుంటారు. రాజీని చూసి సిద్దూ తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే చిన్నతనంలోనే ఓ సంఘటన కారణంగా ప్రేమ అంటే అయిష్టంతో ఉంటుంది. ఇదిలా ఉండగా.. రాజీ అన్నయ్య కేశవ్ (అనిరుధ్) తన చెల్లికి పెళ్లి సంబంధాలు చూస్తూ.. తన బామ్మర్ధి రామ్‌తో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేస్తారు. ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ తర్వాత ప్రాణం కంటే ఎక్కువగా రామ్ తనను ప్రేమిస్తాడని రాజీ తెలుసుకొంటుంది. పెళ్లికి పది రోజుల ముందు రాజీ, అజయ్ శారీరకంగా కలిసి విషయం కుటుంబంలో తెలుస్తుంది.

     Kotha Kothaga movie review and rating

    ప్రేమ, అఫైర్స్ అంటే రాజీకి ఎందుకు అయిష్టం ఏర్పడింది? అజయ్ ప్రేమను ఎందుకు తప్పుగా రాజీ అర్ధం చేసుకొన్నది. ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ తర్వాత రాజీ శీలాన్ని రామ్ ఎందుకు అవమానించాడు? ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ తర్వాత అజయ్ ప్రేమ కోసం రాజీ ఎందుకు మనసు మార్చుకొన్నది. రాజీ, అజయ్‌ ఒకరికొకరు చేరువైన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురుపడ్డాయి? పెళ్లికి ముందు అజయ్‌తో శారీరకంగా కలిసిందని తెలిసిన రాజీ తల్లి ఎలా రియాక్ట్ అయింది? చివరకు రాజీ పెళ్లి రామ్ (పవన్ తేజ్) తో జరిగిందా? లేదా అజయ్‌తో జరిగిందా అనే ప్రశ్నలకు సమాధానమే కొత్త కొత్తగా సినిమా కథ.

     Kotha Kothaga movie review and rating

    ఇద్దరు ప్రేమికుల మధ్య విభేదాలు, అపార్థాలు, మూడో వ్యక్తి తమ ప్రేమలోకి రావడం లాంటి అంశాల చుట్టే ప్రేమ కథలు తిరుగుతుంటాయి. ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమ ఫలించి ఎలా పెళ్లి వరకు వచ్చాయనే పాయింట్ కొత్తగా చెప్పడమే కత్తిమీద సాము. అలాంటి పాయింట్‌తో దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి రెగ్యులర్ లవ్ స్టోరిని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. అంతా ఊహించినట్టే జరిగే ప్రేమకథను ఆసక్తికరంగా చెప్పడంలో తన ప్రతిభను చాటుకొన్నాడు. దర్శకుడు ఇంకా కొన్ని సన్నివేశాలను ఎమోషనల్‌గా చెప్పి ఉంటే డిఫినెట్‌గా చిన్న చిత్రాల్లో మంచి ప్రేమకథా చిత్రమై ఉండేదనిపిస్తుంది.

    ఇక నటీనటుల విషయానికి వస్తే.. సిద్దూగా అజయ్, రాజీగా వీర్తి వఘాని కొత్తవాళ్లైనా అనుభవం ఉన్న యాక్టర్లుగా తమ ప్రతిభను తెరపైన చాటుకొన్నారు. కీలక సన్నివేశాల్లో మెచ్యురిటీతో నటించారు. పాటలు, రొమాంటిక్ సీన్లలో ఆకట్టుకొన్నారు. అజయ్, రాజీ మధ్య కెమిస్ట్రీని దర్శకుడు కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రులుగా ఆనంద్, కల్యాణి నటరాజన్, కాశీ విశ్వనాథ్, తులసి కథకు, సన్నివేశాలకు తగినట్టు నటించారు. అన్నగా కేశవ్, పవన్ తేజ్ ఒకే అనిపించారు.

    కొత్త కొత్తగా సినిమాకు కంటెంట్, నటీనటుల పెర్ఫార్మెన్స్ కంటే మొదటి నుంచి సాంకేతిక అంశాలే బలంగా నిలిచాయి. శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ ఆల్బమ్ ఈ మధ్య కాలంలో అందర్ని ఆకట్టుకొన్నది. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ప్రియతమా పాట వైరల్ అయింది. ఈ సినిమా కోసం అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, శ్రీమణి లాంటి ప్రముఖులు సాహిత్యాన్ని అందించారు. డైమండ్ రాణి లాంటి పాటలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఇక పాటలకు హరి కిరణ్ మంచి కొరియోగ్రఫిని అందించారు. ప్రేమకథకు కావాల్సిన ఫీల్‌గుడ్ వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ వెంకట్ అందించారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి సన్నివేశాలను చకచకా పరుగులు పెట్టించారు.

    కొత్త కొత్తగా చిత్రాన్ని నిర్మాతలు మురళీధర్, గోవిందరాజు రాజీ లేకుండా నిర్మించారు. అయితే కొన్ని పాత్రలకు పేరున్న నటీనటులను ఎంచుకొంటే సినిమాకు రీచ్ మరింత పెరిగి ఉండేదనిపిస్తుంది. రిచ్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానం సినీ నిర్మాణంపై వారికి ఉన్న అభిరుచిని తెలియజెప్పింది.

    నూతన నటీనటులు హీరో, హీరోయిన్లుగా నటించిన ప్రేమ కథా చిత్రం కొత్త కొత్తగా. ఫీల్ గుడ్ ప్రేమకథగా అందించే ప్రయత్నం చేశారు. పాటలు, సాహిత్యం, డైలాగ్స్, నటీనటులు పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్‌గా మారింది. మంచి చిత్రాన్ని అందించాలని ప్యాషన్‌తో నిర్మాతలు ఈ సినిమాను అందించారు. పాటలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఎలాంటి అంచనాల లేకుండా వెళితే.. చిన్న బడ్జెట్ చిత్రాల్లో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, లవ్ స్టోరిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

    English summary
    Kotha Kothaga movie is love story which released on September 09th. Here is the Telugu filmibeat exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X