Kotha Malupu Movie Review: కొత్త మలుపు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

చిత్రం: కొత్త మలుపు

నటీనటులు: ఆకాష్ గోపరాజు, భైరవి ఆర్థ్యా, రఘుబాబు, 30 ఇయర్స్ పృథ్వీ, ప్రభావతి, సిద్ధు, కిట్టయ్య, మహేందర్, ఐశ్వర్య తదితరులు
దర్శకత్వం: శివ కేసనకుర్తి
నిర్మాత: తాటి బాలకృష్ణ
సమర్పణ: మునుగాల అనూష
సంగీతం: యశ్వంత్ నాగ్
సినిమాటోగ్రఫి: సుమంత్ కచర్ల, జవహర్ రెడ్డి
ఎడిటింగ్: శివ శర్వాణి
ఆర్ట్: ఉత్తమ్ కుమార్
బ్యానర్: తథాస్తు క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2026-06-12

హైదరాబాద్‌లో లైఫ్‌ను హ్యాపీగా లీడ్ చేస్తూ సరదాగా ఫ్రెండ్స్‌తో గడిపే ఈ తరం అబ్బాయి కమల్ (ఆకాశ్). మ్యారేజ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామానికి వెళ్తాడు. ఆ పెళ్లి కార్యక్రమంలో హడావిడి చేసే వరలక్ష్మీ (భైరవీ ఆర్ధ్యా)ను చూసి ఆకర్షణకు లోనవుతాడు. అక్కడ ఓ రాత్రి కమల్‌కు అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆ సమయంలో ఓ అపరిచిత యువతి ఆయనకు అండగా ఉంటుంది. అయితే తనకు సహాయం చేసిన ఆ అమ్మాయి ఎవరై ఉంటారని వెతకడం మొదలు పెడుతాడు. ఆ వెతుకులాటలో వరలక్ష్మీ కూడా భాగమవుతుంది. ఈ ప్రాసెస్‌లో కమల్, వరలక్ష్మీ ఒకరికొకరు దగ్గరై ఆ బంధం ప్రేమగా మారుతుంది. అయితే తనను అండగా నిలిచిన అమ్మాయి వరలక్ష్మీనే అని కమల్‌కు తెలుస్తుంది. అయితే అప్పటికే వరలక్ష్మీ మరో యువకుడితో సన్నిహితంగా ఉన్న ఫోటో కమల్‌కు లభిస్తుంది. దాంతో కమల్‌లో ఓ రకమైన అనుమానం చోటు చేసుకొంటుంది. దాంతో వారిద్దరి మధ్య అపోహలు, అపార్ధాలు చోటు చేసుకొంటాయి.

Kotha Malupu Movie Review

కమల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు? పెళ్లిలో వరలక్ష్మితో పరిచయం ఎలా సాగింది? మ్యారేజ్ ఈవెంట్‌లో కమల్ ఎలాంటి అవమానాలను ఎదుర్కొంటాడు? పెళ్లిలో కమల్‌కు చేదు సంఘటన ఎదురైనప్పుడు అతడికి అండగా నిలిచిన వరలక్ష్మీ దానిని ఎందుకు గోప్యంగా ఉంచుతుంది? అపరిచిత యువతి కోసం కమల్ వెతుకుతున్నప్పుడు తానే ఆ అమ్మాయి అని ఎందుకు చెప్పలేకపోయింది? కమల్, వరలక్ష్మీ మధ్య పరిచయం ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమగా మారింది. వరలక్ష్మీతో సన్నిహితంగా ఉన్న యువకుడు ఎవరు? వరలక్ష్మీ, కమల్ మధ్య ఎలాంటి అపోహలు చోటు చేసుకొన్నాయి? వాటిని ఇద్దరు ఎలా పరిష్కరించుకొన్నారు? చివరకు వారిద్దరు తమ ప్రేమ బంధానికి ఎలాంటి ముగింపును ఇచ్చారు? అనే ప్రశ్నలకు సమాధానమే కొత్త మలుపు సినిమా కథ.

ప్రేమికుల మధ్య అపోహలు, అపార్ధాలు అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చినప్పటికీ.. కొత్త మలుపు సినిమా కథను డిఫరెంట్‌గా చెప్పాలనే ప్రయత్నం దర్శకుడు శివ కేసనకుర్తిలో కనిపిస్తుంది. కొత్తగా లవ్ స్టోరీలను చెప్పగలిగితే ప్రేక్షకులు ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్ దర్శకుడిలో కనిపించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. పాత్రల పరిచయం, స్టోరీని ఎస్టాబ్లిష్‌మెంట్ విషయంలో రెగ్యులర్, రొటీన్‌గా మొదలుపెట్టినప్పటికి.. గోదావరి అందాల నడుమ చూపించిన సన్నివేశాలు ఫీల్‌గుడ్‌గా అనిపిస్తాయి. అసలు కథను చెప్పడానికి కొంత ఎక్కువ సమయం తీసుకొన్నప్పటికీ.. స్టోరీలోకి వెళ్లిన తర్వాత తన ప్రతిభను చాటుకోవడంలో సక్సెస్ అయ్యారు. కామెడీ, ఫన్, ఎమోషన్స్, లవ్ సీన్లను చక్కగా రాసుకొన్నాడు. సన్నివేశాలకు తగినట్టుగా డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఫస్టాఫ్ కొంత స్లోగానే సాగినప్పటికీ.. సరదాగా ముగుస్తుంది.

సెకండాఫ్‌లో లీడ్ క్యారెక్టర్ల మధ్య మానసిక సంఘర్షణను చక్కగా చూపించగలిగారు. ప్రతీ ఒక్కరి జీవితంలో గతం ఉంటుంది. ప్రస్తుత కాలంలో దానిని పట్టించుకోకుండా ఉంటే.. భవిష్యత్ సవ్యంగా సాగిపోతుంది. గతాన్ని తవ్వుకొంటే జీవితం గందరగోళంగా మారే ప్రమాదం ఉందనే పాయింట్ చుట్టు రాసుకొన్న తీరు, ఆ పాయింట్‌ను తెర మీద చెప్పిన తీరు బాగుంది. ఓవరాల్‌గా ఫర్వాలేదనిపించే లవ్ స్టోరీని ప్రజెంట్ చేశారని చెప్పవచ్చు.

ప్రముఖ సింగర్ సునీత కుమారుడిగా పరిచయమైన ఆకాశ్ గోపరాజు ఇప్పటికే తన తొలి సినిమాతో విమర్శకులు, సినీ వర్గాలు, ప్రేక్షకుల మెప్పు పొందడం తెలిసిందే. ఈ సినిమాలో కమల్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. తొలి చిత్రం కంటే బెటర్‌గా పెర్ఫార్మెన్స్ చేశాడు. ముఖ్యంగా యాక్టర్‌గా ఓ కాన్ఫిడెన్స్ కనిపించింది. వరలక్ష్మీ విషయానికి వస్తే.. నటనకు కొత్త అయినప్పటికీ.. స్క్రీన్‌పై చాలా నేచురల్‌గా బిహేవ్ చేసింది. గ్రామీణ యువతి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఈ చిత్రంలో మిగితా పాత్రల్లో నటించిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. పల్లె అందాలను తెర మీద ఫీల్ గుడ్‌గా కనిపించాయి. సుమంత్ కచర్ల, జవహర్ రెడ్డి అన్ని రకాల ఎమోషన్స్‌ను బాగా క్యాప్చర్ చేశారు. యశ్వంత్ నాగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు సందర్బోచితంగా ఫర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో శివ తన కత్తెరకు పదును చూపించాల్సి ఉండేదనిపించింది. తథాస్తు బ్యానర్‌, తాటి బాలకృష్ణ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫ్రెష్ పెర్ఫార్మెన్స్, లవ్ స్టోరీ చూడాలనుకొనే వారికి, అంచనాలు లేకుండా వెళితే ఈ సినిమా మంచి అనుభూతిని కలిగిస్తుంది. రెగ్యులర్ ఆడియెన్స్ ఈ వారం మీరు చూడాలనుకొనే సినిమాల జాబితాలో ఈ సినిమాను కూడా చేర్చుకోవచ్చు.

Read more about: sunitha akash
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X