ఫస్టాఫే బంగారం (కొత్త బంగారు లోకం రివ్యూ)


బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: వరుణ్ శందేష్,శ్వేతా ప్రసాద్,ప్రకాష్ రాజ్,జయసుధ,ఆహుతి ప్రసాద్,
జయసుధ,రజిత,బ్రహ్మానందం,రావు రమేష్ తదితరులు.
ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్
సంగీతం:మిక్కీ.జె.మేయర్
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
కెమెరా : ఛోటా కె.నాయుడు
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం:శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: దిల్ రాజు
రిలీజ్ డేట్: 09 అక్టోబర్ 2008
తేజ పుణ్యమాని టీనేజి లవ్ స్టోరీ సినిమాలు లోటు తెలుగు వారికి అసలు లేదు. అయితే ఆయన సినిమాల్లో సందేశం ఉండదని ఫీలయి అది కలుపుతూ తీసినట్లున్న ఉంటుందీ ఈ కొత్త బంగారు లోకం. ఇక ఫస్టాఫే బంగారం అనిపించే ఈ సినిమాలో సెకెండాఫ్ డ్రాగ్ అవటం జరిగింది. అందులోనూ బలవంతంగా సందేశం చొప్పంచటానికి ప్రయత్నించటం,కథకు సంభంధం లేని క్లైమాక్స్ ట్విస్ట్ మైనస్ గా నిలుస్తాయి. అయితే బ్యానర్ వ్యాల్యూ,హిట్టయిన సాంగ్స్, హ్యాపీడేస్ ప్లేవర్,కాలేజీ సన్నివేశాలు,విపరీతమైన పబ్లిసిటీ, అసభ్యత లేకపోవటం, ఈ సినిమాకు ప్లస్ లుగా నిలుస్తాయి.
కొడుకుని విపరీతంగా ప్రేమించే కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు బాలు(వరుణ్ సందేష్). కూతుర్ని అతి జాగ్రత్తగా పెంచుతున్న ఫ్యామిలీనుండి వచ్చిన అందాల అమ్మాయి స్వప్న(శ్వేతా ప్రసాద్). ఇద్దరూ ఇంటర్ కోసం ఒకే రెసిడెన్షియల్ కాలేజీలో జాయిన్ అవుతారు. అయిందే తడువుగా వారిద్దరకీ రాసిపెట్టి ఉన్నట్లు ప్రేమలో పడతారు.ఈ విషయం తెల్సిన స్నప్న తండ్రి( ఆహుతి ప్రసాద్) ఊరుకుంటాడా...కూతుర్ని ఇంటిలోనే బంధించి విడతీయాలని ప్రయత్నిస్తాడు. మరి యువ హృదయాలు కలవకుండా ఆగుతాయా...అంటే సినిమా చూడాల్సిందే.
అసలు ఈ సినిమా కథ హ్యాపీడేస్ లాంటి ప్లేవర్ తో ఫస్టాఫ్ పూర్తి చేసి ప్రేమిస్తే లాంటి సంఘటనలతో సెకండాఫ్ నడుపుదామనకున్నప్పుడే సగం ప్లాబ్లం ప్రారంభమయ్యింది. ఎందుకంటే కాలేజి జీవితాన్ని ఉషారుగా చూపే పాప్ కార్న్ మోడ్ లో సాగ్ హ్యాపీడేస్ లో సంఘటనలకీ, ఉన్నదున్నట్లుగా వాస్తవంగా సన్నివేశాలతో నడిచే ప్రేమిస్తేని ముడి పెట్టడం చాలా కష్టం . అయినా ఈ స్కీమ్ ఫాలో కావటంతో సెకండాఫ్ లో హీరో,హీరోయిన్స్ కలిసే సన్నివేశాలే అసలు కథలో లేకుండా పోయాయి. దాంతో అప్పటి వరకూ వారి స్వీట్ రొమాన్స్ ని ఎంజాయి చేసిన ప్రేక్షకుడు హఠాత్తుగా కథ ఇలా డ్రైగా మారటం జీర్ణించుకోలేని విషయం. అలా కాకుండా తేజ రెగ్యులర్ నువ్వు-నేను,జయం స్కీమ్ వెళ్ళి పోయి టీనేజ్ ప్రేమ కథను అందర్ని ఎదిరించి పూర్తిగా గెలిపించే ప్రయత్నం చేసినే సమస్య లేకుండా పోయేది. అలా కాకుండా సందేశం చెప్పాలి...మరో ప్రక్క టీనేజ్ ప్రేమకథను చూపాలనే ప్రయత్నం చేయటం వల్లనే ఈ ప్రమాదం వచ్చింది.
దాంతో అసలు దర్శక,రచయిత ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అన్న క్లారిటీని ప్రేక్షకుడుకి అందించటం మిస్సవటం జర్గింది. అదే ఇదే బ్యానర్ లో గతంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమాలో ఫస్ట్ సీన్ లోనే మా సినిమా తండ్రి కొడుకుల సమస్య అని స్పష్టం చేస్తాడు. అలాగే ఈ సినిమాలో దర్శకుడు ఫాలో అయిన ప్రేమిస్తే లోనూ ఫస్ట్ సీన్ లోనే ప్రపంచం ఇంకా తెలియని ప్రేమజంట లేచిపోవటం తో ప్రారంభించి ఓ పిచ్చివాడిని చూపి చివరకు ఇలాగే కథ ముగుస్తుంది...రియలిస్టిక్ ఎప్రోచ్ ఉన్న సినిమా అని హింట్ దర్శకుడు ఇస్తాడు. అలాగే ఈ దర్శకుడు మనసు పడ్డ మరో సినిమా మరో చరిత్ర (హీరో హీరోయిన్ల పేర్లు స్వప్న,బాలు) సినిమాలో నూ కథ ఓ పాత కాలం బిల్డింగ్ పై ఓపెన్ చేసి ఇది ఓ విషదాంత ప్రేమకథ అని చెప్పి ఫాలో అవ్వమంటాడు. ఆ చిత్రంలో హైలెట్ గా నిలిచే మన మధ్య ఉన్నది ఆకర్షణా,ప్రేమ అన్న విషయం తేల్చుకోవాలి అన్న పాయింట్ ని తీసుకున్న దర్శకుడు ఈ క్లారిటీని తన సినిమాలో మిస్సయ్యాడు.
ఇక ఈ సినిమాలో హైలెట్స్ లేవా అంటే ఫస్టాఫ్ లో జరిగే కాలేజి సన్నివేశాలు బోల్డు కనిపిస్తాయి. అలాగే హీరోయిన్ పొట్టిగా ఉన్న ఎక్సెప్రెషన్స్ ఇవ్వటంలో గట్టిగా ఉంది. వరుణ్ సందేష్ అయితే సిద్దార్ధ అందుబాటులో లేని వారికి ఆ లోటు తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రకాష్ రాజ్,జయసుధ ఏ సినిమాలో చేసినా అదే క్యారెక్టరైజేషన్. ఆహుతి ప్రసాద్ చందమామ సినిమా నుండి వెస్ట్ గోదావరి స్లాంగ్ ని అదరకొడుతున్నాడు. ఇక కొత్త వారి నుంచి మంచి నటన రాబట్టుకున్న దర్శకుడు మంచి స్క్రిప్టు ని రూపొందించుకుంటే నిలబడతాడని ఎవరికైనా అనిపిస్తుంది. నిర్మాతగా దిల్ రాజు సినిమాకు లోటు చేసినట్లు కనపడదు.
యేదైమైనా యూత్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రం వారు మెచ్చితేనే నిలబడుతుందనేది నిజం. అయితే వచ్చే వారం తేజ కేక సినిమా రిలీజ్ ఉంది. అదీ యూత్ ని టార్గెట్ చేసిందే.దాని స్టామినా మీద (అంటే యూత్ కి అది పడితే ఇది కష్టమే) దీని భవిష్యత్ ఆధారపడుతుంది. అయితే దసరా శెలవుల ఎఫెక్టుతో మంచి ఓపినింగ్స్ వచ్చాయి. అవి ఎంత కాలం నిలబడతాయన్నది తేలాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఇక ఆసక్తి ఉన్నవారు ఫస్టాఫ్ చూసి వచ్చేస్తేనే హాయిని పిస్తుంది.


Click it and Unblock the Notifications











