Kothapallilo Okappudu Movie Review: కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: మనోజ్ చంద్ర, రవీంద్ర విజయ్, బెనర్జీ, బాబూమోహన్, మోనిక టీ, ఉషా బానెల, ప్రవీణ పరుచూరి తదితరులు
దర్శకత్వం: ప్రవీణ పరుచూరి
నిర్మాతలు: గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి
సమర్పణ: రానా దగ్గుబాటి
మ్యూజిక్: మణిశర్మ, వరుణ్ ఉన్ని
సినిమాటోగ్రఫి: పెట్రో ఆంటోనియాడిస్
ఎడిటర్: కిరణ్ ఆర్
బ్యానర్: పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్
రిలీజ్ డేట్: 2025-07-18

కొత్తపల్లి అనే గ్రామంలో జల్సా తిరిగే రామకృష్ణ (మనోజ్ చంద్ర) అనే యువకుడు.. వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజల్నీ పీడించే అప్పన్న (రవీంద్ర విజయ్) వద్ద పనిచేస్తుంటాడు. అదే ఊరిలో ఉండే గ్రామ పెద్ద రెడ్డి (బెనర్జీ)కి అప్పన్నకు మధ్య చిన్న తగాదాలు ఉంటాయి. రెడ్డి కూతురు సావిత్రి (మోనిక టీ)పై రామకృష్ణ మనసు పారేసుకొంటాడు. కానీ గిరిజన యువతి ( ఉషా బానెల)తో రామకృష్ణకు బలవంతంగా పెళ్లి జరిపించాలని రెడ్డి ప్రయత్నిస్తే అప్పన్న కాపాడుతాడు. అయితే ఎవరూ ఊహించని పరిస్థితుల్లో మరణించిన అప్పన్నను గ్రామస్థులంతా దేవుడిగా పూజించడం మొదలుపెడుతారు.

Kothapallilo Okappudu Movie Review

అప్పన్న చేసే అరాచకాలను రామకృష్ణ ఎలా అడ్డుకొనే ప్రయత్నం చేశాడు? రెడ్డి, అప్పన్న మధ్య తగాదాలకు కారణం ఏమిటి? గిరిజన యువతిని రామకృష్ణకు ఎందుకు పెళ్లి చేయాలని రెడ్డి తీర్పు ఇస్తాడు? రామకృష్ణ పెళ్లిని అప్పన్న ఎలా అడ్డుకొంటాడు? అప్పన్న ఆకస్మిక మరణానికి కారణం ఏమిటి? వడ్డీ పేరుతో పీడించే అప్పన్నను గ్రామస్థులు ఎందుకు దేవుడిగా కొలిచారు? అప్పన్నను దేవుడిగా కొలవడం చూడలేని రెడ్డీ ఏం చేశాడు? దానికి రామకృష్ణ సహకరించాలని తీసుకొన్న నిర్ణయానికి పరిష్కారం ఏం లభించింది? అప్పన్నను దేవుడిగా కొలిచే విషయంలో గ్రామస్థుల నమ్మకం సడలిందా? అనే ప్రశ్నలకు సమాధానమే కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా కథ.

కేరాఫ్ కంచరపాలెం సినిమాను అందించిన నిర్మాత ప్రవీణ పరుచూరి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రూపొందించిన చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు. ఈ సినిమా కథకు మరోసారి పక్కా గ్రామీణ కథను ఎంచుకొని.. ఆ కథకు కావాల్సిన ముడిసరుకును బాగానే ప్లాన్ చేసుకొన్నారు. క్యారెక్టర్ క్రియేషన్స్, వాటికి నటీనటుల ఎంపిక జాగ్రత్తగా బాగా చేసుకొన్నారు. కానీ కథలో వాటిని నడిపించే విధానంలోనే తడబాటుకు గురయ్యారు. కథలోను, పాత్రల స్వభావంలో క్లారిటీ లేకపోవడం మైనస్‌గా మారిందనిపిస్తుంది. ఇలాంటి కథలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. కొన్ని సన్నివేశాలు సినిమాపై ఇంట్రెస్ట్‌ను కలిగించేలా చేస్తాయి. కొన్ని సీన్లు బాగున్నాయనే ఫీలింగ్ కలిగిన వెంటనే.. మరికొన్ని సన్నివేశాల్లో డెప్ట్ లేకపోవడంతో కథ తేలిపోయినట్టు అనిపిస్తుంది. కానీ తొలి చిత్ర దర్శకురాలిగా ప్రవీణ ఫర్వాలేదనిపిస్తారు. కథ, కథనాలు, క్యారెక్టర్లను పక్కాగా డిజైన్ చేసుకొని ఉండే మరో కేరాఫ్ కంచరపాలెం అవ్వడానికి ఛాన్స్ ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటులు విషయానికి వస్తే.. రామకృష్ణగా నటించిన మనోజ్ చంద్ర, అప్పన్న పాత్ర ధారి రవీంద్ర విజయ్ ఈ సినిమాకు షో రన్నర్స్‌గా చెప్పుకోవచ్చు. అలాగే బెనర్జీ కూడా మరోసారి రా, రస్టిక్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. విలన్ టచ్ ఉన్న పాత్రను రవీంద్ర విజయ్ బాగా చేసి సినిమాను పాజిటివ్‌గా మార్చే ప్రయత్నం చేశారు. ఇక ఉషా బానెల అక్కడక్కడ తన హావభావాలతో ఆకట్టుకొన్నారు. దర్శక, నిర్మాతగానే కాకుండా ప్రవీణ పరుచూరి ఓ స్పెషల్ పాత్రలో కనిపించి ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. అంతా కొత్తవాళ్లైనా బాగా పెర్ఫార్మెన్స్‌ను చూపించారు.

కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్ పాజిటివ్ అంశాలుగా కనిపిస్తాయి. గ్రామీణ వాతావరణాన్ని పెట్రో ఆంటోనియాడిస్ తన కెమెరాలో చక్కగా బంధించడమే కాకుండా స్టోరి మూడ్‌ను క్రియేట్ చేయడంలో తన ప్రతిభను చాటుకొన్నాడు. ఇక క్లైమాక్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రూరల్ డ్రామాను ఎలివేట్ చేసే విధంగా డైలాగ్స్ బాగున్నాయి. కొన్ని అనవసరమైన సీన్లు కథ వేగానికి బ్రేక్ వేసినట్టు అనిపిస్తాయి. వాటిపై కత్తెర వేసి ఉండే సినిమా కథ మరింత సాఫీగా సాగిపోయేది. ప్రొడక్షన్ వాల్యూస్ చక్కగా ఉన్నాయి. చివరగా.. దేవుడంటే నిజమో అబద్దమో కాదు.. నమ్మకం అనేది ఈ సినిమా థిమ్ పాయింట్. కానీ ఆ నమ్మకమే కలిగించలేకపోయారు. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే.. మట్టి వాసనను చెప్పే మంచి సినిమాగా మారి ఉండేది. ఈ మూవీ హానెస్ట్ అటెంప్ట్. రూరల్ డ్రామాలను ఇష్టపడే వారు ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X