twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కౌసల్య కృష్ణమూర్తి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Kousalya Krishnamurthy Movie Review And Rating || కౌసల్య కృష్ణమూర్తి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    Rating:
    3.0/5
    Star Cast: ఐశ్వర్యా రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, కార్తీక్‌రాజు, ఝాన్సీ
    Director: భీమనేని శ్రీనివాసరావు.

    క్రీడా నేపథ్యంగా, రైతుల కష్టాల బ్యాక్‌డ్రాప్‌గా రూపొందిన చిత్రాలకు ఇటీవల దేశవ్యాప్తంగా ప్రజాదరణ దక్కుతున్నది. ఇటీవల వచ్చిన మహర్షి, జెర్సీ, మజిలీ చిత్రాలు తెలుగులో మంచి విజయాన్ని అందుకొన్నాయి. ఈ క్రమంలో రైతు సమస్యలు, క్రికెట్ అంశాలను మేలవించి రూపొందించిన చిత్రం కౌసల్య కృష్ణమూర్తి. అచ్చ తెనుగు టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్లు, టీజర్లు ప్రేక్షకుల్లో కొంత ఆసక్తిని రేపాయి. ఐశ్వర్య రాజేశ్, రాజేంద్ర ప్రసాద్, తమిళ నటుడు శివకార్తీకేయన్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశంలో ప్రధాన చర్చ జరుగుతున్న ఈ రెండు అంశాల నేపథ్యంగా వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి ఏ మేరకు ఆలరించిందంటే..

    కౌసల్య కృష్ణమూర్తి కథ

    కౌసల్య కృష్ణమూర్తి కథ

    ఆంధ్రాలోని ఓ మారుమూల ప్రాంతంలోని రైతు కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్)కు క్రికెట్, భారత జట్టు అంటే చెప్పలేనంత అభిమానం. పంట చేతికి రాక, దురదృష్టం వెంటాడటంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణమూర్తి కూతురు కౌసల్య (ఐశ్వర్య రాజేష్)ను ఓ సంఘటన కదిలించడంతో క్రికెటర్‌గా మారాలనుకొంటుంది. పల్లెటూరులో ఆడపిల్లగా క్రికెట్ ఆడేందుకు, నేర్చుకొనేందుకు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది.

    కౌసల్య కృష్ణమూర్తికి సమస్యలు ఇలా

    కౌసల్య కృష్ణమూర్తికి సమస్యలు ఇలా

    పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రైతు కృష్ణమూర్తికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తన కూతురును క్రికెటర్ చేయాలనే కలను ఎలా సాకారం చేసుకొన్నాడు. క్రికెటర్ కావాలనుకునే యువతిగా కౌసల్య కృష్ణమూర్తి ఎలాంటి చేదు అనుభవాలను ఎదురు చూసింది. క్రికెట్ కోచ్ నెల్సన్ (శివ కార్తీకేయన్) పాత్ర ఏంటీ? ఏ పరిస్థితుల్లో భారత మహిళల జట్టుకు శివ కార్తీకేయన్ కోచ్‌గా వచ్చాడనే ప్రశ్నలకు సమాధానమే కౌసల్య కృష్ణమూర్తి చిత్రం.

     ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    రైతుల సమస్యను, క్రికెటర్‌గా ఎదుగాలనుకొన్న యువతి కథను అద్భుతంగా మేలవిస్తూ రాసుకొన్న సినిమాకు స్క్రీన్ ప్లే ప్రాణంగా నిలిచిందని చెప్పవచ్చు. కథలో కనిపించే ప్రతీ మలుపులో ఎమోషనల్ పాయింట్‌ను మిస్ కాకుండా రాసుకొన్న సన్నివేశాలు ఆద్యంత భావోద్వేనికి గురిచేయడమే కాకుండా, ఆలోచింప చేసేలా ఉంటాయి. ఎమోషనల్ సీన్లతోపాటు అంతర్లీనంగా అల్లిన హాస్యం ఆరోగ్యకరంగా ఉండటం సినిమాకు ఫీల్‌గుడ్ అంశంగా మారిందని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌లో పాత్రల ఎస్టాబ్లిష్‌మెంట్, కథను సమస్యా కోణంలో నడపడం లాంటి ఫస్టాఫ్‌లో హైలెట్‌గా నిలిచాయి.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక రెండో భాగంలో కథ, కథనాల్లో భావోద్వేగత ఉట్టిపడింది. ముఖ్యంగా ఝాన్సీ పాత్రకు సంబంధించిన సీన్లు ప్రేక్షకులను ఎమోషనల్‌గా మార్చేలా ఉంటాయి. ఇక సెకండాఫ్‌లో రైతు కష్టాలు కంటతడి పెట్టించేలా తెరపైన కనిపిస్తాయి. ఇక కుటుంబ సమస్యలు, క్రీడాపరమైన సమస్యలతో నలిగిపోయే యువతి పాత్ర కట్టిపడేసేలా ఉంటుంది. ఇక శివ కార్తీకేయన్ ఎంట్రీతో సినిమా మరో లెవెల్‌కు వెళ్తుంది. క్లైమాక్స్‌లో రైతుల గురించి చెప్పిన డైలాగ్స్ ప్రతీ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తాయి.

    రీమేక్ కింగ్ భీమినేని టాలెంట్

    రీమేక్ కింగ్ భీమినేని టాలెంట్

    దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు రీమేక్ సినిమాలకు పెట్టింది పేరు. తనకున్న అనుభవంతో కౌసల్య కృష్ణమూర్తిని అన్ని వర్గాలను ఆకట్టుకొనే విధంగా తీర్చిదిద్దడంలో సఫలమయ్యాడని చెప్పవచ్చు. కథ, కథనాలను నడిపిన తీరును అతని విశేష ప్రతిభకు అద్దం పట్టింది. గత కొద్దికాలంగా ట్రాక్ మిస్ అయినట్టు కనిపించిన భీమినేని ఈ చిత్రంతో మళ్లీ విజృంభించడం ఖాయమనే పరిస్థితి కనిపించింది. ఇక యాక్టర్‌గా కూడా మంచి పరిణతిని చూపించాడు. కౌసల్య కృష్ణమూర్తిని ఫీల్‌గుడ్‌ మూవీగా మలచడంలో వందశాతం న్యాయం చేశారని చెప్పవచ్చు.

    ఐశర్య రాజేష్ టాలెంట్

    ఐశర్య రాజేష్ టాలెంట్

    యువ హీరోయిన్‌గా విభిన్నమైన పాత్రలతో తమిళ, తెలుగు రంగాల్లో ఆకట్టుకొంటున్న ఐశ్వర్య రాజేష్ కౌసల్యగా నటించింది. గ్రామీణ యువతిగా గ్లామర్‌కు చోటులేని పాత్రలతో అభినయంతో మెప్పించింది. భావోద్వేగమైన సన్నివేశాల్లో అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌ను చూపించింది. నిజమైన క్రికెటర్ అనే అంతగా పాత్రలో లీనమైంది. కీలక సన్నివేశాల్లో అనుభవం ఉన్న నటిగా కనిపించింది. చివర్లో రైతుల గురించి చెప్పిన డైలాగ్స్, చూపించిన హావభావాలు కంటతడి పెట్టించేలా ఉంది.

    శివ కార్తీకేయన్ మ్యాజిక్

    శివ కార్తీకేయన్ మ్యాజిక్

    ఇక శివ కార్తీకేయన్ కోచ్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కౌసల్య కృష్ణమూర్తి సినిమా తీరే మారిపోతుంది. అప్పటి వరకు ఫీల్‌గుడ్‌గా సాగుతున్న కథకు ఆయన మరింత ఎనర్జీని తోడు చేయడంలో సక్సెస్ అయ్యారు. శివకార్తీకేయన్ బాడీ లాంగ్వేజ్ సూపర్బ్‌గా అనిపించింది. ఎక్కువ కాకుండా.. తక్కువ కాకుండా పాత్రలోని ఇంటెన్సిటీని బ్యాలెన్స్ చేసిన తీరు అభినందనీయం. నెల్సన్ పాత్రలోని ఇంటెన్సిటి తెరపైన చూస్తేనే బాగుంటుంది. ఈ సినిమాతో శివ కార్తీకేయన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతారనడంలో ఎలాంటి సందేహాలు లేవు.

    మరోసారి రాజేంద్రప్రసాద్, ఝాన్సీ

    మరోసారి రాజేంద్రప్రసాద్, ఝాన్సీ

    ఇక ఈ సినిమాకు మరో స్సెషల్ ఎట్రాక్షన్ రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీ పాత్రలు. మరోసారి తమ అనుభవాన్ని రంగరించి తమ పాత్రలను అద్భుతంగా ఎలివేట్ చేశారు. తండ్రిగా, రైతుగా పలు కోణాలున్న పాత్రతో రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా ఆకట్టుకొన్నారు. ఇక ఆయనకు భార్యగా నటించిన ఝాన్సీ మరోసారి హంగామా చేశారు. మల్లేశం తర్వాత మళ్లీ సాధారణ మహిళ పాత్రలో జీవించారు. ఇక సీవీఎల్, వెన్నెల కిషోర్ తదితర పాత్రలు మిగితా పాత్రలకు సపోర్ట్‌గా నిలిచాయి.

     సినిమాటోగ్రఫి, ఇతర సాంకేతిక విభాగాల పనితీరు

    సినిమాటోగ్రఫి, ఇతర సాంకేతిక విభాగాల పనితీరు

    టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. పల్లె వాతావరణాన్ని ఎంత అందంగా చూపించాడో.. క్రికెట్ ఆటను కూడా అంతే అందంగా తెరకెక్కించాడు సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ. క్రికెట్ సన్నివేశాలను లైవ్‌గా చూస్తున్నామనే ఫీలింగ్‌ను కల్పించడంలో కోటగిరి వెంకటేశ్వరరావు తన ఎడిటింగ్ ప్రతిభను చూపించాడు. గెలిపిస్తానని చెప్పే వారి మాటలు ప్రపంచం వినదు. గెలిచి చూపించిన వారి మాటలు ప్రపంచం వింటుంది అంటూ హనుమాన్ చౌదరీ రాసిన మంచి డైలాగ్స్‌కు మచ్చు తునక అని చెప్పవచ్చు.

    సంగీతం, సాహిత్యం

    సంగీతం, సాహిత్యం

    ఇక పలు ఎమోషనల్ అంశాలు ఉన్న ఈ కథకు దిబు నినన్ అందించిన సంగీతం మరో పాజిటివ్ పాయింట్. రీరీకార్డింగ్ లైవ్లీగా ఉంది. పలు సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోరు ప్రాణం పోసింది. ఇక రామజోగయ్యశాస్త్రి, కృష్ణ కాంత్‌ (కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల రాసిన పాటల్లో తెలుగుదనం ఉట్టిపడింది. నిర్మాత ఏ వల్లభ సినిమాపై ఉన్న అభురుచికి అద్దంపట్టేలా నిర్మాణ విలువలు ఉన్నాయి. ఖచ్చితంగా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ ఖాతాలో మరో మంచి చిత్రమని చెప్పవచ్చు.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    కమర్షియల్ అంశాలకు ఏమాత్రం లోటు కనిపించని చిత్రం కౌసల్య కృష్ణమూర్తి. రైతు, క్రీడా అంశాలను ఆలోచింపే జేసే చిత్రమేకాకుండా.. మహిళా సాధికారితకు ఊతమిచ్చే మరో మంచి సినిమా అని చెప్పవచ్చు. నటీనటుల ప్రతిభనే ఈ సినిమాకు అత్యంత బలం. స్ఫూర్తిని రగిలించే చక్ దే ఇండియా లాంటి సినిమాలను నచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పుకుండా నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల ఆదరణ లభిస్తే తప్పకుండా కమర్షియల్ భారీ సక్సెస్‌ను సొంతం చేసుకొంటుంది.

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌ (స్పెషల్‌ రోల్‌), కార్తీక్‌రాజు, ఝాన్సీ, సీవీఎల్‌ నరసింహారావు, వెన్నెల కిశోర్‌, 'రంగస్థలం' మహేశ్‌, విష్ణు (టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు
    సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ,
    ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు,
    సంగీతం: దిబు నినన్‌,
    కథ: అరుణ్‌రాజ కామరాజ్‌,
    మాటలు: హనుమాన్‌ చౌదరి,
    పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణ కాంత్‌ (కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల,
    ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌,
    డాన్స్‌: శేఖర్‌, భాను,
    ఆర్ట్‌: ఎస్‌.శివయ్య,
    కో-డైరెక్టర్‌: బి.సుబ్బారావు,
    ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.వి.సుబ్బారావు,
    ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్‌,
    లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు,
    సమర్పణ: కె.ఎస్‌.రామారావు,
    నిర్మాత: కె.ఎ.వల్లభ,
    దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
    రిలీజ్ డేట్: 2019-08-23

    English summary
    Kousalya Krishnamurthy movie review and rating
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X