twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sembi Review: కోవై సరళ సరికొత్త నటకోణం అద్భుతంగా.. ఎమోషనల్ డ్రామాగా 'సెంబీ' చిత్రం!

    |

    Rating:
    3.0/5

    టైటిల్: సెంబి
    నటీనటులు: కోవై సరళ, బేబి నిలా, అశ్విన్ కుమార్ లక్ష్మీ కాంతన్, తంబి రామయ్య, నంజిల్ సంపత్, పళ కరుప్పయ్య తదితరులు
    సినిమాటోగ్రఫీ: ఎమ్ జీవన్
    కథ, దర్శకత్వం: ప్రభు సాల్మన్
    సంగీతం: నివాస్ కే ప్రసన్న
    నిర్మాత: అజ్మల్ ఖాన్, ఆర్ రవీంద్రన్, రేయా
    సమర్పణ: ఆర్ రవీంద్రన్ టాలెంట్ ఆర్ట్స్, ఏఆర్ ఎంటర్టైన్ మెంట్, రెడ్ జాయింట్ మూవీస్
    థియేటర్ విడుదల తేది డిసెంబర్ 30, 2022
    ఓటీటీ విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023
    ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

    తెలుగు ప్రేక్షకులకు లేడీ కమెడియన్ కోవై సరళ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె కామెడీకి తెలుగులో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఎంతో ఇష్టం. నిత్యం కమెడియన్ గా ఎంటర్టైన్ చేసిన కోవై సరళ తనలోని సరికొత్త నటన కోణాన్ని బయటపెట్టిన చిత్రం సెంబీ. 60 ఏళ్ల వయసులో బామ్మ పాత్రలో నటించిన ఆమె సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. విభిన్న చిత్రాలను డైరెక్ట్ చేసే ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన సెంబీ మూవీ డిసెంబర్ 30న గతేడాది విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి 3న ఓటీటీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!

    కథ:

    కథ:

    వీరమ్మతల్లి (కోవై సరళ) తన పదేళ్ల మనవరాలు సెంబీతో (బేబీ నిలా) కలిసి అటవీ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది. అటవీ ప్రాంతంలో దొరికే తేనే, పక్షుల గుడ్లు, పుట్ట గొడుగులు సేకరించి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. తను ఎంతో ప్రేమగా చూసుకునే మనవరాలు సెంబీని రాజకీయ నాయకుడి కొడుకు అతని ఇద్దరి ఫ్రెండ్స్ కలిసి క్రూరంగా గ్యాంగ్ రేప్ చేస్తారు. దీంతో వీరమ్మతల్లి పోలీసులను ఆశ్రయిస్తుంది. కానీ విచారణ చేపట్టిన ఎస్సై అమ్ముడుపోవడాన్ని సహించలేని ఆ బామ్మ అతన్ని తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. దీంతో వీరమ్మ తల్లి వెంట పోలీసులు, ఆ రాజకీయ నాయకులు పడతారు. మరి వీరమ్మ తల్లి తన మనవరాలి ప్రాణాలు ఎలా కాపాడుకుంది? ఆమెకు సహాయంగా ఎవరు నిలిచారు? ఈ సంఘటనపై రాజకీయం, ప్రజల భావాలు ఎలా ఉంటాయి? వీరమ్మ తల్లికి అన్ని సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నా కోర్టు ఎలాంటి ఆధారాన్ని పరిగణలోకి తీసుకుంది? అసలు సెంబీకి న్యాయం జరిగిందా? వంటి ఆసక్తిరక అంశాలు ఏంటో తెలుసుకోవాలంటే సెంబీని వీక్షించాల్సిందే.

    విశ్లేషణ:

    విశ్లేషణ:

    సినిమా అనేది కేవలం వినోదం కోసమే అనేది ఒక మాట. కానీ కొన్ని సినిమాలు మనుషుల ఆలోచనల్లో మార్పు తీసుకొస్తాయి. దేశంలోని చట్టాలు, రాజకీయ నేతల ప్రవర్తనా శైలిపై అవగాహన కల్పించేలా జ్ఞానాన్ని అందిస్తాయి. మరికొన్ని నేటి సమాజంలో జరిగే పరిస్థితులకు అద్దం పడతాయి. అలాంటి సినిమానే సెంబీ. గ్యాంగ్ రేప్స్.. వయసు, వరుసలు అంటూ చూడకుండా చిన్నారులపై, ముసలి వారిపై పడి కామాంధులు చేసే అఘాయిత్యాలకు వారి జీవితాలు చీకటిమయం అవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలా చిన్నారులపై లైంగిక వేధింపులు, రేప్ లు చేసేవారిని కఠినంగా శిక్షించేందుకు తీసుకొచ్చిందే పోక్సో చట్టం. ఈ చట్టం.. దాని ఆవశ్యకత.. దాని వల్ల జరిగే న్యాయం వంటి సామాజిక అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు ప్రభు సాల్మన్.

    ఒక ఘటనపై వచ్చే పుకార్లు..

    ఒక ఘటనపై వచ్చే పుకార్లు..

    మైనా, కుంకీ చిత్రాల తరహాలోనే సెంబీ చిత్రాన్ని వైవిధ్య భరితంగా ఆవిష్కరించారు డైరెక్టర్ ప్రభు సాల్మన్. మనవారిలిపై బామ్మకు ఉన్న ప్రేమను ఎమోషనల్ గా చూపెడుతూ అదే ఎమోషన్ ను చివరి వరకు కంటిన్యూ చేశారు. ఒక పదేళ్ల పాప అది కూడా గిరిజిన జాతికి చెందిన పాప గ్యాంగ్ రేప్ కు గురైతే.. దాన్ని ఎలా రాజకీయం చేస్తారు.. తమ పదవులు కాపాడుకునేందుకు ఆ ఘటనపై ఎలాంటి పుకార్లు సృష్టిస్తారు.. ఈ క్రమంలో సాధారణ ప్రజల ఆలోచన శైలీ ఎలా ఉంటుంది.. ఎలా మారుతుంది.. ప్రజలు ఐకమత్యంగా ఉంటే ఎలా న్యాయాన్ని గెలిపించగలరు.. అనే విషయాలను ఎమోషనల్ గా, ఎంగేజింగ్ తెరపై ఆవిష్కరించారు. లాయర్లకే కాకుండా ప్రజలకు కూడా చట్టాలు తెలిస్తే.. తమను తాము ఎలా కాపాడుకోవచ్చో చెప్పకనే చెప్పారు.

    ఆక్టటుకునే ఎమోషన్..

    ఆక్టటుకునే ఎమోషన్..

    సినిమా ఎక్కువగా బస్సు ప్రయాణంలోనే సాగుతోంది. ఈ ప్రయాణంలోనే అనేక అంశాలను లేవనెత్తారు. పోలీసుల వ్యవహార శైలీ, వారి తప్పులను కప్పిపుచ్చుకునే తీరు.. ఒక సంఘటనను ప్రతిపక్షాలు, రాజకీయనాయకులు తమకు అనుకూలంగా మార్చుకునే తీరుని, జరిగిన సంఘటనలపై తెరపైకి వచ్చే పుకార్లు ఎలా ఉంటయానే తదితర అంశాలను చక్కగా చూపించారు. ఇక ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ కథలోని ఎమోషన్ ను ఫీల్ అయ్యేలా చేస్తాయి. అక్కడక్కడ తాగుబోతుకు, కండక్టర్ మధ్య వచ్చే చిన్నిపాటి కామెడీ కూడా పర్వాలేదనిపిస్తుంది. సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. తెలుగు నెటివిటీకి తగిన పదాలు, డబ్బింగ్ అంతా బాగా సెట్ అయింది.

    ఎవరెలా చేశారంటే..

    ఎవరెలా చేశారంటే..

    సెంబీ సినిమాతో కోవై సరళలో సరికొత్త నట కోణం చూస్తారు. ఇప్పటివరకు ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్స్ చేసిన ఆమె ఈ సినిమాలో మనవరాలికోసం తిరుగుబాటు చేసే బామ్మగా ఫుల్ ఎమోషన్ పండించారు. అలాగే తను చేసి చిన్నపాటి ఫైట్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రలో కోవై సరళ జీవించారని చెప్పవచ్చు. లాయర్ గా అశ్విన్ కుమార్ తోపాటు ఇక మిగతా నటీనటులు కూడా ఎంతో చక్కటి నటన కనబర్చారు. బస్సులో సాగే సన్నివేశాల్లో ప్రతి ఒక్కరి పాత్ర నేటి సమాజంలోని మనుషులకు నిలువెత్తు నిదర్శనంగా ఉండేలా జీవించేశారు. సినిమాటోగ్రఫీ, సంగీతం, బీజీఎం, పాటలు అన్ని సమపాళ్లల్లో సమకూరాయి. ఫైనల్ గా చెప్పాలంటే.. ప్రతి ఒక్కరు కచ్చితంగా చూసే సామాజిక అంశాలున్న సినిమా సెంబీ.

    English summary
    Kovai Sarala Ashwin Kumar Starter Prabhu Solomon Directed Tamil Film Sembi Review And Rating In Telugu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X