For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘క్రాక్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: రవితేజ, శ్రుతీ హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని
  Director: గోపీచంద్ మలినేని

  క్రాక్ విడుదల విషయంలో జరిగిన గందరగోళాన్ని పక్కన పెట్టేద్దాం. మొత్తానికి సమస్యలన్నీ పక్కకి జరిగాయి. థియేటర్లోకి క్రాక్ వచ్చింది. మామూలుగా టీజర్, ట్రైలర్, పోస్టర్లతోనే హైప్ పెంచేశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. క్రాక్ సినిమా రవితేజకు ఎంత ముఖ్యమో దర్శకుడికి తెలుసు. అందుకే ఎలాంటి ప్రయోగాలకు పోకుండా.. రవితేజను ఎలా చూపించాలి.. ఎలా చూపిస్తే జనాలకు నచ్చుతుందనే మైండ్ సెట్‌తోనే క్రాక్ తీశాడు. మరి ఈసినిమా జనాలకు ఏ మేరకు ఎక్కిందో.. అసలు క్రాక్ ఫలితం ఏంటన్నది ఓ సారి చూద్దాం.

  కథ

  కథ

  హీరోయిజాన్ని పండించాలంటే హీరో చేత ఖాకీ చొక్కాను తొడిగించాల్సిందే. అలాంటి హీరోయిజం ఉండి.. తలతిక్కలోడు క్రాక్ లాంటి వాడు పోతరాజు వీర శంకర్ (రవితేజ). ఎదుటి వాడి నుంచి బ్యాక్ గ్రౌండ్ అనే మాట వినిపిస్తే వీర శంకర్‌కు ఎక్కడో కాలిపోద్ది. అవతల ఉన్న వాడి అంతు చూసే వరకు వదలడు. అన్యాయాలను సహించని వీరశంకర్.. ముగ్గురి జీవితాల్లోకి వెళ్తాడు. టెర్రరిస్ట్ సలీమ్, కటారి కృష్ణ, కడప రెడ్డిల కథలను ముగిస్తాడు.

  కథలోని ట్విస్టులు..

  కథలోని ట్విస్టులు..

  మామిడిపండు, మేకు, యాభై రూపాయల నోటు అంటూ ట్రైలర్‌లో ఆసక్తి పెంచారు. ఆ మూడింటికి టెర్రరిస్ట్ సలీమ్, కటారి కృష్ణ, కడప రెడ్డిలకు ఉన్న సంబంధం ఏంటి? వీరశంకర్ చివరకు ఆ ముగ్గురిని ఏం చేశాడు? అసలు ఇందులో కటారి కృష్ణ పాత్ర ఏంటి? ఈ ఇద్దరి మధ్య వైరం ఎలా మొదలైంది? జయమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్) కథ ఏంటి? కళ్యాణి (శ్రుతీ హాసన్) విషయం ఏంటి? వంటి ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానమే క్రాక్.

  ఫస్టాఫ్ అనాలిసిస్..

  ఫస్టాఫ్ అనాలిసిస్..

  క్రాక్ సినిమాను రవితేజ ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ కోసం తీశారన్నట్టుగా అనిపిస్తుంది. మొదటి 20 నిమిషాలు కాస్త స్లోగా గడిచినట్టు అనిపిస్తుంది. ఫ్యామిలీ డ్రామా అంతగా పండకపోవచ్చు. అయితే కటారి కృష్ణ ఎంట్రీ నుంచి సినిమా ఊపందుకుంటుంది. జైల్లో ఉన్న కటారి వీరశంకర్ గురించి చెప్పడంతో కథలో జోష్ అందుకుంటుంది. ఇంటర్వెల్ ఫైట్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. మొత్తానికి మాస్‌కు నచ్చిన ఎలివేషన్స్, ఎన్నో మూమెంట్స్ ఉండటంతో ఫస్టాఫ్ ఈజీగా పాసైపోయింది.

  సెకండాఫ్ అనాలిసిస్..

  సెకండాఫ్ అనాలిసిస్..

  సెకండాఫ్‌లోనూ సినిమా యాక్షన్ మోడ్‌లోనే వెళ్తుంది. ప్రతీ చోటా రవితేజ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం, మాస్ చేత విజిల్స్ వేయించే సీన్లతోనే ముందుకు సాగింది. ఇన్విస్టిగేషన్ సీన్లలోనూ హీరో లాజిక్‌లను ఉపయోగించడు.. అక్కడా కూడా హీరోయిజాన్ని ఎలివేట్ చేసేందుకే దర్శకుడు ప్రయత్నం చేయడం వంటి సీన్లు కాస్త సిల్లీగా అనిపిస్తాయి. అయితే అలాంటి సందర్భంలోనూ రవితేజ యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మాస్‌కు నచ్చే ఎలివేషన్ సీన్లతో సెకండాఫ్‌ను కూడా బోర్ కొట్టించకుండా ముందుకు తీసుకెళ్లాడు. సెకండాఫ్‌లో పెట్టిన యాక్షన్ సీక్వెన్లు మాస్ ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు.

  నటీనటులు..

  నటీనటులు..

  మాస్ పాత్రల్లో రవితేజ ఎలా నటిస్తాడు.. పైగా హీరోయిజాన్ని చాటే పోలీస్ పాత్రల్లో రవితేజ ఇంకెలా రెచ్చిపోతాడే ఇది వరకే చూశాం. చాలా రోజుల తరువాత మళ్లీ రవితేజ తన విశ్వరూపాన్ని చూపించాడు. కొన్ని చోట్ల వయసు వల్ల కాస్త గ్లామర్ దెబ్బతిన్నట్టు కనిపించినా కూడా గడ్డం, కోరమీసం వంటివాటితో కవర్ చేసేశారు. మొత్తంగా ఇది రవితేజ్ మాసిజానికి నిదర్శనంగా నిలిచింది. ఇక రవితేజ తరువాత చెప్పుకోవాల్సింది సముద్రఖని. కటారి కృష్ణ పాత్రలో సముద్రఖని జీవించేశాడు. ఈ పాత్రను దర్శకుడు ఎంతో గొప్పగా మలిచాడు. ఇక వరలక్ష్మీ తన విలనిజాన్ని మరోసారి చూపించింది. శ్రుతీ హాసన్ ఇందులో చేసింది ఏమీ లేదు. రెండు పాటలు ఐదారు సీన్లన్నట్టుగా వ్యవహారం నడిచింది. ఇక కామెడీ కూడా అంతగా వర్కవుట్ కాలేదు. అలీ, సప్తగిరి, అవినాష్ ఇలా అన్ని పాత్రలు అలా వచ్చి వెళ్లేవే.

  దర్శకుడి పనితీరు..

  దర్శకుడి పనితీరు..

  రవితేజ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు.. అలాంటివాడికి ఎలాంటి సినిమా ఇవ్వాలని.. అతని ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు.. ఇలా అన్ని తెలిసిన వాడు గోపీచంద్ మలినేని. అందుకే లాజిక్, ప్రయోగాలు అంటూ ఏమీ లేకుండా రవితేజ కోసం ఈ కథను, పాత్రను రాసుకున్నాడు.అయితే మధ్య మధ్యలో తమిళ సేతుపతి సినిమా ఛాయలు కనిపిస్తుంటాయి. మొత్తంగా రవితేజను మళ్లీ ఎనర్జిటిక్‌గా మాస్‌కు నచ్చేలా మెచ్చేలా తీయడంలో గోపీచంద్ దిట్ట అని మరోసారి నిరూపించుకున్నాడు. కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోయినా.. కొత్తగా చెప్పాలన్న ప్రయత్నం, కథనంతో మెప్పించాలనే ప్రయత్నం పర్వాలేదనిపిస్తుంది. ప్రతీ సీన్ ఎలివేషన్‌లా చూపించడం, ఆడియెన్స్ విజిల్స్ వేసేలా తెరకెక్కించడంలోనే దర్శకుడి ప్రతిభ కనపడుతుంది. మొత్తంగా మాస్ ఆడియెన్స్, రవితేజ ఫ్యాన్స్‌కు క్రాక్‌తో సంక్రాంతి పండుగను ముందే తీసుకొచ్చాడని చెప్పొచ్చు.

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  ఇక క్రాక్ సినిమాను తమన్ తన నేపథ్య సంగీతంతో నిలబెట్టేశాడు. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రతీ సీన్ అంత ఎత్తున నిలబెట్టేశాడు. తమన్ తరువాత చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫర్ గురించి. మెర్సెల్ (అదిరింది) లాంటి చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టేసిన జీకే విష్ణు క్రాక్‌తో మరోసారి తన పనితనాన్ని చూపించాడు. అదిరిపోయే విజువల్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. అందరి కంటే ఎక్కువగా కష్టపడింది మాత్రం ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్. మాస్ చేత పూనకాలు తెప్పించేలా యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేశారు. ఒకదానికి మించి మరోకటి అనేలా డిజైన్ చేశారు. మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా తన డైలాగ్స్‌లతో కేకలు పుట్టించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టున్నాయి.

  ప్లస్ పాయింట్స్

  ప్లస్ పాయింట్స్

  రవితేజ
  నేపథ్య సంగీతం
  దర్శకత్వం

  మైనస్ పాయింట్స్
  కథలో కొత్తదనం లేకపోవడం
  స్పీడ్ బ్రేకుల్లా మారిన పాటలు

  ఫైనల్‌గా..

  ఫైనల్‌గా..

  మొత్తంగా ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్. క్రాక్ పుట్టించేలా రవితేజ మ్యాజిక్ చేసేశాడు. టాలీవుడ్‌లో రవితేజ తన క్రాక్ సినిమాతో సంక్రాంతి పండుగను ముందే తీసుకొచ్చాడు. గోపీచంద్ మలినేని రవితేజల హ్యాట్రిక్ పూర్తయింది.

  నటీనటులు : రవితేజ, శ్రుతీ హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని తదితరులు
  దర్శకత్వం : గోపీచంద్ మలినేని
  నిర్మాత : ఠాగూర్ మధు
  బ్యానర్ : సరస్వతి ఫిల్మ్ డివిజన్
  మ్యూజిక్ : తమన్
  సినిమాటోగ్రఫి : జీకే విష్ణు
  ఎడిటింగ్ : నవీన్ నూలీ
  రిలీజ్ డేట్ : 2021-01-09
  రేటింగ్ : 3

  English summary
  Krack is an Telugu language mass action And Emotional Drama written and directed by Gopichand malineni. The film stars Raviteja and shruthi haasan. This movie released on January 9th 2021.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X